"అబుల్ హసన్ కుతుబ్ షా" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (Wikipedia python library)
అబుల్ హసన్ చిన్నతనంలో అబ్దుల్లా మహారాజు భవంతిలో ఉండేవాడు. అతను ఎవరి కుమారుడో తెలియకున్నా, అతనికీ రాజవంశానికి ఏదో సంబంధం ఉందని భావిస్తూ అందరూ కొద్దిపాటి గౌరవాన్ని ఇచ్చేవారు. చిన్నతనంలోనే తాగుబోతుగా మారి అల్లరిచిల్లరిగా జీవితాన్ని గడుపుతూండే అబుల్ హసన్ ఓసారి మహారాణినే ఆ మైకంలో అవమానించాడు. దానితో కోపించిన మహారాజు భవంతి నుంచి వెళ్ళగొట్టారు. అనంతరం అతను నగరంలో ప్రసిద్ధిచెందిన సూఫీ సన్యాసి షారాజు ఆశ్రమంలో చేరాడు. ఇబ్బంది కలిగించకుండా అక్కడ బ్రతికేవారందరికీ ఆశ్రయం, ఆహారం అందించే సన్యాసి వాడుక అతనికి వరమైంది. చివరకి కొన్నాళ్ళకు అబుల్ హసన్ షారాజుకు సన్నిహిత శిష్యుడయ్యాడు.
== వివాహం-పట్టాభిషేకం ==
మహారాజు అబ్దుల్లా కుతుబ్షా మూడవ కుమార్తెకు వివాహం చేసే విషయంలో అంత:పురంలో కలహాలు తలెత్తాయి. అబ్దుల్లా రెండవ అల్లుడు నిజాముద్దీన్ అహమ్మద్ ప్రోద్బలంతో తన మూడవ కుమార్తెకు సయ్యద్ అహమ్మద్ అనే వ్యక్తిని ఇచ్చి పెళ్ళిచేసేందుకు నిశ్చయించారు. అయితే తదనంతర కాలంలో నిజాముద్దీన్ కీ, సయ్యద్ కీ నడుమ చోటుచేసుకున్న వివాదాల వల్ల నిజాముద్దీన్ ఈ వివాహం చేయవద్దని, అలా చేస్తే తాను ముఘలులతో కలిసిపోయి మరీ గోల్కొండపై దండెత్తిస్తానని బెదిరించసాగాడు. ఇంతలో వివాహం తరుముకొస్తోంది, వివాహం ఏర్పాట్లు అలాగే సాగనివ్వమని, మూడురోజుల తర్వాత వస్తే తాను సరైన వరుణ్ణి చూపి సమస్య పరిష్కరిస్తానని షారాజ్ అబ్దుల్లాను పంపారు. మూడురోజుల పాటుగా కోటలో సయ్యద్ అహమ్మద్ ని పెళ్ళికొడుకుని చేయడం వంటి లాంఛనాలు కొనసాగించారు. పెళ్ళివేళకు షారాజు తన ఆశ్రమంలోని తానాషాకి ఇచ్చి పెళ్ళిచేయమని, అతనే తదుపరి రాజ్యానికి వస్తాడని ఆదేశించారు. ఆ ప్రకారమే హఠాత్తుగా అతనికిచ్చి రాకుమార్తెను పెళ్ళిచేశారు మహారాజు.<br />
మహారాజు అబ్దుల్లా కుతుబ్షా మరణించేలోపుగా తన ప్రవర్తనతో అందరినీ తానాషా ఆకట్టుకున్నారు. అబ్దుల్లా మరణశయ్యపైకి చేరాకా జరిగిన వారసత్వ యుద్ధంలో సైనికాధికారులు, మంత్రులు వంటివారందరినీ చాకచక్యం, మంచితనంతో ఆకట్టుకున్న తానాషా తన తోడల్లుడు నిజాముద్దీన్ మీద విజయం సాధించారు. అబ్దుల్లా అనంతరం గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించారు.<ref name="నరేంద్ర లూథర్">{{cite book|last1=లూథర్|first1=నరేంద్ర|title=హైదరాబాద్ జీవితచరిత్ర|location=హైదరాబాద్}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1707132" నుండి వెలికితీశారు