"వికీపీడియా:వికీ సాంప్రదాయం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(అనువాదం పూర్తి, మూస తొలగింపు)
చి
వికీపీడియా సంపాదకులు అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు చెందినవారు. ప్రతి ఒక్కరికీ విభిన్న ఆలోచనా ధోరణులు, భిన్న అభిప్రాయాలు, దృష్టికోణాలు ఉండవచ్చు. ఇతర సంపాదకులను, సభ్యులను గౌరవించడము, ఆదరించడం, కలసికట్టుగా సమన్వయముగా తెలుగులో ఇలాంటి మహోన్నత విజ్ఞాన సర్వస్వము రూపొందించుటకు ఒక కీలకాంశము.
 
ఈ పేజీలో కొన్ని '''వికీ మర్యాద ''' యొక్క కీలకాంశాలు ఇవ్వబడినవి. వికీ మర్యాద( (వికీపీడియాలో పనిచేసేటప్పుడు ఇతరులతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు, సలహాలు) ఇంకా మౌలిక నిర్దేశాల కొరకు [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు|విధానాలు, మార్గదర్శకాలు]] పేజీ చూడండి.
 
==మర్యాదకు మూలసూత్రాలు==
 
* [[వికీపీడియా:విశ్వసించండి|అవతలివారిని విశ్వసించండి]]. స్వేచ్ఛగా దిద్దుబాటు చెయ్యడమనే సూత్రంపై ఆధారపడి వికీపీడియా పనిచేస్తూంది. ఎవరైనా ఇక్కడకు వచ్చి తమతమ విజ్ఞానాన్ని పంచవచ్చు.
* ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలనుకుంటారో, మీరు వారితో అలాగే వ్యవహరించండి.
* దయచేసి మర్యాదగా ఉండండి!
**ప్రజలు మిమ్మల్ని చూడలేరు, మీ మూడ్ ఎలా ఉందో వారికి తెలియదు. కఠినమైన, పరుషమైన పదజాలం దురుసుగా అనిపిస్తాయి. మీరు ఎంచుకునే పదజాలం విషయంలో జాగ్రత్తగా ఉండండి — ఇతరులు అర్థం చేసుకునేది, నీరుమీరు చెప్పదలచుకున్నది కాకపోవచ్చు.
* చర్చాపేజీల్లో [[వికీపీడియా:సంతకం|సంతకం చెయ్యండి]] (వ్యాసాల్లో కాదు!).
* [[వికీపీడియా:రచయితలకు సూచనలు|ఓ అంగీకారానికి రావడం కోసం ప్రయత్నించండి]].
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/166138" నుండి వెలికితీశారు