విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==దేశాటన==
సన్యాసం తీసుకొన్నాక, విద్యారణ్యుడు [[కాశీ]] కి తీర్థయాత్రకు వెడతాడు. అక్కడ నుండి [[వ్యాసుడు|వేదవ్యాసుల]] మార్గదర్శకత్వములో బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ శ్రీ విద్య గ్రహిస్తాడు. ఉత్తర భారత యాత్ర పూర్తి చేశాక తిరిగి దక్షిణ భారత దేశానికి వచ్చి [[హంపి]] సమీపంలో ఉన్న మాతంగ పర్వతం వద్ద యోగ నిష్ఠలో కొంత కాలం గడిపాడు. అలా కాలం గడుపుతున్న సమయములో ఒక రోజు భారద్వాజస [[గోత్రం|గోత్రీకుడైన]] మయన కుమారులు మాధవ ,శయనలు విద్యారణ్యుడి దర్శనం చేసుకొంటారు. అప్పుడు విద్యారణ్యుడు తాను అసంపూర్తిగా రచించి వదిలి పెట్టిన వేదభాష్యాలను పూర్తి చేయమని వారితో చెబుతాడు. ఆ వేదభాష్యాలకు వారి పేర్లు పెట్టమనికూడా చెబుతాడు.ఆవిధంగా అవి శయనీయం, మాధవీయం అని ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ తరువాత కాలంలో వీరు [[మొదటి హరిహర రాయలు|హరిహరరాయలు]] , [[మొదటి బుక్క రాయలు|బుక్క రాయలు]] ఆస్థానంలో మంత్రులుగా పనిచేశారు.
 
==విజయ నగర సామ్రాజ్య స్థాపన==
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు