హనుమకొండ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) చి clean up, replaced: గ్రామజనాభా → గ్రామ జనాభా using AWB |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి →హన్మకోండలో బతుకమ్మ, దసరా పండుగలు: clean up, replaced: పురుషుల → పురుషుల సంఖ్య, స్త్రీల → స్త్రీ using AWB |
||
పంక్తి 12:
[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px| హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది]]
==హన్మకోండలో బతుకమ్మ, దసరా పండుగలు==
మా ఊరు వరంగల్ జిల్లాలోని హన్మకొండ పట్టణం. పట్టణం అయినప్పటికీ బతుకమ్మ, దసరా విషయంలో మాత్రం పల్లెలకంటే గొప్పగా పండుగలను జరుపుకుంటారు. పితృఅమావాస్య (పెత్రమావస్య) తో బతుకమ్మ పండుగ మొదలయ్యి తొమ్మిది రోజుల పాటు రోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకుంటారు. అయితే ఆరవ రోజు మాత్రం బతుకమ్మ ఆడరు.పెత్రమావస్య ముందు రోజు సాయంత్రం నుండి చుట్టుప్రక్కల పల్లెలనుండి తంగేడు, గునుగు, తామర, బంతి, చేమంతి మొదలగు పువ్వులను అమ్ముతారు. వీటితో పాటు బతుకమ్మ పేర్చడానికి సిబ్బులు, గుమ్మడిఆకులను కూడా అమ్ముతారు. తిరిగి వీటినన్నింటిని బతుకమ్మ ముందురోజు కూడా అమ్మతారు. బతుకమ్మ మొదటిరోజు నుండి ఎనిమిదోరోజు వరకు అందరు వారి ఇంటిదగ్గరి గుళ్ళల్లో బతుకమ్మ ఆడుతారు. కాని తోమ్మిదోరోజయిన దుర్గాష్టమినాడు సాయంత్రం మాత్రం, పిల్లల నుండి పెద్దలవరకు, ఎన్నడూ ఇంట్లనుండి బయటికి వెళ్ళని వారు కూడా ప్రతిఒక్కరు కొత్తబట్టలు వేసుకొని, వివిధ నగలను ధరించి బతకమ్మలను చేత బట్టుకుని పద్మాక్షమ్మ గుట్టకు పోతారు. బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు,
బతుకమ్మను సుమారు గంట నుండి రెండు గంటల వరకు ఆడినతర్వాత, బతుకమ్మను నీళ్ళల్లో వదులుతారు. బతుకమ్మతోబాటు సద్దులుకూడా పట్టుకపోతారు. సత్తిపిండి, నువ్వులపొడి, పల్లీలపొడి, కొబ్బరిపొడి మొదలగు వాటిని కలిపి సద్దులు అంటారు. బతుకమ్మను నీళ్ళల్లో వదిలిన తర్వాత సద్దులను అందరు పంచుకుని తిని, పసుపుకుంకుమలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. తిరిగి ఆటోలల్లోగాని, కార్లల్లోగాని ఇంటికి చేరుకుంటారు. అప్పుడు ఎల్లుండి వచ్చే దసరా పండుగగురించి , వచ్చే సంవత్సరం వచ్చే బతుకమ్మ గురించి మాట్లాడుకుంటారు .
బతుకమ్మకు ఒక్కరోజు విరామం తర్వాత వచ్చే దసరా పండుగ, హన్మకొండలో జరుపుకోనే పండుగలలో ప్రధానమైనది, ముఖ్యమైనదికూడా. దసరారోజు ప్రతిఒక్కరు తమ తమ వాహనాలను కడుక్కొని, పూలదండవేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. చేతిపనులవారు తమ పనిముట్లకు, పరిశ్రమలవారు మిషిన్లకు పూజలు చేస్తారు. పోలీస్, మిలిటరీ వాళ్ళుకూడా తమ ఆయుధాలకు పూజచేస్తారు. ఇండ్లకు ముగ్గుపోయడం, గృహప్రవేశాలు, దుకాణాల ప్రారంభం మొదలగు కొత్తపనులను చేస్తారు. బతుకమ్మరోజు కూరగాయల భోజనంచేస్తే, దసరా నాడు మాత్రం అందరు (శాఖాహారులు మినహా) మాంసాహార భోజనం చేస్తారు. పూరీలు, గారెలు చేసుకుంటారు. చాలా మంది మద్యాన్నికూడా సేవిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుండి
==శాసనసభ నియోజకవర్గం==
|