అణువు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
 
==అణువుల కట్టడి==
అణువులు ఎలా ఉంటాయో ఎవ్వరూ కంటితో చూడలేదు కాని, వాటి నిర్మాణశిల్పాన్ని ప్రతిబింవబించే నమూనాలు మాత్రం రెండు ఉన్నాయి. ఈ రెండు నమూనాలలోను అణువులో రెండు భాగాలు ఉన్నట్లు ఊహించుకోవచ్చు. అణువు మధ్యలో ఉన్న భాగాన్ని కణిక అని కాని కేంద్రకం (nucleus) అని కాని అంటారు. అణువు ద్రవ్యరాసి (mass) లో సింహభాగం (99.94% పైగా) ఈ కణిక లేదా కేంద్రకంలో ఉంది. మిగిలిన అత్యల్ప ద్రవ్యరాసి అణువు చుట్టూ ఉన్న ఎలక్‌ట్రానులలో ఉంది. బోర్‌ నమూనాలో ఈ ఎలక్‌ట్రానులని సూర్యుడి చుట్టూ గ్రహాల మాదిరి ఊహించుకుంటాం. ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన రెండవ నమూనాలో ఈ ఎలక్‌ట్రానులని ఒక మేఘంలా ఊహించుకుంటాం.
 
ప్రతి అణువు యొక్క కణిక లేదా కేంద్రకంలో ఒకటి లేదా అంతకంటె ఎక్కువ ప్రోటాన్లు ఉంటాయి. కొన్ని అణు కేంద్రకాలలో నూట్రానులు కూడ ఉంటాయి. ప్రోటానులను, న్యూట్రానులను కలిపి నూక్లియానులు అని కూడ అంటారు. ప్రోటాన్లు ధనాత్మక విద్యుదావేశమును కలిగి వుంటాయి, ఎలక్ట్రాన్లు ఋణాత్మక విద్యుదావేశమును కలిగి వుంటాయి. న్యూట్రాన్లు ఏ విద్యుదావేశమును కలిగి వుండవు. ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య సరి సమానంగా ఉంటే, ఆ అణువు ఏ విద్యుదావేశం లేకుండా తటస్థంగా ఉంటుంది. ఒక అణువులో ప్రోటాన్లు, ఎలెక్‌ట్రానులు సరిసమానంగా లేకపోతే అప్పుడు అది ధనాత్మక లేదా ఋణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు దానిని ఒక అయాన్ అంటారు.
 
==పరమాణువు==
 
'''పరమాణువు''' అంటే అణువు కంటే చిన్న కణము. పరమాణువు కణాలకు కొన్ని ఉదాహరణలు: ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు. వీటిని కూడ ఇంకా చిన్నవి అయిన క్వార్క్‌లు అనే ఊహాత్మక కణాల సంయోగాలుగా నమూనాలు ఉన్నాయి. అనగా, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్‌ట్రానులు కూడ క్వార్క్‌ల తో కట్టినట్లు అని ఊహించుకోవచ్చు.
 
==అణువా? పరమాణువా? అయోమయం==
పంక్తి 16:
 
==అయోమయ నివృత్తి==
ఆధునిక భౌతిక శాస్త్రంలో, ఇంగ్లీషులో, ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న atom అన్న మాటకి సమానార్థకమైన తెలుగు మాట ఏమిటో పరిశీలిద్దాం.
 
ప్రాచీన భారత దేశంలో [[కాణాదుడు]] అణుసిద్ధాంతాన్ని ప్రతిపాదించేడు. ఆయన ప్రపంచంలోని వస్తువులన్నీ "అణువు"ల సముదాయం అన్నారు. ఆయన "అణువు" అన్న మాటనే వాడేరు. ఆయన "అణువు" అని పిలచినది ఈనాటి atom తో సరి తూగుతుందా అని విచారించాలి. అదే కాణాదుడు "రెండేసి అణువుల సమూహాన్ని "ద్వియాణువు" అనిన్నీ, మూడేసి అణువుల సమూహాన్ని "త్రయాణువు" అని కూడ అభివర్ణించేరు. కనుక కాణాదుడు వాడిన "ద్వియాణువు," "త్రయాణువు" అన్న భావాలని కలగలిపి ఈనాడు మోలిక్యూల్ (molecule) తో సరిపోల్చవచ్చు. కనుక కాణాదుడు అణువు అన్నప్పుడు ఆయన ఉద్దేశం atom అనే అని తెలుస్తున్నాది కదా.
 
మంత్రపుష్పంలో ఆత్మ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అన్న ప్రశ్నలకి సమాధానం చెబుతూ ఋగ్వేదంలో ఉన్న మంత్రపుష్పంలో "నీవారశూకవర్తన్వీ పీతాభాస్వతణూపమా" అని ఉంది. ఇది ఋగ్వేదంలో ఉన్న మంత్రం. దీనిని భారత దేశంలో పూజ చేసినప్పుడల్లా పఠిస్తూ ఉంటారు. నీవార ధాన్యపు మొనలా అణు ప్రమాణంలో ఆత్మ హృదయ పీఠంలో ఉంది అని అర్థం. ఇక్కడ వాడిన మాట "అణు." ఇది ద్వియాణువు కాదు, త్రయాణువు కాదు, బహుళాణువు కాదు.
పంక్తి 28:
అలాగని "పరమాణువు"ని పెంట మీద పారెయ్యక్కరలేదు. ఎలక్‌ట్రానులని, ప్రోటానులని, నూట్రానులని కలగలిపి పరమాణువులు అనొచ్చు.
==బణువు==
ఇప్పుడు మోలిక్యూలు అనే మాటకి తెలుగు మాట కావాలి. ఒక మోలిక్యూలులో రెండు అణువులు (atoms) ఉండొచ్చు, రెండు వందల అణువులు ఉండొచ్చు. దీనికి "బహుళాణువు" (ద్వయాణువు, త్రయాణువు అన్న సంప్రదాయం ప్రకారం) అని పేరు పెట్టవచ్చు. బహుళాణువునే కుదించి [[బణువు]] అని [[తెలుగు భాషా పత్రిక]]లో 1970లో ఒకరు వాడేరు. చిన్న చిన్న అణుసమూహాలని బణువు అనిన్నీ, మరీ పెద్దగా ఉన్న అణు సమూహాలని బృహత్‌ బణువు (mega molecule) అనొచ్చు. అప్పుడు బాగా పొడుగైన రబ్బరు వంటి బణువులని, [[వారసవాహికలు|వారసవాహికల]] బణువులని బృహత్‌బణువులు అనొచ్చు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అణువు" నుండి వెలికితీశారు