మధుమేహం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB
పంక్తి 3:
| Name = డయాబెటిస్ మెల్లిటస్
| Image = Blue circle for diabetes.svg
| Caption = మధుమేహ చిహ్నం.<ref> {{ఇంగ్లీష్}} {{cite web| title=IDF Chooses Blue Circle to Represent UN Resolution Campaign |url=http://www.unitefordiabetes.org/news/campaign/idf_chooses_blue_circle_to_represent_un_resolution_campaign/index.html |date=17 March 2006 |publisher=Unite for Diabetes}}</ref>
| ICD10 = {{ICD10|E|10||e|10}}–{{ICD10|E|14||e|10}}
| ICD9 = {{ICD9|250}}
పంక్తి 16:
}}
 
'''మధుమేహం''' లేదా '''చక్కెర వ్యాధి'''ని వైద్య పరిభాషలో '''డయాబెటిస్ మెల్లిటస్''' అని వ్యవహరిస్తారు. '''డయాబెటిస్''' అని కూడా అనబడే ఈ [[వ్యాధి]], ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం మరియు రక్తంలో అధిక [[గ్లుకోస్|గ్లూకోజ్]] స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత <ref name="diag"> {{ఇంగ్లీష్}} {{cite book | last = L M Tierney, S J McPhee | first = M A Papadakis | title = Current medical Diagnosis & Treatment. International edition | publisher = Lange Medical Books/McGraw-Hill | date = 2002 | pages = 1203-1215 | location = New York | isbn = 0-07-137688-7 }}</ref>. అతిమూత్రం (పాలీయూరియా), [[దాహం]] ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం మరియు బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా [[రక్తం]]లో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] గణాంకాల ప్రకారం [[భారత దేశం]], [[చైనా]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాలలో]] అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నది <ref name=Wild> {{ఇంగ్లీష్}} {{cite journal |last=Wild|first=S |year=2004 |title=Global Prevalence of Diabetes|journal=Diabetes Care|volume=27 |issue= |pages=1047-1053 |id= |url=https://www.who.int/diabetes/facts/en/diabcare0504.pdf}}</ref>. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు: వివిధ రకాల కారణాల వల్ల కలిగే డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1|1వ రకం, డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2 మరియు జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్)<ref name ="WHO1999-DefDiagClass"> {{ఇంగ్లీష్}} {{cite web | author=[[World Health Organisation]] Department of Noncommunicable Disease Surveillance | title=Definition, Diagnosis and Classification of Diabetes Mellitus and its Complications | year=1999 | url=http://whqlibdoc.who.int/hq/1999/WHO_NCD_NCS_99.2.pdf | format=PDF}}</ref>. అయినా, అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం [[క్లోమము|క్లోమ గ్రంధి]]లోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే <ref name=Rother> {{ఇంగ్లీష్}} {{cite journal |last=Rother |first=KI |year=2007 |title=Diabetes Treatment — Bridging the Divide |journal=N Engl J Med |volume=356 |issue=15 |pages=1499-1501 |id= |url=http://content.nejm.org/cgi/content/full/356/15/1499}}</ref>. మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుంది. రెండవ రకం డయాబెటిస్‌లో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్ కావలసి వస్తుంది, బీటా కణాలు ఈ డిమాండ్ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్ కలుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్‌లో కూడా ఇన్సులిన్ నిరోధకత అగుపిస్తుంది.
 
జెస్టేషనల్ డయాబెటిస్ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది, కానీ మొదటి రకం, రెండవ రకం మధుమేహాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి<ref name="diag"/>. 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాలను నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహార అలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటికీ, ఇన్సులిన్ ఉత్పత్తి లేని మొదటి రకంను నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం తప్పనిసరి మార్గం. రెండవ రకం ఆహార అలవాట్ల మార్పు మరియు ఆంటీడయాబెటిక్ మందుల వాడకం వల్ల మరియు అప్పుడప్పుడు ఇన్సులిన్ వాడకం వల్ల నియంత్రించవచ్చు. ఇంతకుమునుపు ఇన్సులిన్ [[పంది|పందుల]] క్లోమాల నుండి తీయబడేది, ప్రస్తుతము చాలా వరకు ఇన్సులిన్ ఉత్పత్తి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా జరుగుతుంది. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతులవల్ల ఉత్పత్తి చేయబడే ఇన్సులిన్ మానవ సహజ ఇన్సులిన్‌కు పూర్తి కాపీగా గాని, వివిధ ఆన్‌సెట్ అఫ్ యాక్షన్ మరియు యాక్షన్ చూపబడే సమయం ఉండే విధంగా తయారుచేయబడుతున్నాయి. ఇన్సులిన్‌ను ఇన్సులిన్ పంపు‌ల ద్వారా నిర్విరామంగా అవసరానికి తగిన విధంగా సరఫరా చేయవచ్చు.
పంక్తి 39:
ముఖ్యమైన రెండురకాలైన డయాబెటిస్ మెల్లిటస్ రకాలు టైప్ 1 మరియు టైప్ 2. టైప్ 1 డయాబెటిస్ అనే పదము ఇంతకుముందున్న జువెనైల్-డయాబెటిస్, ఇన్సులిన్ డిపండెంట్ డయాబెటిస్ వంటి పదాలకు ప్రస్తుతం వాడుకలో ఉన్న పదం. అలాగే టైప్ 2 నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ వంటి వాటికి ప్రత్యమ్నాయంగా వాడబడుతుంది.
=== డయాబెటిస్ మెల్లిటస్ మొదటి రకం ===
టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్
 
టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్, క్లోమ గ్రంధిలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్‌హాన్స్‌లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలు సంఖ్యలో తగ్గిపోవడం లేదా నశించడం వల్ల ఏర్పడే ఇన్సులిన్ కొరత వల్ల కలుగుతుంది. ఆటోఇమ్మ్యూనిటీ వల్ల టి-కణాలు బీటా కణాలపై దాడి చేయడం ముఖ్యకారణం.<ref name=Rother/> ప్రస్తుతము తెలిసిన ప్రొఫైలాక్సిస్ ఏమీ లేదు. ఈ వ్యాధి ప్రారంభానికి ముందు ఆరోగ్యంగా ఉండి మంచి బరువును కలిగి ఉంటారు. ఈ వ్యాధి పెద్దలలో గానీ పిల్లలోగాని ఎవరిలోనైనా రావచ్చు. కానీ సాంప్రదాయకంగా చిన్న పిల్లలలో వచ్చే ఈ వ్యాధిని 'జువినైల్ డయాబెటిస్' అని అంటారు.
పంక్తి 54:
టైప్&nbsp;2 డయాబెటిస్ మెల్లిటస్ ఇన్సులిన్ నిరోధకత (insulin resistance) వల్ల కలుగుతుంది. కొన్ని సందర్భాలల్లో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గవచ్చు. కణ త్వచంలో ఉండే ఇన్సులిన్ రిసెప్టార్లు (insulin receptor) వివిధ శరీర భాగాల్లో సరిగా విధిని నిర్వర్తించకపోవడం ముఖ్య కారణంగా భావిస్తారు. ప్రారంభ దశలో ఇనులిన్ నిరోధకత వల్ల రక్తంలో ఇన్సులిన్ నిలువలు పెరుగుతాయి. ఈ సమయంలో హైపర్‌గ్లైసీమియాను చాలా వరకు మందుల ద్వారా నివారించవచ్చు. ఈ మందులు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం కానీ [[కాలేయం]]లో గ్లుకోస్ ఉత్పత్తిని గానీ తగ్గిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది.
 
టైప్ 2 డయాబెటిస్‌ ఎందువల్ల వ్యాపిస్తుందో తెలిపేందుకు చాలా సిద్దాంతాలు వివరించబడ్డాయి. [[:en:Central obesity|సెంట్రల్ ఒబెసిటీ]] (నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం) ఇన్సులిన్ రెసిస్టన్స్‌కు ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న 55% రోగులలో ఒబెసిటీ ఉన్నట్టుగా గుర్తించబడినది. <ref>{{cite journal | last = Eberhart | first = MS | coauthors = Ogden C, Engelgau M, Cadwell B, Hedley AA, Saydah SH | title = Prevalence of Overweight and Obesity Among Adults with Diagnosed Diabetes --- United States, 1988--1994 and 1999--2002 | journal = Morbidity and Mortality Weekly Report | volume = 53 | issue = 45 | pages = 1066–1068 | publisher = Centers for Disease Control and Prevention | date = 19 November 2004 | url = http://www.cdc.gov/mmwR/preview/mmwrhtml/mm5345a2.htm | accessdate = 2007-03-11}}</ref> ఇతర కారణాలుగా వృద్దాప్యం మరియు డయాబెటిస్‌కు సంబంధించిన కుటుంబం చరిత్రలను చెప్తారు. గడిచిన దశాబ్దంలో ఈ వ్యాధి చిన్న పిల్లలు మరియు యుక్త వయస్కులలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది, దీనికి కూడా ఒబెసిటీనే కారణంగా గుర్తించారు. <ref>{{cite book | last = Arlan Rosenbloom | first = Janet H Silverstein | title = Type&nbsp;2 Diabetes in Children and Adolescents: A Clinician's Guide to Diagnosis, Epidemiology, Pathogenesis, Prevention, and Treatment | publisher = American Diabetes Association,U.S. | year = 2003 | pages = 1 | isbn = 978-1580401555}}</ref>
 
టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు ఆరంభ దశలో అంత సులువుగా గుర్తించడం సాధ్యపడదు, దానివల్ల తరువాతి దశలో గుర్తించకపోవడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల మూత్ర పిండాలు చెడిపోవడం, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు మందగించడం జరుగుతాయి. ఈ రకమైన వ్యాధిని మొదట వ్యాయామం, ఆహారంలో కార్బోహైడ్రేట్లను నియంత్రించడం మరియు బరువు తగ్గించడం ద్వారా నియంత్రిస్తారు. వీటివల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. తరువాత యాంటీ డయాబెటిక్ మందుల ద్వారా నియంత్రిస్తారు.<ref>{{cite journal |author= |title=Effect of intensive blood-glucose control with metformin on complications in overweight patients with type&nbsp;2 diabetes (UKPDS 34). UK Prospective Diabetes Study (UKPDS) Group |journal=Lancet |volume=352 |issue=9131 |pages=854–65 |year=1998 |pmid=9742977|doi=10.1016/S0140-6736(98)07037-8}}</ref> ఈ చికిత్స కూడా పనిచేయకపోతే ఇన్సులిన్ వాడుక తప్పనిసరి అవుతుంది.
పంక్తి 121:
ఆస్ప్రిన్‌: రక్తాన్ని కొద్దిగా పల్చగా ఉంచే ఈ మందును తక్కువ మోతాదులో మధుమేహులంతా వేసుకోవాలి. స్టాటిన్లు: రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులివి. వీటితో ఇతరత్రా ప్రయోజనాలూ ఉన్నాయి. బీటా బ్లాకర్లు: అటెన్‌లాల్‌, మెటప్రొలాల్‌ వంటి ఈ మందులు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. ఫైబ్రేట్లు: కొలెస్ట్రాల్‌ను, కొవ్వును తగ్గిస్తాయి.ఫోలిక్‌ యాసిడ్‌: భారతీయుల్లో హోమోసిస్టీన్‌ ఎక్కువగా ఉంటోంది. ఇది ఎక్కువ గలవారికి గుండె పోటు కూడా అధికంగా వస్తుంది. దీన్ని తగ్గించేందుకు ఫోలిక్‌ యాసిడ్‌ ఉపకరిస్తుంది. నియాసిన్‌: చెడ్డకొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
 
== మూలాలు ==
== రిఫరెన్సులు ==
{{reflist}}
 
"https://te.wikipedia.org/wiki/మధుమేహం" నుండి వెలికితీశారు