మల్లాది వెంకట కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉద్యొగం: clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
పంక్తి 43:
మల్లాది రచయిత అవడానికి ప్రధాన ప్రేరణ ఆయన బాల్యంలో చదివిన అనేకానేక పత్రికలూ, నవలలు. ఆయనకు ఏడుగురు అక్కలు. వాళ్ళందరికీ పత్రికా పఠనం అంటే ఎంతో ఆసక్తి. వారి అమ్మ [[మల్లాది శారదాంబ]] ఆంధ్ర ప్రభ వీక్లీ కొనేది. వారి పక్కింటివాళ్ళు [[ఆంధ్ర పత్రిక]] ని కొనేవారు. వాటిని వారు ఎక్సేంజ్ చేసుకుని చదువుకునేవాళ్ళు.ఆ రోజుల్లో మధ్య తరగతి వాళ్ళు ఈపద్ధతిని అనుసరించేవారు. ఇలా నా ఏడో ఏటనించే ఆయన తెలుగు పుస్తకాలు చదవడం ఆరంభించారు. సాయంత్రాలు ఆయన వారి ఇంటికి ఐదు నిముషాల నడక దూరంలో వున్న గాంధీనగర్లోని ఓ లైబ్రరీకి వెళ్ళి అనేక పుస్తకాలని చదివేవారు. అది నాగేశ్వరరావు పంతులు రోడ్లో ఎస్ కే పీ వీ వీ స్కూల్ సమీపంలో వుండేది. ప్రస్తుతం అది లేదు.
 
ఆయనకు గల సాహిత్య జ్ఞాపకాలలో ఒకటి దీపావళికి ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రికల ప్రత్యేక సంచికలు. ఎక్కువ పేజీలతో, కునేగా మరికొలందు సెంటుతో ఘుమ ఘుమలాడుతూ వచ్చేవి అవి. వాటిని చదవడానికి వారి కుటుంబ సభ్యులంతా పోటీ పదే వారు. ఆనాటి చాలామంది పాఠకులకి కూడా ఈ అనుభవం వుండి వుంటుంది. బహుమతి పొందిన కథలని చదివేసాక ఇక వాటి మీద ఆసక్తి తగ్గేది. అలాగే యువ, జ్యోతి మాస పత్రికలూ దీపావళి, సంక్రాంతి పండగలకి ఎక్కువ పేజీలతో వచ్చేవి. వాటిలో ప్రముఖ రచయితల కథలు వుండేవి. [[అవసరాల రామకృష్ణారావు]], [[ఇచ్చాపురపుఇచ్ఛాపురపు జగన్నాథరావు]], [[భరాగో]], [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]],[[ఆదివిష్ణు]] తదితరుల కథలు వాటిలో వచ్చేవి.
 
సంభాషణతో మొదలయ్యే కథ అరుదుగా దొరికేవి. వాటిని ఆసక్తిగా చదివేవారాయన.పన్నెండు ఏళ్ళు వచ్చాక హనుమాన్ పేటలోని జిల్లా గ్రంధాలయానికి వెళ్ళి పుస్తకాలు చదివేవారు.
పంక్తి 51:
 
ఆయన కాలేజిలో చదివేప్పుడు ఓ సారి ఓ కథని రాసారు. అది తెలిసి వారి నాన్న [[మల్లాది దక్షిణామూర్తి]] గారు చదువు చెడుతుందని కథలని రాయద్దని చెప్పారు. దాంతో మళ్లీ రాయలేదు. అప్పుడప్పుడు వారి నాన్నగారు, `కథలు రాస్తున్నావా? మానేశావా? అని అడిగేవారు కూడా. బి కాంలో ఆయన క్లాసుమేటు మురళి అని ఒకడు వుండేవాడు. అతనికి కూడా సిస్టర్స్ మల్లాది లాగానే. దాంతో నాలానే చిన్నప్పటినుంచి చదివేవాడు. ఓ రోజు ఆయనకు వారు రాసిన కథని చదవమని ఇచ్చాడు. ఘనమైన అయ్యా ` అన్న పదాలతో అది మొదలైంది. మర్నాడు వారిద్దరూ అలంకార్ సినిమా హాల్ని దాటి ఎదురుగా వున్నా వంతెన మీదకి రాగానే కథ ఎలా వుందని అడిగాడు. కథా రచనలో మల్లాది ఏర్పరచుకున్న అభిప్రాయాలని అన్నిటి ప్రకారం ఆ కథ బాగా లేదని విస్లేశానాత్మకంగా చెప్పారాయన. ఆయన పరిజ్ఞానికి స్నేహితునికి ఆశ్చర్యం వేసింది. వారు మంచి మిత్రులే అయినా ఎన్నడు కథల గురించి అంతదాకా మాట్లాడుకోలేదు. ఆతను తర్వాత దేవరకొండ మురళి అనే తన పేరుతో 10 దాక కథలు రాసాడు.
 
===ఉద్యొగం===
1970 లొ ఆయన చదువు బికాం అయిపోయింది. వుద్యోగ రీత్యా సికింద్రాబాద్ వచ్చి, 1970 ఫిబ్రవరిలో వారి నాన్న గారు మల్లాది దక్షిణామూర్తి మిత్రులు శ్రీ ముస్త్యాల వెంకయ్య గారి ఇంట్లో, రాష్ట్రపతి రోడ్లోని పోస్ట్ ఆఫీసు ఎదురుగా వున్న ఇంట్లో బస చేసారు. వారికి చిన్నప్పటి నుంచి కథలకి ఐదియాస్ తట్టేవి. వాటిని ఓ చిన్న పుస్తకంలో రాసుకునేవారాయన. అక్కడ వుద్యోగంలో చేరిన మొదటి ఆదివారం ఓ కథని రాసారు. తర్వాత ఫెయిర్ చేసి దాన్ని చందమామకి పోస్ట్ చేసారు. పత్రికకి, ప్రభాకి, అపరాధ పరిశోధనకి వరసగా ఒకో కథని ఒకో ఆదివారం రాసి పోస్ట్ చేసారు. వారు అప్పుడు ఓ సంగతి గమనించారు. ఫెయిర్ చెయ్యడానికి చిత్తు ప్రతి చూడకుండానే తర్వాతి పదం, వాక్యం అలానే రాసేవారాయన. తర్వాత చూస్తే చిత్తు ప్రతిలో అలాగే వుండేది. ఇలా చాలాసార్లు అనుభవం అయ్యాక ఆయన వాక్యాలని, పదాలని ఒకేలా రాస్తారని అర్థమయ్యిందాయంకు. దాంతో తిరగరాసే ప్రయత్నం మానుకున్నారు.