గయ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:బీహార్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల (4) using AWB
పంక్తి 1:
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->{{Infobox Indian Jurisdiction |
native_name = [[గయ]] |
type = city |
latd = 24.695102| longd = 84.991275|
state_name = బీహార్ |
district = [[గయ]] |
leader_title = |
leader_name = |
పంక్తి 22:
}}
 
'''గయ''' [[హిందువు]]లకు మరియు బౌద్ధులకు పవిత్రమైన స్థలం. ఇది [[బీహార్]] రాష్టంలో గయ జిల్లాలో ముఖ్యపట్టణము. రాష్ట్ర రాజధాని [[పాట్నా]] నుండి 100 కి.మీ. దూరంలో ఉన్నది. గయ చారిత్రాత్మక [[మగధ సామ్రాజ్యం]]లో భాగంగా ఉండేది.
 
== చరిత్ర ==
గయ చరిత్ర గౌతమబుద్ధుడు జన్మించిన తరూవాత చరిత్రపుటలలోకి ఎక్కింది. గయకు 11 కిలోమీటర్లదూరంలో బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన బోధగయ ఉంది. గయకు సమీపంలో రైగిర్, నలందా, వైశాలి, పాటలీపుత్ర ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచానికి జ్ఞానభాండాగారమని కీర్తించబడుతుంది. గయ మగధ సామ్రాజ్యంలో ఒక భాగం. పాటలీపుత్ర అగరాన్ని రాజధానిగా చేసుకుని మౌర్యులు సామ్రాజ్యాన్ని పాలించారు. మౌర్యుల కాలంలో నలందావిశ్వవిద్యాలయం ప్రజలను విజ్ఞానవంతులని చేయడంలో ప్రధమస్థానంలో ఉన్నది.
 
క్రీ.శ 1810 లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒకభాగం పూజారులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు మరియు వ్యాపారులు ఉండేవారు. దానిని ఎలహాబాద్ అనేవారు. అయినా తరువాత రోజులలో కలెక్టర్ సాహెబ్ థోమస్ ఈ నగర పునరుద్ధరణ చేసిన తరువాత దీనిని సాహెబ్‍గంజ్ అంటూ వచ్చారు. ప్రఖ్యాత జాతీయవాది బీహార్ విభూతి డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ సింహా జన్మస్థలమిదే. ఈయన బీహార్ మొదటి ఉపముఖ్యమంత్రి అరియు ఆర్ధిక మంత్రిగా పనిచేసారు. అలాగే మగధ చివరి రాజైన టెకారీ జన్మించిన నగరం ఇదే. ప్రఖ్యాత జాతీయవాది మరియు కిసాన్ ఆందోళన్ నాయకుడు అయిన స్వామి సహజానంద సరస్వతి గయలోని నేయమత్ పూర్ వద్ద ఆశ్రమనిర్మాణం చేసాడు. తరువాత అది బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులకు కేంద్రమైంది. ఆయన అంతరంగిక సహాయకుడు వీర్ కేశ్వర్ సింగ్ ఆఫ్ పరిహాస్. భారతీయ జాతీయ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకులందరూ దాదాపు ఈ ఆశ్రమానికి తరచుగా యదునందన శర్మను చూడడానికి విచ్చేసేవారు. యదునందన్ గయజిల్లా రైతులకు నాయకుడుగా కిసాన్ ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తరువాత కాలంలో స్వాతంత్రోద్యమ నాయకుడైన సహజానంద సరస్వతి రైతులకు నాయకత్వం వహించాడు. బీహార్ స్వాతంత్రోద్యమంలో విస్తారంగా పాల్గొన్నది. స్వతంత్రోద్యమ కాలంలో 1922 లో ఇక్కడ దేశ్ బంధు చిత్తరంజన్ దాసు నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ సభ నిర్వహించబడింది. ఆ సభలో ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకులందరూ భాగస్వామ్యం వహించారు. మోహ‍న్‍దాస్ కరమ్‍చంద్ గాంధీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ శర్మా, సరదార్ పటేల్, మౌలానా ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ మరియు శ్రీకృష్ణ సింహా వంటి మహామహులు ఆ సభలో పాల్గొన్నారు.
పంక్తి 39:
== గయలో పవిత్ర క్షేత్రాలు ==
[[దస్త్రం:Mahabodhitemple.jpg|left|thumb|200px|[[Mahabodhi Temple]], [[Bodh Gaya]]. The site where [[Gautam Buddha]] attained [[Bodhi|enlightenment]].]]
బౌద్ధ మరియు హిందూ మతాలకు గయ ఒక పవిత్రనగరం. పవిత్ర ఫలగూ నదీతీరము స్నాన ఘట్టాలు మరియు ఆలయాలు బారులుతీరి ఉంటాయి. రావిచెట్లు, అక్షయవట్, మర్రిచెట్టు మొదలైన పవిత్ర వృక్షాలుకూడా ఉన్నాయి. పవిత్రమైన మంగళగౌరి ఆలయం సతీదేవి ఛాతీ భాగం పడిన ప్రదేశమని విశ్వసించబడుతుంది. ప్రస్తుతం ఫలగూ నదీతీరంలో చాలా ప్రసిద్ధిచెందిన విష్ణుపద్ ఆలయం ఉంది. అక్కడ విష్ణుపాద ముద్రలు ఉంటాయి. గయాసురుని చాతి మీద భగవానుడైన మహావిష్ణువు పాదము ఉంచిన ప్రదేశం ఇదే. విష్ణుపద్ ఆలయంలో భూమిహార్ బ్రాహ్మణులు వంశపారంపర్యంగా పూజలు చేస్తుంటారు. పక్కన జిల్లా అయిన హజారీభాగ్ నుండి వచ్చే గయావాల్ పాండాలు ఇక్కడ పూజాదికాలకు యాత్రీకులకు సహకరిస్తుంటారు. 18వ శతాబ్దిలో దేవి అహల్యాభాయ్ హోల్‌కర్ ప్రస్తుత ఆలయం నిర్మించింది. విష్ణుపద్ ఆలయంలోని పాదముద్రలను బౌద్ధసంప్రదాయం కూడా గౌరవిస్తుంది. భగవాన్ విష్ణుమూర్తి దశావతారాలలో బుద్ధుడు ఒకడని విశ్వసించబడుతుంది.
 
గయ హిందువులకు పితరులకు మోక్షప్రదాయకమైన నగరంగా విశ్వదించబడుతుంది. ఇక్కడ పితరులకు పిండప్రదానం చేస్తే పితరులకు మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. శ్రీరాముడు తనదేవేరి సీత మరియు సోదరుడైన లక్ష్మణునితో ఇక్కడకు వచ్చి పితరులకు పిండప్రదానం చేసినట్లు పురాణకథనాలు వర్ణిస్తున్నాయి. పిండప్రదానానికి ముందు స్నానమాచరించడానికి శ్రీ రాముడు వెళ్ళిన సమయంలో మహారాజైన దశరధుని హస్తాలు రెండు సీతముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఉన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడుగగా సీతాదేవి పిండములు తీసి ఆచేతులలో ఉంచింది. శ్రీరాముడు తిరిగి వచ్చి యధావిధిగా పిండములు ప్రదానము చేసే సమయములో అతని తండ్రి ఆ పిండాలను స్వీకరించక పోయినప్పుడు శ్రీరాముడు ఆశ్చర్యానికి గురికావడమే కాక బాధపడ్డాడు. తరువాత సీతాదేవి జరిగిన ఉదంతం వివరించి సాక్ష్యానికి ఫలగు నది సమీపంలో నిలిచియున్న బ్రాహ్మణుని, ఆవుని మరియు రావిచెట్టుని పిలిచింది. రావిచెట్టు తప్ప మిగిలిన వారు సాక్ష్యం చెప్పలేదు. ఆవు శ్రీ రామునికి భయపడి, ఫల్గూ నది శ్రీరాముని నుండి అధిక వరాలు పొందడానికి, బ్రాహ్మణుడు శ్రీరాముని నుండి అధిక దక్షిణ పొందాలని నిజం చెప్పలేదు. సీతాదేవి ఆముగ్గిరిని శపించిందని పురాణకథనం వివరిస్తుంది. శాపకారణంగా ఫల్గూనదిలో నీరు ఇంకి పోయింది. రావిచెట్టును శాశ్వతంగా జీవించమని వరమిచ్చింది. ఈ రావిచెట్టు ఆకులు ఎప్పుడూ రాలవని ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని ఇక్కడివారు చెప్తున్నారు. అక్షయ వృక్షం అంటే ఎప్పటికీ క్షయం పొదని వృక్షం అని అర్ధం. కరువు సమయంలో కూడా ఈ వృక్షం పచ్చగా ఉటుంది.
 
బౌద్ధులకు ఒక ప్రాముఖ్యమైన యాత్రాక్షేత్రం. ఈ బ్రహ్మయోని కొండల మీద బుద్ధుడు ఆదిత్య పర్యాయ సూత్రాలను బోధించాడని చెప్పబడుతుంది. ఈ సూత్రాలను విన్న వేలాది అగ్నిఆరాధకులు. జ్ఞానసిద్ధి పొందారని అందువలన ఈ కొండని గయాసిసా అని పిలిచేవారని చెప్పబడుతుంది.
పంక్తి 61:
 
== అహార విధానం ==
బీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో జానాదరణ పొందిన చిరుతిండి పదార్ధాలు గయలో కూడా ఉన్నాయి. గయలో వాడుకలో ఉన్న ఇతర ఆహారాలు మాత్రం అసలైన బీహార్ సంప్రదాయాన్ని అనుసరించి ఉంటాయి. వీటిలో చాలా ప్రసిద్ధమైన ఆహారం సత్తు. లిత్తి-చోఖా, లిత్తి, పిత్త, పూయా, మరుయా- కా- రోటీ, బారీ-డాల్, సత్తు-కా-రోటీ, బైగాన్ భరతా, సుఖాతా, కోపల్కీ కోఫ్తా మరియు చాలా ప్రసిద్ధమైన టవర్ చౌక్ చాట్ మొదలైనవి.
 
=== మిఠాయిలు ===
పంక్తి 69:
* మరొక రుచికరమైన తీపి వంటకం కేసరియా పేడాను పాల మీగడ, చక్కెర మరియు కేసరి రంగుతో చేస్తారు. కేసరుయా పేడా చౌక్ ప్రాంతంలో అత్యధికాంగా తయారు చేయబడుతుంది.
* బీహారులో పలురకాల లై లభ్యమౌతుంది. గయలో కూడా ఇది లభ్యమౌతుంది. లై అనే ఇఠాయిలో వాడే ప్రధాన ఆహారపదార్ధం రాం దన విత్తనాలు. రాం దన విత్తనాలను తయారుచేసి కోవా మరియు చక్కెరలతో కలిపి ఈ వంటకాన్ని తాయారు చేయచేస్తారు.
* అనారసా కూడా కోవా ఆధారిత స్వీటు. దీనిని నూనెలో వేపి చెక్కెరతో కలిపి తయారుచేస్తారు. ఇవి గుండ్రగా మరియు గోళాకారంగా లభిస్తాయి. ఈ మిఠాయి మీద నువ్వులు చల్లుతారు.
 
ఈ మిఠాయిలను తడిలేకుండా ప్యాక్ చెయ్యడానికి, నిలువ ఉంచడానికి మరియు రవాణాచేయడానికి వీలుగా తయారుచేస్తారు. బెంగాలి మిఠాయిలు అనేకం చక్కెర పాకంలో నానవేసి తయారు చేయబడతాయి కనుక అవి తడిగా ఉంటాయి. ఇంటికి వచ్చిన బంధువులు తిరిగిపోయే సమయంలో వారికి ఈ మిఠాయిలను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం వాడుకలో ఉంది. గయలో దారివెంట విక్రయించబడుతున్న ఆలూ-కచాలూ మరియు చాట్, ఆలూ-కచాలూలు ఉడికించిన బంగాళదుంపలు , కారం, జిలకరపొడులను చల్లి , ఉప్పు చింతపండు రసం కలిపి తయారుచేస్తారు. వీటిని ప్రత్యేకంగా బటామోర్ ప్రాంతంలో విక్రయిస్తుంటారు. పాఠశాలలు మరియు కళాశాలల సమీపంలో వీటిని తప్పక విక్రయిస్తుంటారు. వీటిని పిల్లలు మరియు యువత అధికంగా ఇష్టపడుతుంటారు.
పంక్తి 78:
 
== విద్య ==
గయలో బిహార్ స్కూల్ ఎక్జామినేషన్ స్కూల్‌కు అనుసంధానంగా జిలా స్కూల్, హాది హాష్మి హైస్కూల్ఉన్నత పాఠశాల, క్వాస్మీ హైస్కూల్ఉన్నత పాఠశాల, హరిదాస్ సెమినరీ ( టౌన్ స్కూల్), థియోసాఫికల్ మోడెల్ స్కూల్, గయ హైస్కూల్ఉన్నత పాఠశాల, అనుగ్రహ కన్యా విద్యాలయ, మహావీర్ స్కూల్, గవర్నమెంట్ హైస్కూల్ఉన్నత పాఠశాల విద్యాసేవలందిస్తున్నాయి. న్యూ డిల్లీకి చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కి అనుసంధానంగా రెండు కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వేతర పాఠశాలలో అధికంగా ఐ.సి.ఎస్.ఈ మరియు సి.బి.ఎస్.ఈ బోర్డుకు అనుసంధానంగా పనిచేస్తున్నాయి.
బ్రిటిష్ శకానికి ముందుగా స్థాపించబడి కొన్ని శతాబ్ధాలుగా విద్యాసేవలందిస్తున్న సర్వస్వతంత్ర విద్యా సంస్థ అయిన నజారెత్ అకాడమీ ఇప్పటికీ తన సేవలు కొనసాగిస్తున్నది. బోధగయలో ఉన్న ఒకేఒక పాఠశాల నాన్ గరవర్నమెంట్ ఆర్గనైజేషన్ చారిటబుల్ స్కూల్ అయిన జ్ఞాన్ నికేతన్ స్కూల్ తనవంతుకు విద్యాసేవలందిస్తుంది. ఈ పాఠశాల పరిసరరాంతాలలో ఉన్న ఐదు గ్రామాలలోని 200 మంది బాలబాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నది. క్రేన్ పాఠశాల ఐదు దశాబ్ధాలుగా విద్యాసేవలు అందిస్తూ నగరంలో అత్యున్నత పాఠశాలగా పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్నది. ఈ పాఠశాలలో విద్యార్ధులకు విద్యాబోధనతో ఇతర రంగాలలో శిక్షణాతరగతులు నిర్వహిస్తూ విద్యార్ధులకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్నది.
 
పంక్తి 85:
 
== సైనిక శిక్షణ ==
ఒ.టి.ఎ గయ లో 2011 జూలై నుండి ఇండియన్ ఆర్మీ మూడవ ప్రీ కమీషన్ ట్రైనింగ్ (పి.టి.సి) ని 750 మంది కేడెట్స్‌కు శిక్షణ అందిస్తున్నది. ఈ శిక్షణ లక్ష్యం ఇండియన్ ఆర్మీకి అత్యుత్తమ సైనిక అధికారులను అందించడమే. ఈ అకాడమీ గయలోని కొండప్రాంతమైన పహర్‌పూర్ లోని 870 ఎకరాల ఎస్టేట్‌లో ఈ సైనిక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయబడింది. గయ నుండి బోధ్ గయకు పోయే మార్గంలో దాదాపు గయ రైల్వే స్టేషనుకు 7 కిలోమీటర్ల దూరంలో ఈ శిక్షణా కేంద్రం ఉన్నది. ఇక్కడి నుండి అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన బోధగయ కనిపిస్తూ ఉంటుంది. బ్రిటిష్ ఆర్మీలో అంతర్భాగమైన గయ కంటోన్మెంటు రెండవప్రపంచ యుద్ధానికి ముందే స్థాపించబడి ఉంది.
 
ఈ అకాడమీ ప్రారంభించే ముందు జెండా ఎగురవేసే కార్యక్రమం రూపొందించబడింది. మతాతీత ఇండియన్ ఆర్మీని రూపొందించే ప్రయత్నంలో ఈ అకాడమీ స్థాపించబడింది. వివిధ మతాలకు చెందిన పుస్తకాలలో ఈ సైనికశిక్షణాకేంద్రం గురించి ప్రస్తావించబడింది. ఈ అకాడమీలో ఇతర సైనిక అకాడమీలలో చోటు చేసుకోని కళల శిక్షణకు వసతి చేయబడింది. ఈ అకాడమీ చిహ్నంలో రెండు భాగాలున్నాయి. పైభాగంలో బూడిద రంగు ఉంటుంది. కింది భాగంలో రక్తవర్ణం ఉంటుంది. రక్తవర్ణం ఉన్న కింది భాగంలో ధర్మచక్రాన్ని కాపాడుతున్న రెండు కత్తులు ఒకదానిని ఒకటి అడ్దగిస్తున్నట్లు ఉంటాయి. దానికి కింది భాగంలో దేవనాగరి లిపిలో " శౌర్య, జ్ఞానం, సంకల్పం " అనే నినాదం ఉంటుంది.
పంక్తి 103:
రోజువారీగా నేరుగా బస్సులు పాట్నా, నలందా, రైగర్, వారణాసి, రాంచి, టాటా, కొల్‌కత్తా మరియు ధన్‌బాద్ వంటి నగరాలకు ప్రయాణ వసతి కల్పిస్తున్నవి. 2011లో బీహార్ స్టేట్ రోడ్ ట్రాన్స్‍పోర్ట్ కార్పొరేషన్ ముజాఫర్పూర్, పాట్నా, మోతిహరి, హజారీభాగ్ మరియు రామ్‌ఘర్ నగరాలకు ఎ.సి మెర్సిడెజ్ బెంజ్ లగ్జరీ సర్వీసులను అందిస్తుంది. కొలకత్తా మరియు ఢిల్లీలను కలుపుతూ ఉన్న జాతీయ రహదారి 2 గయ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రహదారి గయను పాట్నా, రాంచి, జంషెడ్ పూర్, బొకారో, రూర్‌కెలా, దుర్గాపూర్, కొలకత్తా, వారణాసి, అలహాబాద్, కాన్పుర్, ఢిల్లీ, అమృతసర్ అలాగే పాకిస్థానీ నగరాలైన పెషావర్ మరియు లాహోర్ నగరాలకు ప్రయాణ వసతి కల్పిస్తుంది. జాతీయ రహదారి 83 రహదారి గయను పాట్నాతో అనుసంధానిస్తున్నది. గయను నవాడా, రైగర్ మరియు బీహార్ సఫారి లతో జాతీయ రహదారి 82 కలుపుతుంది. గయ నుండి పాట్నా వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలని యోచిస్తున్నారు.
=== విమానాశ్రయం ===
బీహార్ మరుయు ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం గయ బోధ్ గయ మద్యలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే. ఇక్కడి నుండి కొలంబో మరియు శ్రీలంకలకు ఒక మార్గం అలాగే బాంకాక్, థాయ్‌లండ్,[[ సింగపూర్ ]] ,[[భూటాన్]] మరిక మార్గంలో విమానాలు నడుపబడుతున్నాయి. గయ విమానాశ్రయం నుండి ఇండియన్ ఎయిర్ లైన్ దేశీయవిమానాలు , శ్రీలంకన్ ఎయిర్ లైన్స్, మహిన్ లంక, డ్రక్ ఎయిర్, జెట్ ఎయిర్వేస్ , థాయ్ ఎయిర్వేస్ , మరియు ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు, రోజువారీగా నడుపబడుతున్నాయి. ఈ విమానాశ్రయం నుండి ఢిల్లి, కొలకత్తా మరియు వారణాసి నగరాలకు విమానాలు నడుపబడుతున్నాయి.
 
== ఇవి కూడా చూడండి ==
* [[మాతృగయ]]
{{మూస:బీహార్ లోని జిల్లాలు}}
{{భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు}}
 
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు