జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 52:
[[బాపు]] తరువాత సంతకం అక్కర్లేని అతి కొద్దిమంది వ్యంగ చిత్రకారులలో జయదేవ్ ఒకడు. చూడగానే ఇది జయదేవ్ కార్టూన్ అని తెలిసిపోతుంది. ఇతడు వేసిన కార్టూన్లలో చక్కటి పొందిక అకట్టుకునే ఆకర్షణ. బొమ్మ చిత్రీకరణలో ఎటువంటి విపరీతాలు (మిడి గుడ్లు, అసహజ రూపాలు వంటివి) ఉండవు. సహజత్వానికి దగ్గరగా కార్టూన్ల లోని అయా పాత్రల ముఖ భంగిమలు, సదర్భానికి సరిపొయే ముఖ కవళికలు హాస్యప్రధానంగా చిత్రీకరించటంలో జయదేవ్ దిట్ట. అలాగే కార్టూన్లలోని సంభాషణలు ఎంతో పొదుపుగా చక్కటి భాషలో ఉండి అరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి. బొమ్మకి వ్యాఖ్యా, లేదా వ్యాఖ్యకు బొమ్మా అని తటపటాయించేవారికి, వ్యాఖ్య లేకుంటే బొమ్మ అర్ధం కాదు. బొమ్మలేకుంటే వ్యాఖ్య అర్ధంకాదు. కార్టూన్లలో ఈ రెండిటికీ మంచి సంబంధం ఉండాలి అని వివరిస్తారు జయదేవ్.
 
'నేపాళం', 'భూపాళం', '(తాగుబోతు) బ్రహ్మం', 'మిస్టర్ నో', 'బాబాయ్-అబ్బాయ్' వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించాడు.
 
== గౌరవాలు==
"https://te.wikipedia.org/wiki/జయదేవ్" నుండి వెలికితీశారు