వెల్లుల్లి: కూర్పుల మధ్య తేడాలు

in use విస్తరణ చేస్తున్నాను
పంక్తి 21:
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. ప్లేగుతో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వుని కరిగించేది, పరాన్నభుక్కులని పరిగెట్టించేది, కోలెస్టరాల్‌ని కత్తిరించేది, కేన్‌సరు రాకుండా కాపాడేది, రక్తపు పోటుకి పోట్లు పొడిచేది, వీర్యాన్ని వృద్ధి చేసేది, దోమలని తరిమికొట్టేది, తామరని తగ్గించేది, జీర్ణశక్తిని పెంచేది, రక్షక శక్తిని రక్షించేది, ఇలా వెల్లుల్లి సుగుణాలని గుక్క తిప్పుకోకుండా ఎంతసేపయినా చెప్పుకోవచ్చు; దాని కంపు సంగతి ఎత్తకుండా ఉన్నంత సేపూ.
 
'''వెల్లుల్లి''' (Garlic) యొక్క వృక్షమొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (''Allium sativum''). [[ఉల్లి]] వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉండదు. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం; నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండీ నేటివరకు ఆదరణలో ఉన్న [[సిద్ధ]], [[ఆయుర్వేద|ఆయుర్వేదం]], యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించేరు. సంప్రదాయిక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతీలో వాడుకలో ఉన్న ఏలియం సిపా అనేది వెల్లుల్లి సారమే. ఇటీవల ఎల్లోపతీ వైద్యం కూడ వెల్లుల్లి విలువని గుర్తించింది.
 
లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం; నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను మరియు ఆయుర్వేద ఔషధంగాను ఉపయోగించ బడుతోంది.
==చరిత్రలో వెల్లుల్లి==
మనకి తెలిసినంతవరకు, ప్రపంచంలోనే అతి ప్రాచీన వైద్య గ్రంథంగా కొనియాడబడుతూన్న, ఈజిప్టులో దొరికిన, ఎబర్స్ పపైరస్ (Ebers Papyrus) లో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఎంతో మంచి స్థితొలో ఉన్న ఈ గ్రంథం సా. శ. పూ. 1552 నాటిదని శాస్త్రవేత్తలు తేల్చేరు. కాని ఇది సా. శ. పూ. 3400 లో రచించిన అసలు గ్రంథానికి ఒక నకలు మాత్రమేనని అభిజ్ఞావర్గాలలో గట్టినమ్మకం ఉంది. ఈ పుస్తకంలో వెల్లుల్లితో 22 రోగాలని కుదిర్చే పద్ధతులు కనిపించేయిట.
"https://te.wikipedia.org/wiki/వెల్లుల్లి" నుండి వెలికితీశారు