వికిరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{in use}}
==మాటలలో పోలికలు==
==మాట పుట్టుక==
ఇంగ్లీషులో రేడియేషన్ (radiation), [[రేడియో ధార్మికత|రేడియో ఏక్టివిటీ]] (radioactivity), [[రేడియం]] (radium), రేడియో తరంగాలు (radio waves), [[రేడియో]] (radio), అన్న మాటలలో పోలికలు ఉన్నా వాటి అర్థాలలో తేడాలు ఉన్నాయి.
 
పంక్తి 19:
తెలుగులో “రేడియస్” ని వ్యాసార్ధం అంటాం. కాని ఈ మాట పైన చెప్పిన విధంగా రకరకాలుగా మలచటానికి లొంగదు. వ్యాసం (diameter) అనే మాట కొంచెం లొంగుతుంది. వ్యాప్తి చెందేది వ్యాసం కనుక, అన్ని దిశలలోకీ కిరణాలలా వ్యాప్తి చెందే ఈ రేడియేషన్ అన్న మాట ని తెలుగులో "వ్యాప్తి చెందే కిరణం" లేదా “వ్యాకిరణం” అనొచ్చు. కాని మనకి సంస్కృతంలో “వి” అనే ఉపసర్గ “మిక్కిలి” అనే అర్థాన్ని సూచిస్తుంది: జయం అంటే గెలుపు, విజయం అంటే గొప్ప గెలుపు. చలనం అంటే కదలిక, విచలనం అంటే మిక్కిలి కదలిక. జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, విజ్ఞానం అంటే మరొక రకమయిన బ్రహ్మజ్ఞానం – సైన్సు. ఇదే ధోరణిలో వికిరణం అన్నా వికీర్ణం అన్నా మిక్కిలి వ్యాప్తి చెందేది – రేడియేషన్. అన్ని పక్కలకి ప్రసరించేది కనుక దీన్ని “ప్రసారం” అని కూడ అనొచ్చు. కాని “ప్రసారం” అన్న మాటని బ్రాడ్‌కేస్టింగ్ (broadcasting) కి కేటాయించేసేరు కనుక మనం రేడియేషన్ ని '''వికీర్ణం''' అందాం. దీనికి మరొక రూపం వికిరణం.
 
“రేడియేషన్” అన్న మాటని భౌతిక శాస్త్రంలో వాడినప్పుడు ఈ ప్రవహించేది “శక్తి” అవుతుంది. ఈ శక్తి వేడి రూపంలో ఉంటే ఈ ప్రవాహం “హీట్ రేడియేషన్” లేదా “ఉష్ణ వికీర్ణం" (heat radiation). ఈ ప్రవహించేది కాంతి అయితే అది “కాంతి వికీర్ణం” (light radiation). ఈ ప్రవహించేది “సూక్ష్మ తరంగాలు” అయితే ఇది “సూక్ష్మతరంగ వికీర్ణం” (microwave radiation).
 
మన ఆకాశవాణి వంటి రేడియో కేంద్రాలు, దూరదర్శని వంటి టెలివిషన్ కేంద్రాలు, సెల్ ఫోనులు, ఇళ్లల్లో కంప్యూటర్లలోని "వై-ఫై" - అన్నీ కూడా, విద్యుదయస్కాంత తరంగాల వికీర్ణం మీదనే ఆధారపడి ఉంటాయి. ఆ తరంగాల తరచుదనం అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది కనుక పేరులో మార్పు కనిపిస్తుంది; కొన్ని "రేడియో జాతి" తరంగాలు," కొన్ని "సూక్ష్మ తరంగాలు."
 
రేడియేషన్ అన్న మాటని సాధారణమైన అర్థంతో కూడ వాడవచ్చు. ఆత్మవిశ్వాసంతో పిటపిటలాడుతూన్న వ్యక్తిని ఇంగ్లీషులో “హి ఈస్ రేడియేటింగ్ కాన్‌ఫిడెన్స్” అంటాం.
పంక్తి 55:
 
పరారుణ తరంగాల పక్కన ఉన్న తరంగాలకి “రేడియో తరంగాలు” అన్న పేరు పెట్టకుండా మరేదయినా పేరు పెట్టి ఉంటే మన ప్రాణం సుఖాన్న పడి ఉండేది. ఉదాహరణకి “దీర్ఘ తరంగాలు” అనో “భారీ తరంగాలు” అనో పేరు పెట్టి ఉంటే బాగుండిపోయేది; అప్పుడు మన రేడియోకి ఏ భారవి అనో పేరు పెట్టుకుని ఉండేవాళ్లం!
==మూలాలు==
http://www.airplaycafe.com/etymology-of-radio-describing-the-origin.html
[[వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/వికిరణం" నుండి వెలికితీశారు