2006 జనవరి 2వ వారం: కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
చి clean up, replaced: తెరాస → తెరాస (2) using AWB
పంక్తి 12:
 
==జనవరి 10 2006, మంగళవారం==
*'''యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణ రాదు''': తెలంగాణా విషయమై కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి ఇలా అన్నాడు: "కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నంతకాలం తెలంగాణ రాదుగాక రాదు. వస్తుందనుకోవడం బక్వాస్‌. తెలంగాణ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉన్నా... ఈ సంకీర్ణ ప్రభుత్వంలో సాధ్యమైతలేదు. తెలంగాణకు అడ్డుకాలేసిన లెఫ్ట్‌ పార్టీల వద్దే 64 ఎంపీల బలముంది. ఇగ తెలంగాణ ఎట్లొస్తది? సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి రావాలి. రెండో ఎస్సార్సీ ఏర్పడాలి. అప్పుడే ప్రత్యేక తెలంగాణ సాధ్యం. రెండో ఎస్సార్సీ ఏర్పడితే దాని ఛైర్మన్‌ మనోడుంటడు. ఎస్సార్సీ నిబంధనలను, విధి విధానాలనూ మనకు అనుకూలంగా ఖరారు చేసుకోవచ్చు. ఆర్నెల్లలో తెలంగాణ వస్తది. కానీ రెండో ఎస్సార్సీకి [[తెరాస]] ఒప్పుకోలేదు. లేదంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేది"
*'''స్క్రామ్‌జెట్‌''': శబ్ద వేగానికి అనేక రెట్ల వేగంతో ప్రయాణించగల స్క్రామ్‌జెట్‌ పరిజ్ఞానాన్ని భారత్‌ సొంతం చేసుకుంది. ప్రపంచంలో అమెరికా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశంగా చరిత్ర సృష్టించింది. [[తిరువనంతపురం]]లోని [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ]] ([[ఇస్రో]])కు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రంలో దేశీయంగా రూపొందించిన స్క్రామ్‌జెట్‌ను విజయవంతంగా పరీక్షించారు.
 
==జనవరి 9 2006, సోమవారం==
*ప్రత్యేక తెలంగాణ ఇచ్చేస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెసు చెప్పలేదని అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా తెరాసతో[[తెరాస]]తో పొత్తు కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన ‌రాష్ట్ర మంత్రి డి.శ్రీనివాస్‌ వెల్లడించాడు.
*[[పోలవరం ప్రాజెక్టు]] ఎత్తు తగ్గించడం సాధ్యం కాదనీ, దానివల్ల ఆశించిన ప్రయోజనాలు అందకుండా పోతాయనీ నిపుణుల కమిటీ తేల్చింది. ఈ విషయంలో రిటైర్డ్‌ ఇంజినీర్లు టి. హనుమంతరావు, ధర్మారావు, జోగారావు అందజేసిన ప్రతిపాదనలు సాంకేతికంగా, ఆర్థికంగా ఆచరణ సాధ్యం కావని నిర్ధారణకు వచ్చింది.
*ప్రశ్నలకు ముడుపుల విషయంలో సుప్రీం కోర్టు "ఏ చట్టం కింద, ఏ నిబంధన కింద ఎంపీలను సభలనుండి బహిష్కరించారు? రెండు వారాల్లో మీ సమాధానం చెప్పండి" అంటూ కేంద్రానికి, [[లోక్‌సభ]] స్పీకరు [[సోమనాథ ఛటర్జీ]]కి, [[రాజ్యసభ]] ఛైర్మన్‌కు, [[భారత ఎన్నికల కమిషను|ఎన్నికల కమిషన్‌]]కు నోటీసులు జారీచేసింది.
పంక్తి 23:
*తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రాజకీయ విమర్శలకు వేదికైంది. [[ఆలె నరేంద్ర]], [[పి.జనార్ధనరెడ్డి]] ల మధ్య వాగ్యుద్ధానికి కారణమైంది. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసుకు పుట్టగతులుండవని నరేంద్ర అనగా, మాకు అప్పుడుండవేమో గాని, మీకు ఇప్పటికే పుట్టగతులు లేకుండా పోయాయి అని జనార్ధనరెడ్డి అన్నాడు.
*'''తెలుగుకు ప్రాచీనభాష హోదా''': తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించే విషయమై తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరిగింది. ఖేంద్ర మంత్రి దాసరి, సురవరం సుధాకరరెడ్డి ప్రసంగించినవారిలో ఉన్నారు.
*ఐపీఎస్‌ అధికారి హంతకుడు... లష్కరే తోయిబా అగ్రనేత, కరుడుగట్టిన ఉగ్రవాది ముజీబ్‌కు క్షమాభిక్ష రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా [http://www.eenadu.net/archives/archive-9-1-2006/panelhtml.asp?qrystr=htm/panel4.htm ఈనాడు] లో వార్త వచ్చింది.
*'''ఫోను టాపింగు''': నా ఫోను టాపింగు చేసారంటూ అమర్ సింగు బాబుతో చెప్పుకోడానికి వస్తే, బాబు ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ, నా ఫోను కూడా ఏడాదిగా టాపింగవుతోందంటూ అన్నాడు.
*'''ఎన్‌కౌంటర్''': బస్సు దోపిడీల నేరస్తుడు కొక్కుల రాజు పోలీసులతో జరిగిన ''ఎన్‌కౌంటర్'' లో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/2006_జనవరి_2వ_వారం" నుండి వెలికితీశారు