వికీపీడియా:దుశ్చర్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 73:
;సభ్యుల వ్యాఖ్యలను మార్చడం: సభ్యులు సంతకం పెట్టి మరీ రాసిన వ్యాఖ్యలను విపరీతార్థాలు వచ్చే విధంగా మార్చడం. అయితే వ్యక్తిగతమైన ఆరోపణలతో చేసిన దాడిని తొలగించడం దుశ్చర్య కిందకు రాదు. సంతకం లేని వ్యాఖ్యను ఎత్తి చూపడం కూడా దుశ్చర్య కిందకు రాదు.
;వివాదం టాగుల తొలగింపు: వివాదం టాగులు పెట్టడం వలన ఆ వ్యాసం వివాదాస్పదమైనదని ప్రజలకు తెలుస్తుంది. వివాదం పరిష్కారమైన తరువాతే దాన్ని తీసివెయ్యాలి. ఆ విషయం నిర్ధారించుకున్నాకే దాన్ని తీసివెయ్యండి.
;చర్చా పేజీ దుశ్చర్య: వ్యాసాల చర్చా పేజీల్లో సభ్యుల వ్యాఖ్యలను, మొత్తం విభాగాన్ని తొలగించడం ఈ కోవలోకి వస్తుంది. వ్యక్తిగత విమర్శలను తొలగించడం దుశ్చర్య కాదు. బాగా పెరిగిపోయిన చర్చా పేజీలో కొంత భాగాన్ని నిక్షేపితం చేసి, ఆ భాగాన్ని ప్రస్తుతపేజీ నుండి తొలగించడం దుశ్చర్య కిందకు రాదు. అయితే ఇది సభ్యుల చర్చా పేజీకి వర్తించదు. తమ చర్చా పేజీలలో ఉన్న వ్యాఖ్యలను తొలగించే అధికారం పూర్తిగా సదరు సభ్యులదే.
;ఆధికారిక విధానంపై దుశ్చర్య: తనకంగీకారం కాని వికీపీడియా విధానాన్ని ఏ చర్చా, ఏకాభిప్రాయం లేకుండా తొలగించడం ఈ దుశ్చర్య కిందకు వస్తుంది. విధానాన్ని మరింత అర్ధమయ్యేందుకు చేసే భాషాపరమైన మార్పులు దుశ్చర్య కాదు.
;కాపీహక్కుల దుశ్చర్య: తెలిసి తెలిసీ కాపీహక్కులు లేని విషయాలను వ్యాసాలలో చేర్చడం ఈ కోవ లోకి వస్తుంది. కాపీహక్కులకు సంబంధించి వికీపీడియా విధానం తెలియక చేస్తే ఆ పని దుశ్చర్య కిందకు రాదు. అయితే మరోసారి అటువంటిది జరిగితే మాత్రం అది దుశ్చర్యగానే భావించబడుతుంది.