దళితులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములు: clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ (2) using AWB
పంక్తి 24:
 
== దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములు ==
దళిత శిక్కులు, దళిత బౌద్ధులు దళితులే నని తీర్మానిస్తూ రాజ్యాంగ సవరణ జరిగింది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములను షెడ్యూల్డ్ కులాల వారిగానే పరిగణించాలని కేంద్ర కేబినెట్ 1997 లో ఆమోదించింది. పార్లమెంటులో బిల్లు పాస్ కాలేదు. భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులేనని ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతం మంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు కృష్ణన్‌ చెప్పారు. [[కొల్హాపూర్‌]] మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో [[మైసూర్‌]] మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి.దళిత క్రైస్తవులను కూడా దళితులుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి25.8.2009 న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. షెడ్యూలు కులాలతో సమానంగా వారికి అన్ని రకాల ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు. దీన్ని టీడీపీ, ప్రరాపా, [[తెరాస]], ఎంఐఎం, సీపీఐలు కూడా సమర్థించాయి. దళిత ముస్లింలకు కూడా దీన్ని వర్తింపజేయాలని ఎంఐఎం కోరింది. భారతీయ జనతా పార్టీ లోక్ సత్తా దీన్ని వ్యతిరేకించాయి. ఇది హిందువులకు వ్యతిరేకమని, దీనివల్ల మతమార్పిడులు ప్రోత్సహించినట్లు అవుతుందని భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు కిషన్‌రెడ్డి విమర్శించారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. దళిత క్రిస్టియన్లు, ముస్లింలమీద ప్రేమ ఉంటే బీసీల్లోనే ఉంచి కోటా పెంచాలని కోరారు.
 
== దళితుల ఆలయ ప్రవేశాలు ==
"https://te.wikipedia.org/wiki/దళితులు" నుండి వెలికితీశారు