Difference between revisions of "గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్"

m
→‎పాఠం: clean up, replaced: ౧ → 1 (19), ౨ → 2 (9), ౩ → 3 (4), ౪ → 4, ౫ → 5 (2), ౬ → 6, ౭ → 7 (2), ౮ → 8 (2), ౯ → 9 (8), ౦ → 0 (6) using AWB
m (clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (2) using AWB)
m (→‎పాఠం: clean up, replaced: ౧ → 1 (19), ౨ → 2 (9), ౩ → 3 (4), ౪ → 4, ౫ → 5 (2), ౬ → 6, ౭ → 7 (2), ౮ → 8 (2), ౯ → 9 (8), ౦ → 0 (6) using AWB)
==పాఠం==
జి.ఎన్.యు సార్వత్రిక సార్వజనిక అనుజ్ఞాపత్రము
వెర్షన్ 2.0, జూన్ ౧౯౯౧1991
కాపీరైట్ (c) ౧౯౮౯1989, ౧౯౯౧1991 ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్, Inc.
౫౯59 టెంపుల్ ప్లేస్ - సూట్ ౩౩౦330, బోస్టన్, MA ౦౨౧౧౧02111-౧౩౦౭1307, యు ఎస్ ఏ
 
ఎవరైనను ఈ అనుజ్ఞాపత్రమును మాటకు మాటగా అనుకరణ చేయబడిన ప్రతులను అనుకరించవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు, కానీ ఎట్టి మార్పులూ చేయరాదు.
 
మేము రెండు విధాలుగా మీ హక్కులను కాపాడటం జరుగుతుంది:
(1) సాఫ్ట్ వేర్ కు కాపీరైట్ కల్పించడం, మరియు
(2) మీకు ఈ లైసెన్సు సమర్పించుట ద్వారా, సాఫ్ట్ వేర్ ను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు/లేక మార్పులు చేయుటకు మిమ్మల్ని చట్టపరంగా అనుమతించడం.
 
అంతేకాక, మూలకర్తల మరియు మా రక్షణార్దం, ఈ ఉచిత సాఫ్ట్ వేర్ కు ఎటువంటి పూచీ లేదని, కాబట్టి అందరూ దీనిని గ్రహించగలరని ఆశిస్తున్నాము. ఒక వేళ ఎవరైనా సాఫ్ట్ వేర్ కు మార్పులు చేసి, అట్టి సాఫ్ట్ వేర్ ను వ్యాప్తి చేసిన, స్వీకర్తలు వారి వద్ద ఉన్నది మూలప్రతి కాదని గ్రహించవలెనని మా మనవి, దీనివలన, ఇతరులు సృష్టించిన సమస్యల కారణాన మూలకర్త గౌరవానికి ఎటువంటి భంగము కలుగదు.
 
జి.ఎన్.యు సార్వత్రిక సార్వజనిక అనుజ్ఞాపత్రము కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు మార్పులు చేయుటకు గల నియమనిబంధనలు
0. ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్ నందైనను లేక మరే ఇతర రచనలందైనను కాపీరైట్ పొందిన వారిచే ఈ సార్వత్రిక సార్వజనిక లైసెన్సు నియమాలకనుగుణంగా వాటిని పంపిణీ చేయవచ్చునని తెలియజేసిన యెడల, అట్టి వాటికి ఈ లైసెన్సు అమలు చేయబడుతుంది. కాపీరైట్ చట్టప్రకారం, క్రింద తెలుపబడిన "ప్రోగ్రామ్" అనగా అటువంటి ప్రోగ్రామ్ లేదా రచన, మరియు "ప్రోగ్రామ్ ఆధారిత రచన" అనగా ప్రోగ్రామ్ లేదా ప్రోగ్రామ్ నిష్పన్న రచన: ఇంకా చెప్పదలచిన, ప్రొగ్రామ్ లేక ప్రోగ్రామ్ లోని కొంత భాగము కలిగిన రచన, మాటకు మాటగా లేక మార్పులు చేయబడిన మరియు/లేక వేరొక భషలోనికి అనువదించబడిన రచన. ( ఇకనుండి, "మార్పుగావించుట"లో నిరభ్యంతరముగా "అనువదించుట"ను చేర్చుట జరిగినది.) లైసెన్సు పొందు ప్రతివారినీ "మీరు" అని సంభోధించుట జరిగినది.
 
కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు మార్పులు చేయుటకు తప్ప ఇతరేతర వినియోగానికి ఈ లైసెన్సు వర్తించదు; అట్టి వినియోగం దీని పరిధిని దాటి ఉన్నవి. ఎటువంటి పరిమితులు లేకుండా ప్రోగ్రామ్ ను అమలు చేయవచ్చు, మరియు ప్రోగ్రామ్ యొక్క ఔట్ పుట్ నందు ప్రోగ్రామ్ ఆధారిత రచనలు ఉన్న యెడల, అట్టి ఔట్ పుట్ కు ఈ లైసెన్సు వర్తిస్తుంది (ప్రోగ్రామ్ ను అమలు చేయుటకు ఎటువంటి సంబంధము లేకుండా). దాని యధార్ధం ఏమిటన్నది, ప్రోగ్రామ్ ఏమి చేస్తుందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. `
 
1 మీరు అన్ని ప్రతులపై సంబంధిత కాపీరైట్ నోటీసు మరియు పూచీకత్తు యొక్క అవధులు స్పష్టంగా మరియు తగిన విధంగా తెలియజేసిన యెడల, మీకు అందిన ప్రోగ్రామ్ యొక్క సోర్స్ కోడ్ ను, ఎటువంటి మాధ్యమం ద్వారానైనా, మీరు మాటకు మాటగా అనుకరణ చేసి పంపిణీ చెయ్యవచ్చు; ఈ లైసెన్సును ఉదహరింపబడిన అన్ని నోటీసులు ఎట్లున్నవి అట్లే యుండవలయును మరియు పూచీకత్తు లేనియెడల తత్సంబంధిత నోటిసులు ఉండవలెను; మరియు మరే ఇతర ప్రోగ్రామ్ స్వీకర్తలకైనను ప్రోగ్రామ్ తో పాటుగా ఈ లైసెన్సు ప్రతిని అందజేయవలయును.
 
భౌతికంగా ప్రతిని మీరు అందించుటకు గాను మీరు రుసుము కోరవచ్చు, మరియు మీ ఇచ్చానుసారం మీరు పుచ్చుకొను రుసుముకు బదులుగా పూచీకత్తు బధ్రత కల్పించవచ్చు.
 
2. మీరు క్రింద తెలుపబడిని అన్ని షరతులకు లోబడిన, ప్రోగ్రామ్ యొక్క మీ ప్రతికి లేక ప్రతులకు లేదా అందులోని ఏదయినా భాగమునకు మార్పులు చేయవచ్చు, తద్వారా ప్రోగ్రామ్ ఆధారిత రచన రూపొందించవచ్చు , మరియు పైన సెక్షన్ 1 నందు పేర్కొనబడిన నియమాలననుసరించి మీరు మీ మార్పులను లేక రచనలను అనుకరణ మరియు పంపిణీ చేయవచ్చు :
 
అ) మార్పులు చేయబడిన ఫైల్సు నందు మీరు మార్పులు చేసినారని తెల్పుతూ మరియు మార్పు గావించబడిన దినము తెలుపుతూ స్పష్టమైన నోటీసులు కలిగి యుండవలెను.
అంతే గాక, కేవలం ఒక స్టోరేజి వాల్యూమ్ నందు గాని లేక పంపిణీ మాధ్యమంనందు గాని, ప్రోగ్రామ్ ఆధారితం కాని రచనను ప్రోగ్రామ్(లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన)కు జతచేసిన యెడల, అటువంటి ఇతర రచనలు ఈ లైసెన్సు పరిధిలోకి తీసుకురావటం సాధ్యపడదు.
 
3. వీటికి తోడుగా, మీరు ఈ క్రింద తెలుపబడిన వాటిలో ఏదేని చేసిన యెడల, మీరు ఆబ్జక్ట్ కోడ్ లేక ఎక్సిక్యూటబుల్ రూపంలో ఉన్న ప్రోగ్రామ్(లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన, సెక్షన్ 2 నందు వలె)ను సెక్షన్లు 1 మరియు 2 నందలి నియమాల ననుసరించి కాపీ చేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు:
 
అ) దానికి అనుబంధంగా, పూర్తి సంబంధిత మెషీన్-రీడబుల్ సోర్స్ కోడ్(యంత్ర పఠనయోగ్యమైన సాంకేతిక మూలం), పైన తెలిపిన 1 మరియు 2 సెక్షన్ల నియమాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ మార్పిడికి యోగ్యమైన మాధ్యమం పై పంపిణీ చేయవలెను; లేదా,
ఆ) దానికి అనుబంధంగా, త్రుతీయ పార్టీకి మీరు సోర్స్ ను భౌతికంగా పంపిణీ చేయుటకు మీకు అయిన ఖర్చును అధిగమించకుండా కొంత రుసుముకు , కనీసం మూడు సంవత్సరాలు చెల్లు వ్రాతపూర్వక నివేదికతో, సోర్స్ కోడ్ సంబంధిత పూర్తి మెషీన్-రీడబుల్ ప్రతి, పైన తెలిపిన 1 మరియు 2 సెక్షన్ల నియమాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ మార్పిడికి యోగ్యమైన మాధ్యమం పై పంపిణీ చేయవలెను; లేదా,
ఇ) దానికి అనుబంధంగా, మీరు పొందిన సంబంధిత సోర్స్ కోడ్ ను పంపిణీ చేయుటకు సంబంధించి మీకు లభించిన సమాచారం అందించవలెను. (ఈ ప్రత్యామ్నాయం, కేవలం వాణిజ్యపరంగా లాభాపేక్షలేని పంపిణీకీ మాత్రమే వర్తించును మరియు మీరు ప్రోగ్రామ్ ను ఆబ్జక్ట్ కోడ్ లేక ఎక్సిక్యూటబుల్ రూపంలో, పైన పేర్కొనబడిన "ఆ" అనుభాగమునకు లోబడినటువంటి అవకాశం ద్వారా పొందియుండవలెను.)
 
ఎక్సిక్యూటబుల్ లేక ఆబ్జక్ట్ కోడ్ ను నిర్దేశిత ప్రదేశము నుండి అనుకరణ చేయుటకుగాను అనుమతిస్తూ పంపిణీ జరిపినచో,మరియు అట్లే అదే ప్రదేశము నుండి సోర్స్ కోడ్ ను అనుకరణ చేయుటకు కూడా సమానంగా అనుమతించినచో, అట్టి చర్య, త్రుతీయ పార్టీలను ఆబ్జక్ట్ కోడ్ తో కూడిన సోర్స్ ను అనుకరించుటకు నిర్బంధించకుండిననూ, సోర్స్ కోడ్ పంపిణీగా పరిగణించ బడుతుంది
 
4. ఈ లైసెన్సు నందు తెలుపబడినదానికి విరుద్ధంగా మీరు ప్రోగ్రామ్ ను కాపీ చేయుట, మార్పులు చేయుట, సబ్ లైసెన్స్ ఇచ్చుట లేక పంపిణీ చేయుట మొదలగునవి చేయరాదు. అట్లు గాక మరే విధంగానైనను ప్రోగ్రామ్ ను కాపీ చేయుట, మార్పులు చేయుట, సబ్ లైసెన్స్ ఇచ్చుట లేక పంపిణీ చేయుట మొదలగునవి చేసినచో, అట్టి ప్రయత్నములేవీ చెల్లవు, మరియు ఈ లైసెన్సు ద్వారా మీకు సంక్రమించిన హక్కులు వర్తింపజాలవు. ఐనను, ఈ లైసెన్సు ననుసరించి మీ నుండి ప్రతులను లేదా హక్కులను పొందిన పర్టీల లైసెన్సు మాత్రము వారు లోబడివున్నంత వరకు చెల్లును.
 
5. మీరు సంతకం చేయనందున, మీరు ఈ లైసెన్సుకు అంగీకరించవలసిన అవసరం లేదు. ఐనప్పట్టికీ, మీకు ప్రోగ్రామ్ లేక దాని నిష్పన్న రచనలను మార్పు చేయుటకు లేదా పంపిణీ చేయుటకు మరే ఇతరములు మిమ్మల్ని అనుమతింప జాలవు. మీరు ఈ లైసెన్సుకు అంగీకరించని యెడల ఇట్టి చర్యలు చట్టప్రకారం నిషేధించబడినవి. కాబట్టి, మీరు ప్రోగ్రామ్(లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన)ను మార్చుట ద్వారా లేదా పంపిణీ చేయుట ద్వారా మీరు ఈ లైసెన్సుకు, మరియు ప్రోగ్రామ్ ను లేక ఆధారిత రచనలను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు లేక మార్పులు చేయుటకు గల నియమాలకు మరియు షరతులకు అంగీకరించినట్లే.
 
6. మీరు ప్రొగ్రామ్(లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన)ను పునఃపంపిణి చేసిన ప్రతిసారీ, అవ్యక్తంగా స్వీకర్త ప్రాథమిక లైసెన్సార్ నుండి సూచించబడిన నియమాలకు మరియు షరతులకు అనుగుణంగా ప్రోగ్రామ్ ను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు లేక మార్పులు చేయుటకు గల లైసెన్సు పొందును. ఇందు ఆమోదించబడిన హక్కులకు సంబంధించి స్వీకర్తల వినియోగానికి మీరు ఎట్టి పరిమితులు విధింపలేరు. ఈ లైసెన్సుకు త్రుతీయ పార్టీల విధేయతను నిర్భంధించుటకు మీరు భాధ్యులు కారు.
 
7. ఒకవేళ, న్యాయస్థనం తీర్పు వల్ల గానీ లేక పేటెంటు ఉల్లంఘన వల్ల గానీ లేక మరే ఇతర కారణము(పేటెంటు వివాదాలకే పరిమితము కాదు) చేత గానీ, ఈ లైసెన్సు యొక్క నిబంధనలకు విరుద్ధముగా మీపై షరతులు(న్యయస్థానం ఆజ్ఞమేరకు లేక ఒప్పందం మేరకు లేక మరే కారణము చేతనైనను) విధింపబడిననూ, మీరు ఈ లైసెన్సు షరతులనుండి విముక్తులు కాజాలరు. పంపిణీ చేయుటకు ఈ లైసెన్సు నందలి మీ భాధ్యతలు మరియు మరే ఇతర సంబంధిత భధ్యతలు ఏక కాలంలో మీరు ఆచరించలేనిచో, మీరు ప్రోగ్రామ్ ను పంపిణీ చేయుట అసాధ్యము. ఉదాహరణకు, మీద్వారా ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షంగా కానీ ప్రతులను పొందిన వారందరికీ, ఏదేని పేటెంటు లైసెన్సు ప్రోగ్రామ్ ను రాయల్టీ-ఫ్రీ పునఃపంపిణీ చేయుటకు అనుమతించని యెడల, అట్టి లైసెన్సును మరియు ఈ లైసెన్సును ఏక కాలంలో మీరు ఆచరించ దలచిన,మీరు ప్రోగ్రామ్ యొక్క పంపిణీ నిలిపివేయవలెను.
 
ఈ విభాగము నందలి ఏదేని భాగము, ఏదైనా ప్రత్యేక సందర్భములో చెల్లకుండిన లేక విధింపలేకుండిన, ఈ విభాగము యొక్క సమతుల్యమును వర్తింపజేయవలెను, మరియు మరే ఇతర సందర్భములయందును ఈ విభాగమును సంపూర్ణముగా వర్తింపజేయవలయును.
మిగతా లైసెన్సు యొక్క పరిణామం ఏమిటన్నిది స్పష్టంగా తెలియ పరచడమే ఈ విభాగము యొక్క ముఖ్యోద్ధేశం.
 
8. పేటెంట్ల వల్ల గానీ లేక ఇంటర్ ఫేస్ ల కాపీరైట్ల వల్ల కానీ ప్రొగ్రామ్ యొక్క వాడకము మరియు/లేక పంపిణీ ఏదేని దేశాలలో నిషేధింపబడిన యెడల, ప్రోగ్రామ్ కు ఈ లైసెన్సు వర్తింపజేయు ప్రాథమిక కాపీరైట్ హక్కుదారు, అటువంటి దేశాలను బహిష్కరిస్తూ నిశ్చిత భౌగోళిక పంపిణీ పరిమితిని చేర్చిన, తదనుగుణంగా భహిష్కరించబడని దేశాల నందు మాత్రమే పంపిణీ చేయుటకు అనుమతించుట జరుగుతుంది. అటువంటి సందర్భములో, పరిమితి లైసెన్సు నందు వ్రాతపూర్వకముగా సూచింపబడినట్లే పరిగణింపబడుతుంది.
 
9. సమయానుకూలంగా సరిచేయబడిన లేక క్రొత్త సార్వత్రిక సార్వజనిక లైసెన్సు ప్రతిని ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ ప్రచురించుట జరుగుతుంది.అట్టి క్రొత్త ప్రతి ప్రస్తుత ప్రతి యొక్క భావనకు సమానంగా ఉండును, కాకపోతే క్రొత్త సమస్యలను లేక క్రొత్త విషయాలను ప్రస్తావించుటలో మార్పు ఉండును.
 
ప్రతీ వెర్షన్ కు గుర్తించుటకు వీలుగా ఒక వెర్షన్ నంబరు ఈయబడుతుంది. ప్రోగ్రామ్ కు వర్తించు ప్రస్తుత మరియు ఇతర భవిష్యత్ లైసెన్స్ వెర్షన్ నంబరును తెలియజేసినచో, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారిచే ప్రచురించబడిన అట్టి లైసెన్సు వెర్షన్ యొక్క నియమనిబంధలను గాని లేక ఇతర భవిష్యత్ లైసెన్స్ వెర్షన్ యొక్క నియమనిబంధలను గాని మీ ఇష్టానుసారం పాటించవచ్చును. లైసెన్సు యొక్క వెర్షన్ నంబరును ప్రోగ్రామ్ సూచింపకున్న, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారిచే ప్రచురింపబడిన ఏదేని వెర్షన్ ను మీరు ఎంచుకొనవచ్చును.
 
౧౦10. ప్రోగ్రామ్ యొక్క భాగాలను మీరు భిన్నమైన షరతులు ఉన్న ఇతర ఉచిత ప్రోగ్రాములందు చేర్చ దలచిన, అందుకు అనుమతి కోరుతూ మూలకర్తకు మీ విజ్ఞాపన వ్రాయవలెను . ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారు కాపీరైట్ పొందబడిన సాఫ్ట్ వేర్ కొరకు, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారికి మీ విజ్ఞాపన వ్రాయవలెను ; ఇందుకు కొన్ని సందర్భాలలో మేము మినహాయింపులిచ్చుట జరుగుతుంది. మా ఉచిత సాఫ్ట్ వేర్ యొక్క నిష్పన్నాల స్వతంత్ర్యత్వాన్ని కాపాడుట,మరియు సాధారణంగా సాఫ్ట్ వేర్ యొక్క ఉమ్మడి వాడకమును మరియు పునఃవినియోగమును వ్రుద్ధి చేయుట, అను రెండు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని , మా తీర్పును నిర్దేశించుట జరుగుతుంది.
 
పూచీకత్తు లేదు
౧౧11. ప్రోగ్రామ్ లైసెన్సును ఎట్టి రుసుమూ లేకుండా ఉచితముగా ఇచ్చు కారణాన, సంబంధిత చట్టం అనుమతించినంత మేర, ప్రోగ్రామునకు ఎట్టి పూచీకత్తూ వర్తించదు. అన్యధా వ్రాతపూర్వకముగా తెలియజేసినప్పుడు మినహా, కాపీరైట్ హక్కుదారు మరియు/లేక ఇతర పార్టీలు, బహిరంగంగా కానీ లేక సూచనగా కానీ తెలుపబడినట్లూ, వ్యాపారానుకూలతను మరియు ప్రత్యేక ప్రయోజనా యోగ్యతను సూచించు పూచీకత్తులతో సహా తెలుపబడిన పూచీకత్తులకు మాత్రమే పరిమితము గాకుండనట్లూ, ప్రోగ్రామ్ ను "యధావిధిగా" ఏ విధమైనటువంటి పూచీకత్తూ లేకుండా అందజేయుట జరుగుతుంది. ప్రోగ్రామ్ యొక్క శ్రేష్ఠత మరియు నిర్వహణకు సంబంధించి పూర్తి సాహసము మీదే. లోపాయకారీ ప్రోగ్రామ్ అని తేలినచో, అందుకు పూర్తి సంరక్షణ వ్యయం, పునరుద్ధరణ వ్యయం లేక సవరణ వ్యయం మీరే భరింపవలెను.
 
౧౨12. ఏది ఏమైనను, సంబంధిత చట్టం ఆదేశం మేరకు లేక వ్రాతపూర్వక ఒప్పందం మేరకు తప్పించి,పైన పేర్కొనబడినట్లు ప్రోగ్రామ్ ను మార్చుటకు మరియు/లేక పునఃపంపిణీ చేయుటకు అనుమతింపబడిన కాపీరైట్ హక్కుదారు లేక మరే ఇతర పార్టీ గానీ, మీరు ప్రోగ్రామ్ ను వాడుటవలన గానీ లేక ప్రోగ్రామ్ యొక్క అశక్త వాడకం వలన గానీ( సమాచారం కోల్పోవుట లేక సమాచారాన్ని సరిగా చూపకుండుట లేక మీ వల్ల కానీ లేదా త్రుతీయ పార్టీ వల్ల కానీ భరింపబడు నష్టాల చేత లేక మరే ఇతర ప్రోగ్రాములతో ఈ ప్రోగ్రామ్ పనిచేయకుండుట) మీకు సంభవించిన సామాన్య, ప్రత్యేక, ఆకస్మిక లేక పర్యవసాన నష్టాలతో కూడిన ఏ విధమైనటువంటి నష్టాలకూ, అట్టి నష్టాలను గూర్చి వారి(కాపీరైట్ హక్కుదారు లేక మరే ఇతర పార్టీ)కి ముందుగానే సూచనలు చేసిననూ, వారు మీ నష్టాలకు భాధ్యులు కారు.
 
నియమనిబంధనలు ముగిసినవి