నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 33:
పల్లె ` అందునా భారతీయపల్లె ` నిరంతర యుద్ధ క్షేత్రం కదా! పల్లెలోని మనుషులు భూమి చుట్టు అల్లుకొని, కులాలుగా, వర్గాలుగా స్త్రీ పురుషులుగా, అనేక రకాలుగా విడిపోయి, ఒకరితోనొకరు తలపడుతూ, కలబడుతూ, హింసించుకుంటూ, నిత్యం గాయపడి నొప్పులతో బతుకుతారు కదా! దుర్భర దారిద్య్రం, అంతులేని వేదన ` ఊపిరాడని పల్లెటూల్ల పిల్లగాండ్లు ` అలాంటి ఒంటరితనాల్లోంచి ` సంక్లిష్ట భారతీయ పల్లె బతుకు నుంచి బయటపడటానికి పడిన పాట్లు ఈ పుస్తకం...
భూమి కోసం, తాము సృష్టించిన సంపద కోసం ప్రజలు పోరాడుతున్న వేల సంవత్సరాల యుద్ధభూమి పల్లె ` అయినా మాయోపాయాలతో సంపద పంచబడని, దోపిడి చెక్కుచెదరని, స్థితిలో....... సుదీర్ఘ యుద్ధాల్లో కూడా ` తమ సృజనాత్మకతను, జ్ఞానాన్ని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ కొనసాగుతున్న ` తలవంచని కింది కులాల వీరయోధుల కుటుంబంలో నుండి సాగిన జీవనయానం ` ఆయన యుద్ధ బీభత్స అనుభవాలు నన్ను కకావికలు చేశాయి. ఆయనలాగే నాకు ఆ పల్లె కలలు,
నెత్తుర్లు చిమ్మంగా కొట్టుకున్న కలలు...... సుదీర్ఘ యుద్ధాల పీడకలలు, పెనుగులాడినకొద్దీ మునుపటికన్నా లోతుగా దినదినం యుద్ధరంగంలోకి నెట్టబడుతున్న పల్లెలు `. అడవులు` ఎక్కడేమిటి అన్ని రకాల సంపద, వనరులు, సుడిగాలిలా ` ఎలుగడిలా పరివ్యాప్తమౌతున్న యుద్ధరంగంలో నిలబడి చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భంలో ఈ పుస్తకం....రెండు ప్రపంచ యుద్ధాలలో నలిగిన బ్రిటన్‌ అనేక రకాల లోపలి`బయటి కారణాల రీత్యా భారతదేశంలో అధికార మార్పిడి నిర్వహించింది. ఫలితంగా అగ్రకుల భూస్వామ్య, దళారులకు అధికార మార్పిడి ద్వారా రాజ్యాధికారం చిక్కింది. అప్పటికి రష్యాలో ప్రజలు శ్రామికవర్గ పార్టీ నాయకత్వంలో పోరాడి విజయం సాధించారు. సోషలిస్టు మాయోపాయాల నెహ్రూ మార్కు సోషలిజం ` గాంధీ హరిజనోద్ధరణ ` వీటన్నటికి భిన్నంగా అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపర్చిన కింది కులాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ` ఏ రకంగానైతేనేమి ` అనివార్యంగా అగ్రకుల, రాజుల, భూస్వాముల కబంధ హస్తాల్లో వేల సంవత్సరాలుగా చీకటి కొట్టాలుగా మగ్గుతున్న గ్రామాల్లోకి చిరుదీపంలాగా చదువు రంగ ప్రవేశం చేసింది. సర్వసంపదలు సృష్టించి ఆగర్భ దరిద్రంతో ఉత్త చేతులతో మిగిలిన కింది కులాల వారికి, తమ చుట్టూ నివసించే మనుషుల్లోకి కిటికీ తెరిచినట్టయింది. పల్లెల నుండి పట్నాలకు దారులు తెరుచుకుని పల్లె జనంలో చలనం మొదలైంది. అలాంటి బడుల్లో కూడా మొదట పల్లెల్లో బడి సౌకర్యాన్ని అందిపుచ్చుకుని ఎదిగినవాళ్లు ఎక్కువగా అగ్రకులాలవాళ్లే. అదివరకే గ్రామంలో అంతోయింతో సంపద కలిగినోళ్లే. ఇప్పటికి కూడా కింది కులాల నుండి మరీ ముఖ్యంగా అంటరాని కులాల నుండి అనేక గండాలు దాటుకుని పెద్ద చదువులు చదువుకుని నిలదొక్కుకునేది ఒక్క శాతం మాత్రమే ` నూటికొక్కరు. గ్రామాల్లోని మిగతా 70 శాతం ప్రజలు నిత్య దరిద్రంతో ` ఉన్నవి పోగొట్టుకుని ` అప్పటి నుండి ఇప్పటి దాకా యుద్ధరంగంలో హింసల కొలిమిలోనే బతుకుతున్నారు. అయితే ఏదో కారణం చేత చంపబడడం ` లేకపోతే చిన్న వయసులోనే చనిపోవడం నిత్యకృత్యం. ఇలాంటి చిక్కుదారులగుండా కోస్తాంధ్ర, తెలంగాణా సరిహద్దుపల్లె ‘అయ్యోరిగూడెం’ నుండి మొదలైన గోపి నడక మామునూరు హైస్కూలుఉన్నత పాఠశాల చదువు ` విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్‌, ఉస్మానియాలో మెడిసన్‌, కేరళలోని త్రివేండ్రంలోని శ్రీ చిత్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ Ê టెక్నాలజీలో డిఎం కార్డియాలజీదాకా సాగింది. ఒక పల్లెటూరి దళిత పిల్లవాడి కత్తుల వంతెన మీద ప్రయాణం. చావుకు మిల్లీమీటరు దూరంలో ఎన్నిసార్లో చుట్టుముట్టబడి ` తన సహచరులెందరో కూలిపోయినట్టు కూలిపోవాల్సిన వాడే. బహుశా నిత్యం జ్వలిస్తూ ఈ విధంగా మన ముందు నిలబడ్డ గోపీది సాహసయానమేకాక ఒక అపురూప ఘటనే.....
గోపి పల్లె నుండి బయటపడిన కాలం ` అన్ని రకాలుగా ప్రజాస్వామ్యం మాయ బట్టబయలైన సమయం. నెహ్రూ ప్రవచించిన సంక్షేమం `గాంధీ హరిజనోద్ధరణ కానరాలేదు. పేదలు మరింత పేదవాళ్లయ్యారు. అంబేడ్కర్‌ ప్రవచించిన రాజ్యాగంలోని సామాన్యుల హక్కులు కాలరాచివేశారు.... తెలంగాణాలో 1969 వరకు దళిత కులాల పేద పిల్లలు గోపిలాగే అనేక ప్రశ్నలు లేవనెత్తారు. జీవితమొక అగ్నిగుండమని గుర్తించారు. ప్రపంచవ్యాపితంగానే ఇది ఒక కోపోద్రిక్త కాలం. దేశవ్యాప్తంగా రెక్కవిప్పుతున్న రెవల్యూషన్‌ నక్సల్బరీ కొత్తదారిలో యాంగ్రీ యంగ్‌మెన్‌ సమస్తాన్ని ప్రశ్నించడమే కాదు, దాన్ని మార్చాలని బయలుదేరిన యువకులు... 1969లో మొదలైన తెలంగాణా విద్యార్థుల ప్రత్యేక తెలంగాణా పోరాటం ` 1972 వరకు 370 మంది విద్యార్థుల హత్యతో............. మరోమారు తెలంగాణా రక్తసిక్తమైంది. అప్పటికే తెలంగాణా సాయుధపోరాటం చెల్లాచెదురైన అనుభవం తెలంగాణా ప్రజలకున్నది. ఎప్పటిలాగే ప్రజలు తమ బిడ్డలను పోగొట్టుకుంటే ` మోసగాళ్లు అధికారాన్ని, ఆస్తుల్ని పంచుకున్నారు. కాని మానని గాయం మాటేమిటి? అది లోలోపల సలిపింది. రగిలింది. 1974 వరకు తెలంగాణాలో అన్ని యూనివర్సిటీల్లోని ఆ మాటకొస్తే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని ` విప్లవ విద్యార్థులు స్పష్టమైన ప్రణాళికతో ఏకమయ్యారు. రాడికల్‌ విద్యార్థి సంఘంగా ఏర్పడి ‘రోడ్‌ టు రెవల్యూషన్‌’ రచించుకున్నారు. ఉస్మానియాలో జార్జిరెడ్డిని మతవాదులు చంపేశారు. అగ్గిరాజుకుంది. అత్యవసర ప్రకటన తర్వాత దేశమే పెద్ద జైలు అయ్యింది. నిర్బంధంలో జైళ్లు కొత్త రకం పాఠశాలలయ్యాయి. చరిత్రను, రాజకీయాలను, తత్వశాస్త్రాన్ని, ఉత్పత్తి, పంపకం, పెట్టుబడి భూమిక గురించి, భూమి గురించి తెలుసుకున్నారు.
ఎమర్జెన్సీ ఎత్తివేత తరువాత రాడికల్‌ విద్యార్థులు ‘రోడ్‌ టూ రెవల్యూషన్‌’లో భాగంగా తెలంగాణాలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో లీనమయ్యారు. ఈ రోడ్డు మీదికొచ్చి కలిసిన గోపి 1978 ఫిబ్రవరిలో రాడికల్‌ విద్యార్థి సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. చెరుకూరి రాజకుమార్‌ (ఆజాద్‌) ఈ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
పంక్తి 65:
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ ` 500 006.
ఫోన్‌ : 23521849
 
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]