మారేపల్లి రామచంద్ర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 1:
'''మారేపల్లి రామచంద్ర శాస్త్రి''' తెలుగు జాతికి పేరు తెచ్చిన వారిలొ ముఖ్యులు. సేవకు మారుపేరు శాస్త్రిగారు. మారేపల్లి వారిని విశాఖ ప్రజలు "కవి" గారు అని పిలిచేవారు.
==బాల్యం==
వీరు [[కృష్ణా జిల్లా]], కనకపల్లి అగ్రహారంలో [[నవంబరు 3]] [[1874]] లో జన్మించారు కనక దుర్గమ్మ, శ్రీరాములు వీరి తల్లిదండ్రులు. శాస్త్రి గారు పుట్టింది [[కృష్ణా జిల్లా]] అయినా విశాఖపట్టణాన్నే తన స్వంత ఊరు చెసుకున్నారు. ప్రాధమికప్రాథమిక విద్య కనకపల్ల గ్రామంలోనూ, కళాశాల విద్య [[కాకినాడ]] , విశాఖలోనూ సాగింది. 1893 లో విశాఖ హిందూ కళాశాలలో ఎఫ్,ఎ క్లాసులో చేరడనికి శాస్త్రిగారు తొలుత విశాఖలో అడుగు పెట్టారు. విద్యార్థిగా, విశాఖ వచ్చిన రామచంద్ర శాస్త్రిగారు బహుముఖ సేవల ద్వారా ప్రజల హృదయాలకు సన్నిహితుడై తన మనుగడను విశాఖకు అంకితమిచ్చాడు.
 
19 వ శాతాబ్ది ఆఖరు దశకంలో "జాతీయ ఉద్యమం" విద్యావంతులలో నెమ్మది నెమ్మది గా దేశభక్తిని ప్రబోధించ సాగింది. 1893 లో కాంగ్రెస్ నివేదిక చదవడాంతో శాస్త్రిగారిలో "నా దేశం - నా భాష" అనే అభిమానం వచ్చింది. వీరు చదువు చాలించిఅ తరువాత కొద్దిమాసాలు మునసబు కోర్టులో పనిచేశారు. విశాఖ మిషన్ పాఠశాలలో కొన్నేళ్ళు తెలుగు పండితులుగా పనిచేశారు. "దేశ సేవకు భాషా సేవకు తగినవారిని తయారుచేస్తేనే ఉద్యమాలు ఫలవంతం కాగలవని" కవిగారు తొలి నుంచి భావించారు.
పంక్తి 17:
గ్రంధలయాల ఉద్యమాల కూడా రామచంద్ర శాస్త్రి గారు విశేషమైన సేవ చేశారు.1908 లో హిందూ పఠన మందిరంలో విశాఖపట్టణం గ్రంధాలయమును యేర్పాటు చేశారు. దంత కళాశాల, నేత్ర కళాశాల కూడాస్థాపించారు.
==దేశ సేవ==
1914 నుండి 1933 వరకు దేశ స్వాతంత్ర్యోద్యమంలో శాస్త్రి గారు పలురకాలుగా సేవలందించారు. 1916 లో [[కాకినాడ]] లో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. 1918 లో విశాఖపట్టణం జిల్లా ప్రజా సంఘాన్ని స్థాపించారు. వసంతరావు బుచ్చి సుందరవారు గారు వీరికి చేదోడు వాదోడుగా నిలిచారు. 1920 లో కవిగారు, బుచ్చి సుందరవారు పంతులు గారు కలసి నాగపూర్ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభకు ప్రతినిధులుగా వెళ్ళారు. వీరిలో మల్లిమడుగుల బంగారయ్య గారు వెళ్ళారు.
 
1923 లో కాకినాడ కాంగ్రెస్ కు ప్రతినిధిగా వెళ్ళారు. 1928 లో జరిగిన అఖిల భారత ఖద్దరు ప్రచారంలో ఆంధ్ర శాఖ తరపున కవిగారు చాలా ప్రధాన పాత్ర వహించారు. 1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఆరు నెలల కారాగార శిక్ష అనుభవించారు. 1932 లో శాసనోల్లంఘన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక సంవత్సరం వీరికి కఠిన కారాగార శిక్ష విధించబడింది.