కుషాణులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 172:
 
== కుషాణుల రాజ్యం క్షీణత ==
[[దస్త్రం:Coin of KanishkaII.jpg|thumb|150px|right|2వ కనిష్కుని బంగారు నాణెం - 200-220 కాలం]]
[[దస్త్రం:KushanCoinage.jpg|thumb|150px|1వ శకుడు - కుషాణుల చివరి పాలకులలో ఒకడు(325-345).]]
3వ శతాబ్దం నుండి కుషాణుల రాజ్యం విచ్ఛిన్నమవ్వసాగింది. 225లో 1వ వాసుదేవుడు మరణించాడు. తరువాత కుషాణు రాజ్యం తూర్పు, పశ్చిమ భాగాలుగా విడిపోయింది. 224-240 కాలంలో [[సస్సానిద్]]‌లు బాక్ట్రియా, ఉత్తర భారతదేశంపై దండెత్తారు. 270 నాటికి కుషాణులు గంగా నది మైదాన ప్రాంతంలో తమ అధికారం కోల్పోయారు. 320నాటికి [[గుప్త సామ్రాజ్యం]] స్థాపింపబడింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం సస్సనిద్‌ల వశమైంది. 4వ శతాబ్దంలో [[:en:Kidara|కిదారుడు]] అనే సామంతరాజు పాత వంశాన్ని కూలదోసి తనను తాను కుషాణు రాజుగా ప్రకటించుకొన్నాడు. అతని కాలంలో రాజ్యం చిన్నదైనా గాని సంపన్నంగా ఉంది. 5వ శతాబ్దంలో [[:en:White Huns|తెల్ల హూణుల]] దండయాత్రల వలనా, తరువాత [[ఇస్లాం]] విస్తరణ వలనా మిగిలిన కొద్దిపాటి కుషాణు పాలన కూడా తుడిచిపెట్టుకుపోయింది.
"https://te.wikipedia.org/wiki/కుషాణులు" నుండి వెలికితీశారు