గోకర్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
===స్థలపురాణం===
ఇతిహాసం [[త్రేతా యుగము|త్రేతాయుగం]] వరకు ఉన్నది. [[రావణుడు|రావణాసురుడు]], [[శివుడు|శివు]] ని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంక లో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయ తో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు. <br>
 
ఈ విషయం తెలుపుకొన్న [[నారదుడు]] [[వినాయకుడు|వినాయకు]]ని వద్ద కు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు.అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి [[బ్రాహ్మణుడు|బ్రాహ్మణ వేషం ]] లో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు. <br>
 
రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు.రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తి కి గుంట పడుతుంది.వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం [[గోకర్ణ]], మురుడేశ్వర లింగం పడిన భాగాలలొ ఒక ప్రదేశం.<br>
 
విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు.ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణ కు 23 కి.మి. దూరం లో సజ్జేశ్వర అనే ప్రదేశం లో పడుతుంది. లింగం పై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణ కు 27 కి.మి దూరం లో ఉన్న గుణేశ్వర లో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పై నున్న మృదేశ్వర లో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వర గా మారింది.
 
==గణపతి దేవాలయం==
"https://te.wikipedia.org/wiki/గోకర్ణ" నుండి వెలికితీశారు