ఆలె నరేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ (4) using AWB
పంక్తి 30:
2004 ఎన్నికలలో [[మెదక్]] [[లోక్‌సభ]] నియోజకవర్గం నుండి తెరాస పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన నరేంద్ర, తెరాస యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో కేంద్రమంత్రి అయ్యారు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత, ప్రత్యేక తెలంగాణ విషయమై తగిన చర్యలు తీసుకోవట్లేదని తెరాస కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు నరేంద్ర, ఇతర తెరాస మంత్రులతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు.
 
2008 జనవరిలో నరేంద్ర ఉత్తరప్రదేశ్ మహిళా ముఖ్యమంత్రి [[మాయావతి]] ఆధ్వర్యములోని [[బహుజన సమాజ్]] పార్టీ లో చేరారు.<ref> name="merinews.com">{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.merinews.com/catFull.jsp?articleID=128999 | title=బహుజన సమాజ్ పార్టీలో చేరిక|publisher=మేరీన్యూస్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref> ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనారు. అనంతర కాలంలో భాజపాలోభారతీయ జనతా పార్టీలో చేరి పనిచేశారు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
ఆలె నరేంద్ర [[1946]], [[ఆగష్టు 21]] న [[హైదరాబాదు]] లో పుష్పవతి, రామలింగం దంపతులకు జన్మించారు<ref> {{ఇంగ్లీష్}} {{cite web | url= http://india.gov.in/govt/loksabhampbiodata.php | title=నరేంద్ర బయోడేటా|publisher=భారత ప్రభుత్వము|date= ఏప్రిల్ 24, 2008}}</ref>.
స్థానికంగా హైదరాబాదులోనే [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో బియస్సీ పూర్తిచేశారు.
 
==రాజకీయ జీవితం==
ప్రారంభం నుంచి [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] సభ్యుడైన నరేంద్ర [[1983]] నుంచి [[1994]] మధ్యకాలంలో [[భాజపాభారతీయ జనతా పార్టీ]] తరఫున [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు [[హిమాయత్‌నగర్]] నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎన్నికైనారు. [[1978]] లో [[ఖైరతాబాదు]] నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.జనార్థనరెడ్డి చేతిలో కేవలం 659 ఓట్ల తేడాతో ఓడిపోయారు<ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.telangana.com/Hyderabad/hyd_poli.htm| title=రాజకీయాలు|publisher=తెలంగాణా.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>. [[1980]] లో హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఎస్.నారాయణ చేతిలో పరాజయం పొందినారు. [[1983]] లో [[హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం]] నుంచి పోటీ చేసి [[పి.ఉపేంద్ర]] పై గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. [[1985]] లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి కె.ప్రభాకరరావుపై గెలుపొందారు. [[1992]] లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో గెలుపొంది మూడవసారి శాసనసభలొ అడుగుపెట్టారు. [[1994]] లో [[తెలుగుదేశం]] పార్టీకి చెందిన [[కృష్ణయాదవ్]] పై ఓడిపోయారు.[[1999]] లో [[భారతీయ జనతా పార్టీ ]] తరఫున లోక్‌సభకు [[కాంగ్రెస్]] పార్టీకి చెందిన [[బాగారెడ్డి]]పై విజయం సాధించి తొలిసారి లోక్‌సభ సభ్యులైయ్యారు. [[2003]] వరకు భాజపాభారతీయ జనతా పార్టీ లో మంచి పేరు సంపాదించుకొని అభిమానులచే టైగర్‌గా పిలుపించుకున్నారు. ప్రత్యేక [[తెలంగాణా]] వాదంతో కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించిన పార్టీలో చేరి ఆ పార్టీలో రెండో ముఖ్య నాయకుడిగా వ్యవహరించారు. [[2004]] లో మళ్ళీ మెదక్ నియోజకవర్గం నుంచి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరఫున పోటీ చేసి భాజపాకుభారతీయ జనతా పార్టీకు చెందిన [[పి.రామచంద్రారెడ్డిపై]] 1,23,756 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో పర్యాయం లోక్‌సభలో అడుగుపెట్టడమే కాకుండా [[మే 23]] న కేంద్రంలో [[మన్మోహన్ సింగ్]] నేతృత్వం లోని యుపిఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిపదవిని పొందారు.
 
నకిలీ వీసా కేసులో చిక్కుకొని [[ఏప్రిల్]] [[2007]] లో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] నుంచి బహిష్కృతుడై <ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.rediff.com/news/2007/apr/26ap.htm| title=వార్తలు |publisher=రెడిఫ్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (నరేంద్ర) అనే కొత్త పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి జనాదరణ లభించకపోవడంతో [[2008]] [[జనవరి 8]] న [[హైదరాబాదు]] లో [[మాయావతి]] సమక్షంలో [[బహుజన సమాజ్ పార్టీ]] లో చేరారు. <ref>{{ఇంగ్లీష్}} {{cite web | urlname= http://www."merinews.com"/catFull.jsp?articleID=128999 | title=బహుజన సమాజ్ పార్టీలో చేరిక|publisher=మేరీన్యూస్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref> అమెరికాతో అణుఒప్పందం విషయంలో వామపక్షాలు యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న పిదప జరిగిన పరిణామాలతో నరేంద్ర యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైయ్యారు.
 
== మరణం ==
పంక్తి 47:
{{మూలాలజాబితా}}
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:రాజకీయ నాయకులు]]
[[వర్గం:1946 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆలె_నరేంద్ర" నుండి వెలికితీశారు