ఋష్యశృంగుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
శుద్ధి మూస తీసేశాను, బయటి లింకులు చేర్చాను
పంక్తి 1:
 
{{శుద్ధి}}
[[బొమ్మ:Rushyasrunga.jpg|thumb|right|200px|వేశ్యల చేత ఆకర్షితుడైన ఋష్యశృంగుడు]]
'''ఋష్యశృంగ మహర్షి''' గురించి [[రామాయణము]]లోని [[బాల కాండము]]లో వివరించబడింది. [[దశరథుడు|దశరథుని]] మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు. సుమంతుడు తాను [[సనత్కుమారుడు]] ఋషులకు చెప్పుచుండగా విన్నట్లు దశరథ మహారాజు అశ్వమేథ యాగము , పుత్రకామేష్టి యాగము చేస్తాడని విన్నాడు. <!--ఈ వాక్యం స్పష్టంగా లేదు. సరిచూడగలరు.-->
 
==ఋష్యశృంగుడి జననము - విద్యాబుద్ధులు ==
[[కశ్యపుడు|కశ్యప ప్రజాపతి]] కుమారుడైన [[విభండకుడు]] అనే మహర్షి ఒక రోజు సంధ్యవార్చుకొనుచుండగా, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న [[ఊర్వశి]] కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించినాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది కృతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడిని చూస్తే జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.
 
==అంగరాజ్యములో క్షామము==
పంక్తి 23:
ఋష్యశృంగుడి దేవాలయము ఇప్పటి [[శృంగేరి]]కి 10 మైళ్ల దూరములో [[కిగ్గా]] అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.
 
 
==బయటి లింకులు==
[http://www.valmikiramayan.net/bala/sarga9/bala_9_prose.htm వాల్మీకి రామాయణం నుండి ఋష్యశృంగుడీ గురించి]
[http://www.sringeri.net/temples/kigga.php కిగ్గా లొ నున్న దేవాలయం గురించి శృంగేరి శారదా మఠం వారి వెబ్ సైటు నుండి]
{{రామాయణం}}
 
<!--Interwiki links--->
[[en:Rishyasringa]]
"https://te.wikipedia.org/wiki/ఋష్యశృంగుడు" నుండి వెలికితీశారు