అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
మద్రాసు సంగీత కళాశాలలో చదువుకున్న హేమ ([[భానుప్రియ]]) ఫారెస్ట్ కంట్రాక్టర్ రావుగారి ([[కైకాల సత్యనారాయణ]]) ఆహ్వానం మేరకు ఆయన ఉంటున్న ఆటవీ ప్రాంతానికి వస్తుంది. సంగీత ప్రియుడైన రావుకు పక్షుల కిలకిలారావాల నుంచే సంగీతం పుట్టిందని, వివిధ రాగాలకు రకరకాల పక్షుల కూతలకు దగ్గర సంబంధం ఉందని నిరూపించే పరిశోధనని పుస్తకంగా వేయాలని ఆశయం. స్వయంగా ఆ విషయాన్ని పరిశోధన చేయాలని ప్రయత్నించినా వయసు మీదపడడంతో వచ్చిన మతిమరుపు ఆ పనిచేయనివ్వదు.<br />
రావుగారి జీపు డ్రైవర్ ([[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]) భార్య ఆ ఇంట్లోనే వంటమనిషి. రావు గారికి స్నేహితుడైన ఫారెస్ట్ రేంజర్ జేమ్స్ ([[శరత్ బాబు]]), ఊరి సర్పంచి పులిరాజు ([[మల్లికార్జునరావు]]), ఆయన భార్య నాగలక్ష్మి ([[వై.విజయ]]), వాళ్ళ కొడుకు చంటోడు ([[శుభలేఖ సుధాకర్]]), నాగలక్ష్మి తమ్ముడు (బాలాజీ) వంటివాళ్ళందరి విచిత్రమైన ప్రవర్తన హేమకు అర్థంకాకుండా ఆశ్చర్యం కలిగిస్తూంటుంది.<br />
ఆమె కన్నా ముందే ఈ పరిశోధనకు రావుగారు రప్పించిన సుమతి పులివాత పడి మరణించినా హేమ చాలా ధైర్యంగా అడవిలో తిరుగుతూ పక్షికూతలు రికార్డు చేసుకుని విశ్లేషించుకుంటూ కొనసాగుతుంది. ముగ్గురు మనుషులు ఆమెను వెంటపడడం, వాళ్ళని మరో ముసుగుమనిషి వెంబడించడం హేమ గమనిస్తుంది. రావుగారి సహాయకుడు గోఖలే పులిబారిన పడి మరణించడంతో ఊళ్ళో పులిభయం మళ్ళీ తలెత్తుతుంది.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు