'''ఆయుర్వేదం''' (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్యనికి ముల పురుషులు నాయిబ్రహ్మణులు. ఇదివైద్య నారాయణ ధన్వంతరి నాయిబ్రాహ్మణ కులానికి ముల పురుషుడు నాయిబ్రాహ్మణులని వైద్య బ్రాహ్మణులు అని కుడా అంటారు. [[అధర్వణ వేదం|అధర్వణ వేదానికి]] ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది [[భారత దేశం]]లో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న [[వైద్యం]]. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. [[శస్త్రచికిత్స]] చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాదుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సాంప్రదాయములు కలవు.