యల్లాప్రగడ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల, కాలేజి → కళాశాల using AWB
పంక్తి 14:
|fields = [[వైద్య శాస్త్రము]]
|workplaces = లెద్రలే ప్రయోగశాల
|alma_mater = మద్రాసు మెడికల్ కాలేజికళాశాల<br />హార్వర్డ్ విశ్వవిద్యాలయం
|doctoral_advisor =
|doctoral_students =
పంక్తి 29:
}}
 
'''యల్లాప్రగడ సుబ్బారావు''' ([[జనవరి 12]], [[1895]] - [[ఆగష్టు 9]], [[1948]]) భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు.<ref>జానమద్ది హనుమచ్చాస్త్రి రచించిన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు- డా. యల్లాప్రగడ సుబ్బారావు. పేజీ 58 - 60 </ref>
 
==బాల్యం - విద్యాభ్యాసం==
ఇయన [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[భీమవరం]] బస్తీలో [[1895]] , [[జనవరి 12]] న జన్మించారు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, హైస్కూల్ చదువులు పుర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఈయనకు చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి ఈయననూ రాజమండ్రి కి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించారు. ఫెయిలయ్యారు. ఇంతలో తండ్రి మరణించాడు. తల్లి పట్టుదలతో [[మద్రాసు]] కు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది.
 
మద్రాసు హిందూ హైస్కూలుఉన్నత పాఠశాల లో చేరి, చదువులో ముందడుగు వేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో కూడా భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఈయనకు బాల్యంలోనే అబ్బింది. సంఘసంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రభావం ఈయన మీద బాగా పొడసూపింది. మద్రాస్, మైలాపూర్ లోని రామకృష్ణ మిషన్ వైపు కూడా ఆకర్షితుడాయ్యారు. వైద్యం నేచి, మిషన్ లో చేరి సన్యాసిగా అందరికీ వైద్య సేవలు అందించాలన్న అలోచన కూడా చేశారు. తన ఆలోచనను వివరింపగా , ససేమిరా అంగీకరించలేదు. బంధువుల సహకారంతో మద్రాసు మెడికల్ కాలేజీ ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్ లో పాసయిన ఈయనను చేర్చిందింది. ఈ ఘటన చరిత్ర గతిని మార్చివేసింది.
 
దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖద్దరు దుస్తులతో కాలేజీకి చెళ్ళీన ఈయన కాలేజీ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో మరో దుర్ఘటన జరిగింది. అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన "స్ఫ్రూ" వ్యాధితో మరణించాడు. ఈ బాధ నుండి కోలుకోలేకముందే, వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా ఇదే వ్యాధికి బలయ్యాడు. ఈ రెండు మరణాలు ఈయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఎంతటి శ్రమపడి అయినా ఈ వ్యాధికి ముందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
పంక్తి 42:
 
సుబ్బారావు భావాలలో నైశిత్వము ఉంది. లోతైన పరిశోధనా పటిమా ఉంది. 1925 ప్రాంతంలో ఆయన అతిసార వ్యాధితో శుష్కించిపోయారు. మద్రాసు లోనే ఉన్న ఆనాటి ప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరులు ఆచంట లక్ష్మీపతి వైద్యం చేసి ప్రాణ రక్షణ చేశారు. ఈ వ్యాధినే ఉష్ణమండల స్ప్రూ వ్యాధిగా నిర్ధారించారు. ఇరువురు సోదరులూ ఈ వ్యాధితోనే మృతి చెందారు. ఆ రోజుల్లో దీనికి సరైన ఔషథం లేదు. రెండు దశబ్దాల అనంతరం దీనికి మందు (ఫోలిక్ ఆసిడ్) కనిపెట్టారు.
 
 
==పరిశోధనలు==
[[హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్]] నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెద్రలే ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన [[హెట్రజాన్]] అను డ్రగ్ [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] చే [[ఫైలేరియాసిస్]] (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు పర్యవేక్షణలో [[బెంజమిన్ డుగ్గర్]] [[1945]]లో ప్రపంచములోనే మొట్టమొదటి [[టెట్రాసైక్లిన్]] యాంటీబయాటిక్ అయిన [[ఆరియోమైసిన్]] ను కనుగొనెను.
 
 
సుబ్బారావు సహచరుడు మరియు [[1988]]లో [[గెట్రూడ్ ఎలియాన్]] తో కలిసి వైద్య శాస్త్ర [[నోబెల్ బహుమతి]] పంచుకొన్న [[జార్జ్ హిచ్చింగ్స్]] మాటల్లో: "[[ఫిస్క్]], అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని [[న్యూక్లియోటైడ్లను]] అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది".
 
 
కొత్తగా కనుగొనిన ఒక [[శిలీంద్రము]](ఫంగస్)నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (''Subbaromyces splendens'') అని నామకరణము చేశారు. [[1947]]లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు.
Line 65 ⟶ 62:
*[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2003031300140300.htm&date=2003/03/13/&prd=seta& హిందూ పత్రిక వ్యాసము]
*[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2003110400020200.htm&date=2003/11/04/&prd=br& రెండవ హిందూ పత్రిక వ్యాసము]
 
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
Line 72 ⟶ 68:
[[వర్గం:తెలుగువారిలో శాస్త్రవేత్తలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం: మద్రాస్ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు]]
 
 
[[వర్గం: మద్రాస్ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు]]
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]
[[వర్గం:నోబెల్ బహుమతి గ్రహీతలు]]