ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల (2) using AWB
పంక్తి 37:
}}
==బాల్యము, విద్యాభ్యాసము==
'''ఖాసా సుబ్బారావు''' [[1896]], [[జనవరి 23]]న [[నెల్లూరు]] జిల్లా [[కావలి]] పట్టణంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు<ref>{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=Eminent Editors|date=2012-11-01|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=37-44}}</ref>,<ref>{{cite news|last1=D. ANJANEYULU|title=The man and the journalist|url=http://chaitanya.bhaavana.net/telusa/apr96/0011.html|accessdate=13 February 2015|work=THE HINDU|date=1996-01-21}}</ref>. ఇతని తల్లి రాంబాయి, తండ్రి సుందర రామారావు. యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు. ఇతని పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతం నుండి [[నెల్లూరు]]కు వలస వచ్చారు. ఇతడు హైస్కూలుఉన్నత పాఠశాల విద్య నెల్లూరులో పూర్తి చేసి [[మద్రాసు]] ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఫిలాసఫీ ప్రధాన విషయంగా డిగ్రీ పుచ్చుకున్నాడు. డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] మద్రాసు కాలేజీలో ఇతనికి గురువు. ఖాసా సుబ్బారావుపై అతని గురువు డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] బోధనల ప్రభావం జీవితాంతం ఉండేది. డిగ్రీ పూర్తి అయిన తరువాత న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించాడు. కానీ కారణాంతరాల వల్ల న్యాయవాద వృత్తి చేపట్టలేదు. పైగా [[రాజమండ్రి]] వెళ్లి ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. నెల్లూరు లోని ఒక మిడిల్ హైస్కూలులోఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ప్రధానోపాధ్యాయుడయ్యాడు. ఈ ఉద్యోగం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. రాత్రి వేళల్లో స్కూలు సమీపంలో ఉన్న 50 మంది వయోజనులకు చదువు చెప్పి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు.
 
==స్వరాజ్య==
పంక్తి 43:
 
==స్వతంత్ర==
స్వతంత్ర భావాలు కలిగిన ఇతడు ఇతర పత్రికలలో ఇమడలేక స్వంతంగా పత్రికను ప్రారంభించాడు. తన మిత్రుడు [[ఉప్పులూరి కాళిదాసు]] సహకారంతో 1946లో '''స్వతంత్ర'''<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19911| ప్రెస్ అకాడెమీ ఆర్కీవ్స్‌లో స్వతంత్ర సంచిక]</ref> అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించాడు. [[1948]]లో [[తెలుగు స్వతంత్ర]]ను ప్రారంభించాడు. ఈ రెండు వారపత్రికలను పదేళ్ల పాటు బలమైన రాజకీయ వార్తాపత్రికలుగా నడిపాడు. తెలుగు స్వతంత్రలో చాలా అపురూపమైన సాహిత్యం ప్రచురితమైంది. ఈ రచనలకు పారితోషికం ఇచ్చే సంప్రదాయం తొలినాళ్ళలో లేకున్నా అప్పటికి ఔత్సాహిక రచయిత అయిన భరాగో ఉత్తరంలో కోరడంతో సరిదిద్దుకుని ఆపైన రచనలకు పారితోషికం ఇచ్చే సంప్రదాయం ప్రారంభించాడు.<ref name="అత్తలూరి నరసింహారావు పదినిమిషాల్లో భరాగో">{{cite book|last1=అత్తలూరి|first1=నరసింహారావు|title=ఇట్లు మీ విధేయుడు (పదినిమిషాల్లో భరాగో పరిచయము వ్యాసం)|date=మార్చి 1990|publisher=విశాఖ సాహితి|location=విశాఖపట్టణం|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Etlu%20Mee%20Vidheyudu%20Bhamidipati%20Rama%20Gopalam%20Samagra%20Katha%20Sankalanam&author1=B.Rama%20Gopalam&subject1=-&year=1990%20&language1=telugu&pages=666&barcode=2020120034473&author2=&identifier1=&publisher1=VISHAKA%20SAHITHI&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/478|accessdate=10 March 2015}}</ref>
 
==ఇతర పత్రికలు==
ఇతడు స్వరాజ్య దినపత్రిక మూతబడిన తర్వాత [[కలకత్తా]]లోని లిబర్టీ, ఇండియన్ ఫైనాన్స్, [[బొంబాయి]]లోని ఫ్రీప్రెస్ జర్నల్, [[మద్రాసు]]లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్, [[ఆంధ్రప్రభ]] దినపత్రికలలో సంపాదకుడిగా పనిచేశాడు.
 
==సత్యాగ్రహం==
పంక్తి 57:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:సంపాదకులు]]
[[వర్గం:1896 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు