ఎలగందల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ జనాభా: clean up, replaced: గ్రామజనాభా → గ్రామ జనాభా using AWB
చి →‎చరిత్ర: clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 103:
ఎలగందల్లో ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే [[ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ]] వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. టర్కీ మరియు ఫ్రెంచి ఇంజనీర్ల ప్రభావం వళ్ళ ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా ఖండపు కోటలతో పోలి ఉన్నది.<ref>[http://books.google.com/books?id=zettAAAAMAAJ&q=elgandal+fort&dq=elgandal+fort Journal of the Andhra Historical Research Society, Volume 35]</ref> ఈ గిరిదుర్గాన్ని తొలుత కాకతీయులు కట్టించారు. 1195లో ప్రసిద్ధ యాదవవంశపు రాజు [[జైతుగి]] ఎలగందుల కోటను వశపరచుకున్నాడు. 1345 నుండి 1439 వరకు బహుమనీ సుల్తానుల పాలనలో ఉన్నది. మొఘలులు ప్రత్యక్షంగా 39 సంవత్సరాల పాటు పాలించారు. కరీంనగర్ గ్రామాన్ని స్థాపించిన సయ్యద్ కరీముద్దీన్ ఎలగందల్ కోటకు ఖిలాదారుగా పనిచేశాడు.<ref>[http://books.google.com/books?id=w9pmo51lRnYC&pg=PA180&dq=elgandal#v=onepage&q=elgandal&f=false Encyclopaedia of the Hindu World: A-Aj, Volume 1 edited by Gaṅgā Rām Garg]</ref> 1905 వరకు జిల్లా యొక్క పాలనా యంత్రాంగమంతా ఎలగందల్ కోట నందే కేంద్రీకృతమై ఉండేది.
 
మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపధ్యంలో యలగందల్ కోట నిర్మించబడి ఉంది. కోటకు ఒకవైపు మానేరు నది, మరోవైపు ఎలగందల్ గ్రామం ఉన్నాయి. ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మానాకొండూరు గ్రామానికి సొరంగమార్గమున్నదని ప్రతీతి.<ref>[http://www.hindu.com/2010/11/18/stories/2010111853140300.htm Wild bears make Elgandal Fort their home - The Hindu]</ref> కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గిరి దుర్గం ఆ తరువాత బహుమనీలు, కుతుబ్‌షాహీలు, ఇమాద్ షాలు, అసఫ్‌జాహీల పాలనలో జిల్లా యొక్క రాజకీయాలకు కేంద్రబిందువైంది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరస్సు 1774లో జాఫర్ ఉద్దౌలా చేత నిర్మించబడింది. ముస్లిం సన్యాసులైన సయ్యద్ షా మునావర్ ఖాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్ మరియు వలీ హైదర్ సాహెబ్ల సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. హైస్కూలుఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.
 
;దో మినార్
"https://te.wikipedia.org/wiki/ఎలగందల్" నుండి వెలికితీశారు