బద్రీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: తీర్ధం → తీర్థం using AWB
పంక్తి 3:
==నగర చరిత్ర==
బద్రీనాథ్ ప్రాంతం హిందూ [[పురాణాలు|పురాణాలలో]] బద్రీ లేక బద్రికాశ్రమం(बद्रीकाश्रम)గా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. [[మహాభారతం]]లో [[శివుడు]] [[అర్జునుడు|అర్జునినితో]] ''పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగానూ- [[కృష్ణుడు]] నారాయణుడిగానూ చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు'' అని చెప్పినట్లు వర్ణించ బడింది.
 
 
[[గంగానది]] భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తి వంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలీ నట్లూ దానిలో [[అలకనంద|అలకనందానది]] ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి. తరువాతి కాలంలో అది [[విష్ణువు|విష్ణుమూర్తి]] నివాసమైనట్లు పురాణ కథనం.
 
 
బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలోని కొండలూ [[వ్యాసుడు|వ్యాస]] విరచితమైన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీ కృష్ణ నిర్యాణానాంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెప్తుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాధ్‌ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది.
 
 
[[స్కంద పురాణం]]లో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది ''స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాధ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు''. [[పద్మ పురాణం]]లో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగానూ భూలోక వైకుఠం గానూ భక్తులచే విశ్వసించ బడుతుంది. [[రామానుజాచార్యులు]], [[మధ్వాచార్యులు]] మరియు [[వేదాంత దీక్షితులు]] ఇక్కడకు వచ్చి బద్రీనాధుని దర్శించుకుని [[ఉపనిషత్తులు|ఉపనిషత్తులకు]], [[బ్రహ్మ సూత్రాలు|బ్రహ్మ సూత్రాలకు]] భాష్యాలు వ్రాశారు.
Line 16 ⟶ 13:
[[బొమ్మ:Badrinath temple.jpg|right|thumb|250px]]
బద్రీనాథ్ లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాధ్‌గుడి. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పంను తప్త కుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్టించి అక్కడ ఒక [[గుడి]] నిర్మించాడు. 16వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్థుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు.
 
 
బద్రీనాథ్ గుడిలో అనేకమార్లు కొండచరియలు విరిగి పడిన కారణంగా నిర్మాణ పునరుద్దరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజుచేత ఈ గుడి విస్తరించబడింది. 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిధిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది.
 
 
బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకు వెళతాయి. ఆలయ నిర్మాణశైలి బుద్దవిహార నిర్మాణశైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తెస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపలభాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకు వెళుతుంది. ఆలయంలోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి.
Line 43 ⟶ 38:
! ప్రధాన దైవం పేరు
! ప్రధాన దేవి పేరు
! తీర్థం
! తీర్ధం
! ముఖద్వార దిశ
! భంగిమ
"https://te.wikipedia.org/wiki/బద్రీనాథ్" నుండి వెలికితీశారు