కత్తి పద్మారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
| website =
}}
 
 
==బాల్యం, కుటుంబం==
పద్మారావు, [[గుంటూరు జిల్లా]] బాపట్ల మండలంలోని [[ఈతేరు]] లో 1953 జులై 27న దళిత మాల కుటుంబంలో పుట్టారు. అమ్మ మాణిక్యమ్మ, నాన్న సుబ్బయ్య. ఇద్దరూ వ్యవసాయ కార్మికులే. వారు సంవత్సరంలో ఆరు నెలలు ఈతేరులో వ్యవసాయ కూలీలుగానూ, మిగిలిన ఆర్నెల్లూ చీరాలలోని ఇండియన్ లీఫ్ టొబాకో డిపో (ఐఎల్‌టీడీ)లో కార్మికులుగా పనిచేసేవారు. తాత కట్టా రాఘవులు, చీరాల ఐఎల్‌టీడీలో మేస్త్రి. పేరాలలోని శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణ హైస్కూలులో చదివారు. చీరాల పౌర గ్రంధాలయం, పొన్నూరు కాలేజీలోని లైబ్రరీ లో చదివారు. పొన్నూరులోని శ్రీభావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో చేరారు. [[లక్ష్మీపార్వతి]], [[ఐ. వెంకట్రావు]], [[కె. కృష్ణకుమారి]] మొదలైన వాళ్లంతా పొన్నూరు కాలేజీలో 'భాషాప్రవీణ' కోర్సులో ఈయనకు సహాధ్యాయులు. తరువాత పొన్నూరు కాలేజీలోనే తన గురువుగారు [[కొండవీటి వెంకటకవి]] స్థానంలో లెక్చరర్‌గా పనిచేశారు.
 
==హేతువాది==
 
పద్మరావు హేతువాది, [[హేతువాదం]] పత్రిక నడిపారు. తన కుమారునికి [[కులాంతర వివాహం]] (చేతన్-నళిని) చేశాడు. "ఏ మతంలోనైనా హేతువాదం ఉండాలి. సంస్కృతం చదువుకోబట్టే అంబేద్కర్, లోహియా ఉద్యమకారులయ్యారు. సంస్కృతంలో షట్దర్శనాలన్నీ హేతువాదమే చెబుతాయి" అని భావించాడు. ఈయన తను బ్రాహ్మణులను వ్యతిరేకించనని, బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తానను, ఎస్సీల్లో కూడా ఎదిగిన తర్వాత మిగిలిన వారిని తొక్కేసే బ్రాహ్మణవాదం ఉంది. దాన్నే వ్యతిరేకిస్తానని చెప్పుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/కత్తి_పద్మారావు" నుండి వెలికితీశారు