భారతీయ జనసంఘ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ (4) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Ab vajpayee2.jpg|right|thumb|150px|<center> [[1968]] నుండి [[1973]] వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా ఉన్న [[అటల్ బిహారీ వాజపేయి]] </center>]]
[[దస్త్రం:Advani.jpg|right|thumb|150px|<center> ప్రముఖ జనసంఘ నేతలలో ఒకరైన [[లాల్ కృష్ణ అద్వానీ]] </center>]]
సంక్షిప్తంగా '''జనసంఘ్''' అని పిలువబడే '''భారతీయ జనసంఘ్''' పార్టీ [[1951]]లో [[శ్యాంప్రసాద్ ముఖర్జీ]] చే [[ఢిల్లీ]]లో స్థాపించబడింది. [[1977]]లో ఈ పార్టీని [[జనతా పార్టీ]]లో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన [[అటల్ బిహారీ వాజపేయి]], [[లాల్ కృష్ణ అద్వానీ]] లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. [[1980]]లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు [[భారతీయ జనతా పార్టీ]] స్థాపించారు. ప్రస్తుతం [[భాజపాభారతీయ జనతా పార్టీ]] [[భారతదేశం]]లో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.
== ప్రారంభం ==
1951 [[అక్టోబర్ 21]]న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా [[దీపం]] గుర్తు లభించింది. [[1952]]లో జరిగిన [[పార్లమెంటు]] ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోక్‌సభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించినది. [[1967]] తరువాత ఈ పార్టీ బలపడింది.
పంక్తి 12:
 
== భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ==
జనతా ప్రభుత్వం విచ్ఛిన్నం కావడంతో [[1980]] లోక్‌సభ ఎన్నికల ముందు పూర్వపు భారతీయ జనసంఘ నేతలు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజపేయి భాజపాకుభారతీయ జనతా పార్టీకు తొలి అధ్యక్షుడిగా పనిచేశాడు. [[1989]] తరువాత ఈ పార్టీ బలపడింది. అటల్ బిహారీ వాజపేయి 3 సార్లు [[ప్రధానమంత్రి]] పదవిని కూడా చేపట్టినాడు.
== ప్రముఖ జనసంఘ్ నాయకులు ==
;శ్యాంప్రసాద్ ముఖర్జీ
:[[1901]], [[జూన్ 6]]న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ప్రముఖుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వశించాడు. హిందూ మహాసభ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన తొలి నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన [[అశుతోష్ ముఖర్జీ]] కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెస్ వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించినాడు. స్వాతంత్ర్యానికి పూర్వం [[జవహర్ లాల్ నెహ్రూ]] నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. [[1949]]లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకొని [[అక్టోబర్ 21]], [[1951]]న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా [[మే 23]], [[1953]]న మరణించేవరకు కొనసాగినాడు.
;అటల్ బిహారీ వాజపేయి {{main|అటల్ బిహారీ వాజపేయి}}
:[[1924]]లో [[గ్వాలియర్]] లో జన్మించిన వాజపేయి [[1968]] నుండి [[1973]] వరకు జనసంఘ్ అధ్యక్ష పదవిని చేపట్టినాడు. 1977లో మురార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ మత్రివ్త శాఖను నిర్వహించాడు. 1980లో జనతాపార్టీ నుంచి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నేతలుేర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. కేంద్రంలో 3 సార్లు ఏర్పడిన భాజపాభారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కూడా వాజపేయే ప్రధానమంత్రిగా పనిచేశాడు.
;లాల్ కృష్ణ అద్వానీ {{main|లాల్ కృష్ణ అద్వానీ}}
:[[1927]]లో [[కరాచి]]లో జన్మించిన అద్వానీ చిన్న తనంలోనే ఆర్.ఎస్.ఎస్. పట్ల ఆకర్షితుడైనాడు. [[మహాత్మా గాంధీ]] హత్యానంతరం అనేక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలలో పాటు అద్వానీ కూడా అరెస్టు అయ్యాడు. ఆ తరువాత శ్యాంప్రసాద్ నేతృత్వంలోని జనసంఘ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి పలు పదవులు చేపట్టినాడు. 1977లో జనసంఘ్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడటంతో ఎన్నికలలో విజయం సాధించిన జనతా ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖను నిర్వహించినాడు. జనతా పార్టీ విచ్ఛిన్నం అనతరం 1980లో బయటకు వచ్చి జనసంఘ్ నేతలు భారతీయ జనతా పార్టీని స్థాపించడంతో అద్వానీ కూడా భాజపాలోభారతీయ జనతా పార్టీలో వ్యవస్థాపక నేతగా చేరి పార్టీలో మంచి గుర్తింపు పొందినారు. 1989 తరువాత భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కృషిచేసి పార్టీ అధ్యక్ష పదవిని పొందడంతో పాటు కేంద్రంలో ఏర్పడిన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వత్రించినాడు.
;పి.వి.ఎన్.రాజు:
:[[ఆంధ్ర ప్రదేశ్]] ప్రముఖ భారతీయ జనసంఘ్ నేతలలో ఒకడైన పి.ఎన్.వి.రాజు [[1973]] నుండి [[1976]] వరకు జనసంఘ్ రాష్ట్ర శాఖను అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అత్యవసర పరిస్థితి కాలంలో 18 నెలలు జైలు జీవితం గడిపిన రాజు [[మే 15]], [[2008]] న మరణించాడు.<ref> హిందూ దినపత్రిక, తేది మే 16, 2008 </ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనసంఘ్" నుండి వెలికితీశారు