కార్ల్ మార్క్స్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 22:
'''కార్ల్ హెన్రిక్ మార్క్స్''' (మే 5, [[1818]] - మార్చి 14, [[1883]]) [[18వ శతాబ్దము|18వ శతాబ్దానికి]] చెందిన ఒక [[ప్రష్యా|ప్రష్యన్]] తత్త్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు.
 
ఒక మేధావిగా మాత్రమే కాక రాజకీయంగా చాలా క్రియాశీలంగా వ్యవహరించిన మార్క్స్ [[సామ్యవాదం|సామ్యవాద]] పితామహుడుగా పరిగణింపబడుతున్నాడు. ఈయన అనేక రాజకీయ, సామాజిక సమస్యల మీద దృష్టి సారించినా కూడా ముఖ్యంగా చరిత్రను అధ్యయనం చేసిన విధానం ఈయనకు ఒక విశిష్టతను చేకూర్చినది. ఈయన రచించిన [[కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక]] లోని ఈ ప్రారంభవాక్యం చరిత్రను గురించిన ఈయన దృక్పథాన్ని తెలుపుతుంది. ''వర్తమాన సమాజపు చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రే''.
 
'పూర్వ వ్యవస్థల వలెనే [[పెట్టుబడిదారీ వ్యవస్థ]] కూడా తన వినాశనానినికి దారితేసే అంతర్గత వైరుధ్యాలను తనలోనే సృష్టించుకుంటుంది. [[భూస్వామ్య వ్యవస్థ]] ఏవిధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా తొలగింపబడిందో అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా [[సామ్యవాద వ్యవస్థ]] ద్వారా తొలగింపబడి [[రాజ్యం]] లేని [[వర్గరహిత సమాజం]] ఏర్పడుతుంది. కాకపోతే ఈ వర్గరహిత సమాజం అనేది [[కార్మిక వర్గ నియంతృత్వం]] అనబడే పరిణామ దశను దాటిన తరువాతనే ఆవిర్భవిస్తుంది' అని మార్క్సు విశ్వసించాడు.
 
మార్క్స్ తన జీవితకాలములో అంత గుర్తింపు పొందనప్పటికీ, మరణించిన కొద్ది కాలము లోనే కార్మికుల జీవితాలలో ఆతని ఆలోచనలు చాలా ప్రభావాన్ని చూపించడము మొదల్లు పెట్టాయి. [[రష్యా]]లో [[అక్టోబరు విప్లవము]] దీనికి సహాయ పడినది.
పంక్తి 33:
[[1845]] లో మార్క్స్ తన విప్లవ కార్య కలాపాల వలన పారిస్ నుండి బహిష్కరించబడ్డాడు.దానితో మార్క్స్ [[బ్రస్సెల్స్]] చేరుకుని అచట మరలా తన విప్లవ కార్యాచరణను ప్రారంభించాడు.
 
యూరోపియన్ నగరాలన్నింటిలోని విప్లవ సమూహాలన్ని [[1847]] లో [[కమ్యూనిస్టు లీగ్]] గా ఏకీకృతమయ్యాయి. మార్క్స్ మరియు ఎంగెల్స్ ఈ కమ్యూనిస్టు లీగ్ కు సైద్దాంతిక సూత్రీకరణలను తయారు చేయుటకు నియమింపబడ్డారు. ఎంగెల్స్ సహయంతో మార్క్స్ ఈ బాధ్యతను నిర్వర్తించాడు.అలా రచింపబడినదే చరిత్రలో ఆధునిక సోషలిస్టు సిద్ధాంతం యొక్క మొట్టమొదటి శాస్త్రీయ ప్రకటనగా ప్రసిద్దిప్రసిద్ధి చెందిన ''[[కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక]]''.
 
ఈ రచనలో మార్క్స్ [[చారిత్రక భౌతిక వాదం|చారిత్రక భౌతిక వాద]] దృక్కోణంలో చరిత్రను వ్యాఖ్యానించాడు.సమాజపు చరిత్రంతా పీడక మరియు పీడిత వర్గాల అంటే పాలక మరియు పాలిత వర్గాల మధ్యన జరిగిన సంఘర్షణల చరిత్రే.ఈ క్రమంలో పెట్టుబడిదారీ వర్గం ప్రపంచ వ్యాప్త కార్మిక వర్గ విప్లవం ద్వారా తొలగింపబడి వర్గరహిత సమాజం ఏర్పడుతుందని ఈ ప్రణాళికలో మార్క్స్ సూత్రీకరించాడు.
"https://te.wikipedia.org/wiki/కార్ల్_మార్క్స్" నుండి వెలికితీశారు