భద్రిరాజు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
కొన్ని వివరాలు
పంక్తి 1:
{{విస్తరణ}}
ఇరవైయవ శతాబ్దపు [[తెలుగు సాహితీకారులు#భాషాశాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు|భాషాశాస్త్ర కోవిదులలో]] ఎన్నదగ్గ వ్యక్తి '''భద్రిరాజు కృష్ణమూర్తి'''. భాషాతత్వం, భాషా ప్రయోజనం, భాషా వికసనములపై [[గిడుగు రామమూర్తి]] వలె వీరికి కూడా చక్కటి అవగాహన ఉంది. భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. భాషాశాస్త్ర విజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంధాలు, వ్యాసాలు రచించాడు.
{{సమాచారపెట్టె వ్యక్తి
 
[[వర్గం:భాషా శాస్త్రజ్ఞులు| name = భద్రిరాజు ]]కృష్ణమూర్తి
| residence =
| other_names =
| image =
| imagesize = 130 px
| caption =
| birth_name = భద్రిరాజు కృష్ణమూర్తి
| birth_date = 19 జూన్, [[1928]]
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation = ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse =
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
ఇరవైయవ శతాబ్దపు [[తెలుగు సాహితీకారులు#భాషాశాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు|భాషాశాస్త్ర కోవిదులలో]] ఎన్నదగ్గ వ్యక్తి '''ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి'''. భాషాతత్వం, భాషా ప్రయోజనం, భాషా వికసనములపై [[గిడుగు రామమూర్తి]] వలె వీరికి కూడా చక్కటి అవగాహన ఉంది. భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్ర విజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన Dravidian Languages పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంధాలు, వ్యాసాలు రచించాడు.
 
==జీవిత విశేషాలు==
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో 1955లో భాషాశాస్త్రంలో పి.హెచ్.డీ. పట్టం పొందిన భద్రిరాజు కృష్ణమూర్తిగారు 1928 లో ప్రకాశం జిల్లా లో జన్మించారు. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలలో 1949-62 మధ్య లెక్చరర్ గాను, రీడర్ గానూ, 1962 నుంచి 1986 దాకా ఉస్మానియా విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర శాఖలో తొలి ఆచార్యులుగానూ పనిచేసారు. 1986 నుంచి 1993 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ గా ఉన్నారు. అమెరికా లోని వివిధ విశ్వవిద్యాలయాల లోనూ, ఆస్ట్రేలియా, జపాన్ విశ్వవిద్యాలయాల్లోనూ ఆహుత ఆచార్యులుగా పని చేసారు. రష్యా, జర్మనీ, ప్రాన్స్, కజికిస్తాన్ మొదలైన దేశాల్లో పర్యటించారు. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పరిశోధన సంస్థల్లో ప్రతిష్ఠాత్మకమైన పెలోషిప్‌లు, సభ్యత్వాలు పొందారు. [[ఎమెనో]] గారి ప్రియ శిష్యుడు. అమెరికన్ లింగ్విస్టిక్ సొసైటీ గౌరవ సభ్యుడిగా 1985లో ఎన్నికయ్యారు. భారత కేంద్ర సాహిత్య అకాడెమీ నిర్వాహక సభ్యుడుగా కూడా కొంతకాలం పని చేసారు.
 
==ప్రసిద్ధ రచనలు==
 
ఈయన రచించిన Dravidian Languages (2003) ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథం. 'Comparative Dravidian linguistics: Current perspectives' అన్న పుస్తకం ఈయన 1955 నుంచి 1998 వరకూ ప్రచురించిన వ్యాసాల్లో ముఖ్యమైన 21 వ్యాసాల సంకలనం. కృష్ణమూర్తిగారి సిద్ధాంత గ్రంథం "Telugu Verbal Bases" (1961) ద్రావిడ భాషాధ్యయన రంగంలో ఒక మైలురాయిగా పండితులు భావిస్తారు. 'Konda or Kubi: A dravidian language' (1969), జె.పి.ఎల్. గ్విన్ తో కలసి రాసిన 'A Grammar of Modern Telugu', డి. కోస్టిస్, ఏ మిట్టర్ తో కలిసి రాసిన 'A short outline of Telugu Phonetics' (1977), 'Papers on Socio-linguistics' (1998), తెలుగు వ్యాసాల సంకలనం "భాషా, సమాజం, సంస్కృతి" కృష్ణమూర్తి గారి ముఖ్య గ్రంథాలు. ఇవిగాక అనేక ఆంగ్ల గ్రంథాలకు సంపాదకత్వం, సహ సంపాదకత్వం వహించారు.
 
 
తెలుగులో కృష్ణమూర్తిగారు తయారు చేసిన వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలు మాండలిక పరిశోధనా రంగంలో కొత్త ద్వారాలు తెరిచాయి. వారు సంపాదకత్వం వహించిన "తెలుగు భాషా చరిత్ర"కు ఇప్పటివరకు అయిదు ముద్రణలు వచ్చాయి. మూడు భాగాలుగా వచ్చిన "తిక్కన పదప్రయోగ కోశా"నికి ఆయన సహసంపాదకులు. వయోజన విద్యకు సంబంధించిన వాచాకాలు, ప్రవాసాంధ్రులకు తెలుగు నేర్పే వాచాకాలు కూడా రాసారు.
 
 
ఇవిగాకా ఈయన ఇంగ్లీష్‌లోనూ తెలుగులోనూ రచించిన తొంభై వ్యాసాలు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమైనాయి. తను 24 యేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు వ్రాసిన ఛందోబద్ధ పద్యాలను "చిన్ననాటి పద్యాలు" అన్న పుస్తకంగా ప్రచురించారు.
 
==శిష్యవర్గం==
[[చేకూరి రామారావు]]
 
[[బూదరాజు రాధాకృష్ణ]]
 
[[పి. ఎస్. సుబ్రమణ్యం]]
 
[[జె. పి. ఎల్. గ్విన్]]
 
==మూలాలు, వనరులు==
# Comparative Dravidian linguistics: Current perspectives by Bhadriraju Krishnamurti. Oxford: Oxford University Press, 2001. ISBN 0198241224.
# DRAVIDIAN LANGUAGES by Krishnamurti, Bhadriraju. Cambridge University Press, 2003 ISBN 9780511060373.
# భాషా, సమాజం, సంస్కృతి - భద్రిరాజు కృష్ణమూర్తి, నీల్‌కమల్ పబ్లికేషన్స్ ప్రై. లిమిటెడ్, 2000 ISBN 81-86804-46-3
 
 
 
[[వర్గం:భాషా శాస్త్రజ్ఞులు]]
[[వర్గం:1928 జననాలు]]
[[వర్గం:ప్రకాశం జిల్లా ప్రముఖులు]]