శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వలస ప్రభుత్వం: clean up, replaced: సాంరాజ్యాన్ని → సామ్రాజ్యాన్ని using AWB
చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 68:
|footnotes =
}}
'''శ్రీలంక''' (ఆధికారికంగా డెమోక్రటిక్ సోషలిష్టు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక)ను 1972కు పూర్వం''' సిలోను''' అనేవారు. [[భారతదేశం|భారతదేశ]] దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం [[దక్షిణ ఆసియా]] లో ఒక చిన్న [[ద్వీపం]]. [[హిందూ మహాసముద్రం]] లో ఆణిముత్యంగా ప్రసిద్దిప్రసిద్ధి చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు. ఇది ఉన్న ప్రదేశం మూలంగా [[పశ్చిమ ఆసియా]] కు మరియు [[ఆగ్నేయ ఆసియా]] కు నౌకాయాన కేంద్రంగా నిలిచింది. ప్రాచీన కాలం నుంచి [[బౌద్ధ మతము]] నకు మరియు సాంప్రదాయానికి కేంద్ర బిందువు. కానీ నేడు ఇతర మతాలైన [[హిందూ మతం]], [[క్రైస్తవ మతం]], [[ఇస్లాం మతం]] ప్రజలు మరియు ఇతర జాతుల వారు 25% శాతం వరకూ ఉన్నారు. జనాభాలో సింహళీయులే అధికంకాగా ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న [[తమిళులు]] మైనారిటీలో అధిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని ముస్లిం తెగల వారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.
టీ, కాఫీ, రబ్బరు, మరియు కొబ్బరి కాయల ఎగుమతులకు శ్రీలంక ప్రసిద్ధి గాంచింది. అభివృద్ధి చెందుతున్న ఆధునిక వాణిజ్య వ్యవస్థ, ప్రకృతి అందాలు సముద్ర తీర ప్రాంతాలు, మరియు అడవులు ఘనమైన సంస్కృతి మరియు నాగరికతలు దీనిని పర్యటక కేంద్రంగా నిలుపుతున్నాయి. రెండు వేల సంవత్సరాలపాటు చిన్న రాజ్యాలుగా పాలింపబడిన శ్రీలంకకు, 16వ శతాబ్దం మొదటి భాగంలో పోర్చుగీసు వారి రాకతో విదేశీయుల రాక ఆరంభమైంది. 1815వ సంవత్సరంకల్లా బ్రిటిష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో [[జపాన్]] పై దాడిచేసేందుకు [[సంకీర్ణ దళాలు|సంకీర్ణ దళాలకు]] శ్రీలంక ప్రధాన స్థానంగా ఉపయోగపడింది. జాతీయ రాజకీయ ఉద్యమం మూలంగా 20వ శతాబ్దం మొదటి భాగంలో 1948 లో స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుంచి శ్రీలంక గణతంత్ర రాజ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈశాన్య ప్రాంతంలో పొంచిఉన్న [[తమిళ్ టైగర్సు|తమిళ పులులు]].
 
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు