పెన్నా శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''పెన్నా శివరామకృష్ణ''' తెలుగు కవీ, విమర్శకుడు.
==జీవిత విసేషాలువిశేషాలు==
ఆయన పూర్తి పేరు పెన్నా వేంకట శివరామకృష్ణ శర్మ (పి.వి. యస్. ఆర్. కె. శర్మ). ఆయన [[నల్గొండ జిల్లా]] [[దుగునవల్లి]] గ్రామంలో [[1960]] [[ఫిబ్రవరి 2]] న అనంతలక్ష్మి,శేషావతారం దంపతులకు జన్మించారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కట్టంగూరు లో చదువుకున్నాడు. నల్లగొండలోని గీతావిజ్ఞాంధ్ర కళాశాల నుంచి, డి. ఓ. యల్. మరియు బి. ఓ. యల్. డిగ్రీలను పొందినాడు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు నుండి యం. ఏ. (1980 - 82), యం. ఫిల్. (1983) డిగ్రీలను పొందినాడు. "శేషేంద్ర కవిత్వానుశీలనం" అనే అంశం మీద పరిశోధన చేసి, అదే యూనివర్సిటీ నుంచి పిహెచ్. డి. పట్టం పొందినాడు.
 
== తెలుగు హైకూలు ==
తెలుగులో హైకూలను పరిచయం చేసింది [[ఇస్మాయిల్ (కవి)]] గారు<ref> తెలుగు సాహిత్య చరిత్ర, రచన:డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, విశాలంధ్ర ప్రచురణలు, 2001, పుట-315</ref>. [[1991]] లో [[పెన్నా శివరామకృష్ణ]] ' రహస్యద్వారం ' పేరుతో తొలి తెలుగు హైకూ కవిత్వ సంపుటిని తీసుకవచ్చాడు. "చినుకుల చిత్రాలు" (2000), "సులోచనాలు" (2006) పేర్లతో మరో రెండు హైకూ సంకలనాలను కూడ పెన్నా శివరామకృష్ణ ప్రచురించాడు. ప్రపంచంలోని, భారత దేశంలోని వివిధ భాషలలో వచ్చిన కొన్ని హైకూలను తెలుగులోనికి అనువదించి "దేశదేశాల హైకూ" (పాలపిట్ట బుక్స్ ప్రచురణ, 2009) అనే మరో అనువాద రచనను కూడ పెన్నా శివరామకృష్ణ వెలువరించాడు. "ప్రపంచ వ్యాప్త కవితా ప్రక్రియ హైకూ", "హైకూ - స్వరూప స్వభావాలు" అనే శీర్షికలతో పెన్నా శివరామకృష్ణ రాసిన రెండు వ్యాసాలు కూడ "దేశదేశాల హైకూ" పుస్తకంలో ప్రచురింపబడినాయి. [[1994]] లో [[గాలి నాసరరెడ్డి]] జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు.
"https://te.wikipedia.org/wiki/పెన్నా_శివరామకృష్ణ" నుండి వెలికితీశారు