సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 36:
source = http://content-ind.cricinfo.com/india/content/player/35320.html
}}
ప్రపంచ [[క్రికెట్]] క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు '''సచిన్ రమేష్ టెండుల్కర్''' (Sachin Ramesh Tendulkar) (Hindi: सचिन रमेश तेंदुलकर). క్రికెట్ క్రీడకు [[భారతదేశం]] లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ [[ఏప్రిల్ 24]], [[1973]] న జన్మించాడు.
 
16-నవంబర్-2013 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన [[భారత రత్న]]ను ఈయనకు ప్రకటించింది. ఈ విధం గా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.
 
ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. [[1990]] దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ [[ముంబాయి]] కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. [[2002]] లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో [[ఆస్ట్రేలియా]] కు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ మరియు వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన [[వివియన్ రిచర్డ్స్]] ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది.<ref name="Tribune1">[[The Tribune]] http://www.tribuneindia.com/2002/20021214/sports.htm#4. December 14, 2002</ref> . [[2003]] లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో [[వివియన్ రిచర్డ్స్]] కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కన్పిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం.టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో [[అక్టోబర్ 17]], [[2008]] న వెస్ట్‌ఇండీస్ కు చెందిన [[బ్రియాన్ లారా]] ను అధికమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ <ref>[http://www.hindu.com/2004/12/12/stories/2004121202031900.htm 'The Hindu' Indian National Newspaper Article on Sachin's 34th Century]</ref> <ref>[http://news.bbc.co.uk/sport2/hi/cricket/6462199.stm BBC Article, ''Tendulkar achieves superhero status'']</ref> అని పిలువబడే సచిన్ [[1989]] లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. [[1997]]-[[1998]]లో [[రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న]] పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చినాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్..<ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=31d055a3-de0d-4969-93bf-82b186a50fc0&ParentID=d9bbcde5-db34-4afc-87e6-e4cca6aa5033&MatchID1=4586&TeamID1=1&TeamID2=8&MatchType1=1&SeriesID1=1151&MatchID2=4588&TeamID3=3&TeamID4=5&MatchType2=1&SeriesID2=1152&PrimaryID=4586&Headline=Tendulkar+is+Warne's+greatest Tendulkar is Shane Warne's Greatest]</ref><ref>[http://www.india-today.com/itoday/04051998/sport.html The Best Cricketer]</ref><ref>[http://www.dawn.com/2004/03/17/spt2.htm Tendulkar is greatest, says Pakistan's Captain Inzamam]</ref>
 
ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. [[1990]] దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ [[ముంబాయి]] కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. [[2002]] లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో [[ఆస్ట్రేలియా]] కు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ మరియు వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన [[వివియన్ రిచర్డ్స్]] ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది.<ref name="Tribune1">[[The Tribune]] http://www.tribuneindia.com/2002/20021214/sports.htm#4. December 14, 2002</ref> . [[2003]] లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో [[వివియన్ రిచర్డ్స్]] కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కన్పిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం.టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో [[అక్టోబర్ 17]], [[2008]] న వెస్ట్‌ఇండీస్ కు చెందిన [[బ్రియాన్ లారా]] ను అధికమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ <ref>[http://www.hindu.com/2004/12/12/stories/2004121202031900.htm 'The Hindu' Indian National Newspaper Article on Sachin's 34th Century]</ref> <ref>[http://news.bbc.co.uk/sport2/hi/cricket/6462199.stm BBC Article, ''Tendulkar achieves superhero status'']</ref> అని పిలువబడే సచిన్ [[1989]] లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. [[1997]]-[[1998]]లో [[రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న]] పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చినాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్..<ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=31d055a3-de0d-4969-93bf-82b186a50fc0&ParentID=d9bbcde5-db34-4afc-87e6-e4cca6aa5033&MatchID1=4586&TeamID1=1&TeamID2=8&MatchType1=1&SeriesID1=1151&MatchID2=4588&TeamID3=3&TeamID4=5&MatchType2=1&SeriesID2=1152&PrimaryID=4586&Headline=Tendulkar+is+Warne's+greatest Tendulkar is Shane Warne's Greatest]</ref><ref>[http://www.india-today.com/itoday/04051998/sport.html The Best Cricketer]</ref><ref>[http://www.dawn.com/2004/03/17/spt2.htm Tendulkar is greatest, says Pakistan's Captain Inzamam]</ref>
 
ఫిబ్రవరి 24, 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్ట మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే డిసెంబర్ 19, 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు. [[2012]], [[మార్చి 16]]న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.
Line 50 ⟶ 49:
== క్రీడా జీవితం ==
=== ప్రారంభ రోజులు ===
తన గురువు [[రమాకాంత్ అచ్రేకర్]] సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ హైస్కూల్ఉన్నత పాఠశాల హాజరైనాడు.పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాలలో పేస్ బౌలింగ్ లో శిక్షణ కోసం MRF పేస్ అకాడమీకి హాజరైననూ ఇంటికి పంపివేయబడ్డాడు. సచిన్ ను పంపిన మహానుభావుడు పాతతరపు ఫాస్ట్ బౌలర్ [[డెన్నిస్ లిల్లీ]] బ్యాటింగ్ పై దృష్టి సారించు అని ముక్తంగా చెప్పడం, అతని సలహాను సచిన్ పాటించడంతో నేటి ప్రపంచంలో మనం ఒక ప్రముఖ బ్యాట్స్‌మెన్ చూస్తున్నాం. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు కోచ్ వెంబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయుటలో బోర్ అనిపించేది. అందుకు కోచ్ స్టంప్స్ పైన ఒక రూపాయి నాణేన్ని ఉంచి సచిన్ ను ఔట్ చేసిన బౌలర్ కు ఇచ్చేవాడు. సెషన్ మొత్తం సచిన్ ఔట్ కానిచో ఆ నాణెం సచిన్ కే దక్కేది. అలాంటి 13 నాణేలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి.
 
పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో [[వినోద్ కాంబ్లీ]] తో కలిసి [[1988]] లో 644* పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాదించి 320 కి పైనా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్ లో సచిన్ వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. [[హైదరాబాదు]] లో [[2006]] లో జరిగిన అండర్-13 మ్యాచ్ లో ఇద్దరు కుర్రాళ్ళు ఈ రికార్డును ఛేధించే వరకు 18 సం.ల పాటు సచిన్-కాంబ్లీ లదే రికార్డుగా కొనసాగింది.
Line 60 ⟶ 59:
టెండుల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించిననూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మాత్రం కుడిచేతినే ఉపయోగిస్తాడు. టెండుల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ [[1989]] లో [[పాకిస్తాన్]] పై ఆడి కేవలం 15 పరుగులకే [[వకార్ యూనిస్]] బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్ లో తన తొలి అర్థశతకం పూర్తిచేశాడు. [[డిసెంబర్ 18]] న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సీరీస్ తర్వాత న్యూజీలాండ్ టూర్ లో రెండో టెస్ట్ లో 88 పరుగులు సాధించాడు. [[1990]] [[ఆగష్టు]] లో [[ఇంగ్లాండు]] లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జరిగిన మ్యాచ్ లో తన తొలి శతకం సాధించాడు. [[1991]]-[[1992]] లో ఆస్ట్రేలియా టూర్ లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. [[షేన్‌వార్న్]] టెస్ట్ మ్యాచ్ లో రంగప్రవేశం చేసిన [[సిడ్నీ]] మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత [[పెర్త్]] మ్యాచ్ లో మరో సెంచరీ సాధించాడు.
 
టెండుల్కర్ ప్రతిభ [[1994]]-[[1999]] సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు చేరింది. [[1994]] లో [[ఆక్లాండ్]] వన్డే లో టెండుల్కర్‌ను ఓపెనర్‌గా పంపించారు..<ref> [http://www.cricinfo.com/link_to_database/ARCHIVE/1993-94/IND_IN_NZ/IND_NZ_ODI2_27MAR1994.html Cricinfo Ind v NZ March 27, 1994 match report]</ref> ఆ వన్డేలో 49 బంతుల్లోనే 82 పరుగులను సాధించాడు. అతని తొలి వన్డే సెంచరీ [[సెప్టెంబర్ 27]] , [[1994]] లో ఆస్ట్రేలియాపై సాధించాడు. తొలి వన్డే శతకానికి 79 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.
 
'''1996 ప్రపంచ కప్''' : తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ [[1996]] [[ప్రపంచ కప్ క్రికెట్]] లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా నిల్చినాడు. ఆ ప్రపంచ కప్ లో 2 శతకాలు సాధించాడు.[[1998]] ప్రారంభంలో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం పై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్ లో తన ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. అందులోనే [[షేన్‌వార్న్]] , [[రోబర్ట్ సన్]] లను లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సీరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కొనడం విశేషం.<ref>SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. ''Down Memory Lane - Shane Warne's nightmare''. November 29, 2004</ref>
Line 67 ⟶ 66:
 
[[దస్త్రం:Master Blaster at work.jpg|left|thumb|300px|క్రీజ్ నందు ఉద్యుక్తూడవుతున్న సచిన్.]]
'''షేర్‌వార్న్ కు సింహస్వప్నం''' : [[1998]] [[ఆస్ట్రేలియా]] పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ [[షేన్‌వార్న్]] బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం<ref> SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. Down Memory Lane - Shane Warne's nightmare. November 29, 2004 </ref>.
 
'''నాయకత్వం''' : ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా [[అజహరుద్దీన్]] నుంచి సచిన్ తెండుల్కర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కాని ఈ సీరీస్ కొత్త ప్రపంచ చాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. <ref> [http://aus.cricinfo.com/db/ARCHIVE/1999-2000/IND_IN_AUS/SCORECARDS/IND_AUS_T2_26-30DEC1999.html Cricinfo match report AUS v IND 3rd Test 26-30 December 1999]</ref> ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.అతని తర్వాత [[2000]] లో [[సౌరవ్ గంగూలీ]] కి కెప్టెన్సీ ఇవ్వబడింది.
 
'''2003 ప్రపంచ కప్''' : [[2003]] ప్రపంచ కప్ లో సచిన్ 11 మ్యాచ్ లలో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చాడు. కాని ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయినా మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్ నే వరించింది. 2003-04 లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో [[సిడ్నీ]] లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు.
Line 75 ⟶ 74:
'''అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు''' : [[డిసెంబర్ 10]], [[2005]] న [[ఢిల్లీ]] లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో [[శ్రీలంక]] పై ఆడుతూ 35 వ టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. దీంతో ఇది వరకు [[సునీల్ గవాస్కర్]] పేరిట ఉన్న 34 టెస్ట్ సెంచరీల రికార్డును విచ్ఛిన్నమైంది.
 
'''పేలవ ప్రదర్శన''' : [[మార్చి 19]], [[2006]] తన సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండు తో జరిగిన మ్యాచ్ లో 21 బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసేసరికి ప్రేక్షక మూక మైదానంలోకి చొచ్చుకొనివచ్చింది.<ref> India Daily http://www.indiadaily.org/entry/sachin-tendulkar-booed-by-wankhede-crowd/ March 20, 2006</ref> క్రీడా జీవితంలో అది తనకు తొలి అనుభవం. అదే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సచిన్ దే అత్యధిక స్కోరు. <ref>http://ind.cricinfo.com/db/ARCHIVE/2005-06/ENG_IN_IND/SCORECARDS/ENG_IND_T3_18-22MAR2006.html</ref> అయిననూ ఆ 3 టెస్టుల సీరీస్ లో అతనిది కనీసం ఒక్క అర్థ శతకం కూడా లేదు.
 
పాకిస్తాన్ XI తో జరిగిన అనధికార ట్వంటీ-20 మ్యాచ్ లో సచిన్ 21 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా నిల్చి ఇంటర్నేషనల్ XI గెలుపుకు కారణమయ్యాడు.
 
జనవరి [[2007]] లో వెస్ట్ఇండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో 76 బంతుల్లో సెంచరీ సాధించి తన 41 శతకాన్ని పూర్తిచేసి రెండో స్థానంలో ఉన్న [[సనత్ జయసూర్య]] కంటే 17 శతకాలు ఆధిక్యంలో ఉండి తిరుగులేదనిపించుకున్నాడు. <ref>http://usa.cricinfo.com/db/STATS/ODIS/BATTING/ODI_MOST_100S.html</ref>
 
'''2007 ప్రపంచ కప్''' : వెస్ట్ఇండీస్ లో జరిగిన 2007 ప్రపంచ కప్ లో [[రాహుల్ ద్రవిడ్]] నేతృత్వంలో లోయర్ ఆర్డర్ బ్యాంటింగ్ చేసి పేలవమైన్ స్కోరు సాధించాడు. [[బంగ్లాదేశ్]] పై 7 పరుగులు, [[బెర్ముడా]] పై 57<sup>*</sup> పరుగులు, [[శ్రీలంక]] పై సున్నా పరుగులు చేసాడు. దాంతో భారత జట్టు కోచ్ [[గ్రెగ్ చాపెల్]] సోదరుడైన [[ఆస్ట్రేలియా]] మాజీ కెప్టెన్ [[ఇయాన్ చాపెల్]] సచిన్ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని [[ముంబాయి]] కి చెందిన మధ్యాహ్న పత్రికలో కాలమ్ రాసి సంచలనం సృష్టించాడు. <ref>http://news.bbc.co.uk/sport1/hi/cricket/6509767.stm</ref>
 
ఆ తర్వాత [[బంగ్లాదేశ్]] పర్యటనలో సచిన్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ పొంది విమర్శకులకు నోళ్ళు మూయించాడు. దక్షిణాఫ్రికా తో సీరీస్ లో కూడా రెండు సార్లు 90 కి పైగా పరుగులు చేసాడు. <ref>http://www.icc-cricket.com/icc/odi/</ref> ఇందులోనే అత్యధిక పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సీరీస్ చేజిక్కించుకున్నాడు. [[ఫ్యూచర్ కప్]] లో కూడా 66 పరుగుల సరాసరితో టాప్ స్కోరర్ గా నిల్చినాడు. <ref>http://stats.cricinfo.com/rsavind/engine/records/batting/most_runs_career.html?id=3258;type=tournament</ref>
 
'''11000 పరుగులు పూర్తి''' : [[జూలై 28]], [[2007]] నాటింఘమ్ టెస్టు రెండో రోజున సచిన్ టెస్ట్ క్రికెట్ లో 11000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన మూడవ బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. కాగా భారతీయులలో ఈ ఘనత పొందిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు.<ref> http://content-usa.cricinfo.com/engvind/content/current/story/304149.html </ref>
 
[[2007]] అక్టోబర్ లో ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సీరీస్ లో 278 పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోరర్ గా నిల్చినాడు. <ref>http://stats.cricinfo.com/ci/engine/records/batting/most_runs_career.html?id=3250;type=series</ref>
 
[[1997]] లో విజ్డెన్ పత్రిక సచిన్ ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. ఆ క్యాలెండర్ సం.లో సచిన్ తొలిసారిగా 1000 పరుగులు పూర్తిచేసాడు. ఆ తర్వాత [[1999]], [[2001]], మరియు [[2002]] లలో కూడా సచిన్ ఈ ఘనతను సాధించాడు.
Line 173 ⟶ 172:
=== మీడియా గుర్తింపులు ===
* [[2003]] [[ఆగస్ట్]] లో జీన్యూస్ ద్వారా దేశంలో గొప్ప క్రీడావ్యక్తిగా ఎన్నికైనాడు.<ref>[http://us.indiantelevision.com/headlines/y2k3/aug/aug122.htm]</ref>
* [[2006]] [[నవంబర్]] లో టైంమేగజైన్‌చే ఏషియన్ హీరోలలో ఒకడిగా గుర్తింపు పొందినాడు.<ref name="Asian Heroes">http://web.archive.org/web/20020426045056/http://www.time.com/time/asia/features/heroes/index.html </ref>
* [[2006]] [[డిసెంబర్]] లో స్పోర్ట్స్ పర్సన్ ఆప్ ది ఇయర్‌గా పేరుసంపాదించినాడు.<ref>http://blog.india-guides.com/search/label/Amitabh%20Bachchan</ref>
* [[2010]] [[అక్టోబర్]] [[లండన్]] లో జరిగిన ''ద ఆసియన్ అవార్డ్స్'' వేడుకల్లో ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ మరియు పీపుల్స్ ఛాయస్ అవార్డులు గ్రహించాడు.
Line 308 ⟶ 307:
| [[అడిలైడ్]]
| 2007/08
| మొదటి ఇనింగ్స్: 153 (3x6)(13x4)
 
2వ ఇన్నింగ్సు: 13 (1x4);
Line 314 ⟶ 313:
 
=== వన్డే అవార్డులు ===
టెండుల్కర్ వన్డే క్రికెట్ లో 14 సార్లు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ (MoS) మరియు 56 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (MoM) అవార్డులు పొందినాడు.<ref>{{cite web | title=Sachin Tendulkar - MoM & MoS Awards in ODI Cricket| url=http://statserver.cricket.org/guru?sdb=player;playerid=1934;class=odiplayer;filter=basic;team=0;opposition=0;notopposition=0;season=0;homeaway=0;continent=0;country=0;notcountry=0;groundid=0;startdefault=1989-12-18;start=1989-12-18;enddefault=2007-03-19;end=2007-03-19;tourneyid=0;finals=0;daynight=0;toss=0;scheduledovers=0;scheduleddays=0;innings=0;result=0;followon=0;seriesresult=0;captain=0;keeper=0;dnp=0;recent=;viewtype=aro_awards;runslow=;runshigh=;batposition=0;dismissal=0;bowposition=0;ballslow=;ballshigh=;bpof=0;overslow=;overshigh=;conclow=;conchigh=;wicketslow=;wicketshigh=;dismissalslow=;dismissalshigh=;caughtlow=;caughthigh=;caughttype=0;stumpedlow=;stumpedhigh=;csearch=;submit=1;.cgifields=viewtype}} </ref> టెస్ట్ మ్యాచ్ లు ఆడే అన్ని దేశాలపై ఆడి మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందినాడు. UAE (2 మ్యాచ్ లు), [[నెదర్లాండ్]] (1 మ్యాచ్ ) మరియు [[బెర్మూడా]] (1 మ్యాచ్ ) లపై మాత్రమే అతడు వన్డే క్రికెట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందలేడు.
 
'''మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు :'''
Line 497 ⟶ 496:
 
== బయటి లింకులు ==
 
* [http://content-usa.cricinfo.com/india/content/player/35320.html Cricinfo Profile]
* [http://tendulkar.co.in Sachin Tendulkar | Life, Legend and Beyond]
Line 517 ⟶ 515:
{{2007 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు|state=collapsed}}
{{2011 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు|state=collapsed}}
 
[[వర్గం:1973 జననాలు]]
[[వర్గం:భారత క్రికెట్ కెప్టెన్లు]]
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు