అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
==కథ==
మద్రాసు సంగీత కళాశాలలో చదువుకున్న హేమ ([[భానుప్రియ]]) ఫారెస్ట్ కంట్రాక్టర్ రావుగారి ([[కైకాల సత్యనారాయణ]]) ఆహ్వానం మేరకు ఆయన ఉంటున్న ఆటవీ ప్రాంతానికి వస్తుంది. సంగీత ప్రియుడైన రావుకు పక్షుల కిలకిలారావాల నుంచే సంగీతం పుట్టిందని, వివిధ రాగాలకు రకరకాల పక్షుల కూతలకు దగ్గర సంబంధం ఉందని నిరూపించే పరిశోధనని పుస్తకంగా వేయాలని ఆశయం. స్వయంగా ఆ విషయాన్ని పరిశోధన చేయాలని ప్రయత్నించినా వయసు మీదపడడంతో వచ్చిన మతిమరుపు ఆ పనిచేయనివ్వదు.<br />
రావుగారి జీపు డ్రైవర్ ([[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]) భార్య ఆ ఇంట్లోనే వంటమనిషి. రావు గారికి స్నేహితుడైన ఫారెస్ట్ రేంజర్ జేమ్స్ ([[శరత్ బాబు]]), ఊరి సర్పంచి పులిరాజు ([[మల్లికార్జునరావు]]), ఆయన భార్య నాగలక్ష్మి ([[వై.విజయ]]), వాళ్ళ కొడుకు చంటోడు ([[శుభలేఖ సుధాకర్]]), నాగలక్ష్మి తమ్ముడు (బాలాజీ) వంటివాళ్ళందరి విచిత్రమైన ప్రవర్తన హేమకు అర్థంకాకుండా ఆశ్చర్యం కలిగిస్తూంటుంది.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు