పి. బి. శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మల్లిఖార్జున → మల్లికార్జున using AWB
పంక్తి 35:

'''పి.బి.శ్రీనివాస్''' (పూర్తి పేరు '''ప్రతివాది భయంకర శ్రీనివాస్''')<ref name="thehindu.com">[http://www.thehindu.com/features/cinema/veteran-singer-pbs-passes-away/article4617069.ece]</ref> ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. ఈయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే [[కన్నడ]], [[తమిళం|తమిళ]] చిత్రాలలో ఎక్కువ పాటలు పాడాడు. ఆయన [[హిందీ]], [[మలయాళం]] చిత్రాలలో కూడా పాటలు పాడాడు. కన్నడ నటదిగ్గజం [[రాజ్‌కుమార్]]‌ కు ఈయన ఎన్నో గీతాలు ఆలపించాడు. ఈయన [[తెలుగు]], [[కన్నడ]], [[తమిళం|తమిళ]], [[మలయాళం]], [[హిందీ]], [[ఉర్దూ]], [[ఆంగ్లం|ఆంగ్ల]], [[సంస్కృతం|సంస్కృత]] భాషలలో దిట్ట. ఈయన ఎన్నో గజళ్లు వ్రాసాడు. ఈయన గళం [[సువర్ణ గళం]] గా గుర్తింపు పొందింది. ఈయన మొట్టమొదటిసారిగా [[జాతక ఫలం]] చిత్రంలో పాడాడు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు.<ref>[http://en.wikipedia.org/wiki/P_B_Srinivas]</ref>

==జీవితం==
ఆయన ఆంధ్ర పదేశ్ నందు [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[కాకినాడ]] పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు [[సెప్టెంబర్ 22]] , 1930 న జన్మించాడు.<ref>[http://www. name="thehindu.com"/features/cinema/veteran-singer-pbs-passes-away/article4617069.ece]</ref> ఆయన కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. ఆయన పూర్వీకులు [[పసలపూడి]] గ్రామానికి చెందినవారు.

ఆయన ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి [[తెలుగు]], [[కన్నడం ]] , [[తమిళం]] , [[మళయాళం]] , [[హిందీ]] , [[ఉర్దూ]] , [[ఆంగ్లం]] , [[సంస్కృతం]]. ఆయన అనేక గజళ్ల ను తెలుగు లో పాడాడు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను [[గీతా దత్]], [[షంషాద్ బేగమ్]] మరియు [[జిక్కీ]] లతో కలిసి ఆలపించారు. ఆయన [[ఆర్.నాగేంద్ర రావు]] యొక్క [[జాతక ఫలం]] అనే చిత్రం ద్వారా [[తమిళం]], [[కన్నడం]], [[తెలుగు]] చిత్రాల లో పరిచయమైనాడు<ref>[http://www.hindu.com/fr/2008/09/19/stories/2008091951110200.htm The Hindu : Music cannot thrive without rasikas]</ref>. ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లొ ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. [[శాంతినివాసం]] చిత్రం లో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం.

శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "[[మిస్టర్ సంపత్]]" తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ " తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"<ref>[http://www.hindu.com/mp/2009/01/03/stories/2009010353731300.htm The Hindu: Harishchandra (1955)]</ref> లో పాడాడు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో [[పి.సుశీల]] తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ [[రాజ్ కుమార్]] కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే మరియు పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో [[జెమిని గణేశన్]] కు అనేక పాటలు పాడారు. ఆయన పాటలలో ప్రముఖమైనది "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను [[ఎం.జి.రామచంద్రన్]] మరియు [[శివాజీ గణేశన్]] లకు పాడాడు. 1964 లో [[మై భీ లడకీ హూ]] అనే హిందీ చిత్రం లో [[లతా మంగేష్కర్]] తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు [[జెమినీ గణేశన్]], [[ముత్తురామన్]], [[రవిచంద్రన్]], [[జైశంకర్]].

"పావా మనిప్పు" అనే చిత్రంలో [[కన్నదాసన్]] వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను [[ఎం.ఎస్.విశ్వనాథన్]] మరియు [[టి.కె.రామమూర్తి]] గారి సంగీత సారథ్యంలో పాడాడు. అంజలీ పిక్చర్స్ వారి [[ఆడుతా వీట్టుప్పెన్]] అనే చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శ్రీనివాస్ ప్రముఖ గాయనీమణులైన [[పి.సుశీల]] , [[ఎస్.జానకి]], [[పి.భానుమతి]] , [[కె.జమునా రాణి]] , [[ఎల్.ఆర్.ఈశ్వరి]] మరియు [[లతా మంగేష్కర్]] ల సరసన పాడాడు.

ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "[[శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్]]" , "[[ముకుంద మాల]]" , "శ్రీ మల్లిఖార్జున స్తోత్రంమల్లికార్జునస్తోత్రం" , [[పురందరదాసు]] సంకీర్తనలు.

[[చైన్నై]] లోని ఆయన ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయము నందు ఆయనను సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవాడు.<ref>[http://www.hinduonnet.com/2001/06/11/stories/13110464.htm The Hindu : Bit of drive-in nostalgia]</ref>
పంక్తి 67:
| 1955
| ''[[Harishchandra (1955 film)|హరిశ్చంద్ర]]''
| [[Malayalam language|మళయాళం ]]

పంక్తి 87:
| 1960
| ''[[భక్త కనకదాస]]''
| [[Kannada language|కన్నడం ]]
| ''Baagilanu Theredu''
''Eethaneega Vasudevano''
''Badukideno''
''Kula Kula''
''Singara Sheela''

పంక్తి 112:
| 1961
| ''[[విజయనగరద వీరపుత్ర]]''
| [[Kannada language|కన్నడం ]]
| ''Apaara Keerthi''

పంక్తి 272:
| 1967
| ''లగ్న పత్రికె''
| [[Kannada language|కన్నడం ]]
| ''Bramhachaari''
''Gandu Muthina Chandu''
''Illi Yaaru Illa''
''Kanneradu''
''Nijavo Sullo''

పంక్తి 331:

| 1971
| ''[[Sampoorna Ramayanam (1971 film)|సంపూర్ణ రామాయణం ]]''
| తెలుగు
| ''వెడలెను కోదండపాణి''
పంక్తి 367:
| 1973
| ''[[దూరద బెత్త]]''
| [[కన్నడం ]]
| ''Preethine Aa Dyaavru Thanda''
''Kaamanna Kathige''

పంక్తి 377:
| 1973
| ''[[గంధద గుడి]]''
| [[కన్నడం ]]
| ''Ellu hogalla''
''Naavaaduva nudiye kannada''

పంక్తి 402:
| 1975
| ''[[శుభ మంగళ]]''
| [[కన్నడం ]]
| ''Shubha Mangala''
''Hema... Naakondla Naaku''

పంక్తి 496:
==సూచికలు==
{{Reflist}}

[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/పి._బి._శ్రీనివాస్" నుండి వెలికితీశారు