"గడియారం వేంకట శేషశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: శ్రీనాధ → శ్రీనాథ using AWB)
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'. భరతమాత పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. మాతృభాష విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.
 
పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు [[1894]] [[ఏప్రిల్‌ 7ఏప్రిల్‌7]]వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేష శాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లోఅనిబిసెంట్‌ మున్సిపల్‌ పురపాలిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. [[బ్రహ్మానందిని]] అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద యజుర్వేదం, ఉపనిషత్తులు, దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణ గ్రంథాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, వాల్మీకి హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, పోతన భాగవతం లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిన తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.
 
==సత్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1704252" నుండి వెలికితీశారు