వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 203:
[[అక్షరశిల్పులు]] అనేది సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ వ్రాసిన 180 పేజీల పుస్తకం. పుస్తకం లో ఆయన 2008 లో ఒక ప్రకటన ద్వారా 242 మంది రచయితలు వారి వివరాలను తీసుకున్నట్లు తెలియజేసారు. ఆ పుస్తకంలో 333 మంది కవుల గూర్చి వ్రాసారు. వారి గూర్చి శోధించేవారికి వికీసోర్సులో విషయం లభ్యమవుతుంది. అందులో చాలా వ్యాసాలు మొలకలు. వాటి గూర్చి ఆ పుస్తకం తప్ప ఏ విధమైన వనారులు,మూలాలు లభించుటలేదు. అందులో ప్రఖ్యాతి పొందిన [[యాకూబ్ (కవి)]] వంటి వారిపై వ్యాసాలు వ్రాయవచ్చు. యితరత్రా మూలాలు లభ్యమైన వాటి గూర్చి వ్యాసాలు వ్రాయవచ్చు. ఆ పుస్తక మూలం మాత్రమే ఉన్నదని అన్నింటికీ వ్యాసాలు వ్రాయడం సరికాదు. ఆ విషయాలు కూడా పుస్తక రచయితకు ఆ రచయితలే యిచ్చినట్లు పుస్తకం ద్వారా తెలియుచున్నది. దయచేసి అందులో ముఖ్యమైన వారిగూర్చి వ్యాసాలు వ్రాయాలని మనవి. అలా అయితే మన రాష్ట్రంలో ఒక శతకం,కథలు,పద్యాలు వ్రాసిన తెలుగు పండితులు అనేక మంది పాఠశాలలలోనూ,కళాశాలల లోనూ ఉన్నారు. కానీ వారి రచనల గూర్చి ఏ విధమైన మూలాలు లభ్యం కావు. మూలాలు లేనందున వారికి నోటబిలిటీ లేదని అర్థం. కనుక నోటబిలిటీ ఉన్న వ్యక్తుల వ్యాసాలు వ్రాయడం మంచిది.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 07:33, 20 సెప్టెంబరు 2015 (UTC)
:: నోటబిలిటీ గురించి అక్షరశిల్పులు ఉదాహరణ తీసుకుని నా అభిప్రాయాలు పంచుకోదలిచాను. ఒకటి కంటే ఎక్కువ మూలాలు కలిగివుంటే నోటబుల్ అనుకోవచ్చుననుకుందాం, తెలుగు సాహిత్య వాతావరణంలో ఉన్న పుస్తకాలు దొరకడం ఎంతో కష్టంగా ఉంది. ఎవరి గురించైనా రాసేప్పుడు ఒక మూలం దొరకడమే మహద్భాగ్యమైన పరిస్థితి. అలాంటి స్థితిలో నోటబిలిటీకి మరిన్ని ప్రమాణాలు కూడా వుంటే బావుంటుందనుకుంటున్నాను. ఉదాహరణకు కనీసం 2-3 తెలుగు పుస్తకాలు రాసిన రచయితలు నోటబుల్ అనో, లేక మరేదైనానో తీసుకోవచ్చు. ఒక శతకం, మూడు కథలు, 30 పద్యాలు రాసిన తెలుగు పండితులు ప్రతి 4 పాఠశాలలకు ఒకరున్నారన్న మాట కరెక్టే. కానీ అక్షరశిల్పులు పుస్తకంలో గణించదగ్గ సంఖ్యలో బహు గ్రంథకర్తలు ఉంటే వారిని పరిగణించవచ్చు కదా. కనీసంలో కనీసం వారి పుస్తకాలను రకరకాల మేగజైన్లలో చేసిన రివ్యూలే ఉంటాయి ఓ నాలుగైదు. ఆ రివ్యూలు కేవలం తెలుగు మేగజైన్లు, వార్తాపత్రికలు, పుస్తకాలు అంతర్జాలంలో లభించట్లేని ఒకే ఒక కారణాన మనకు దొరకట్లేదు. మనకు దొరక్కుంటే వారు నోటబుల్ కాకుండా పోరు కదా. ఆలోచించి చూడండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:58, 22 సెప్టెంబరు 2015 (UTC)
 
== వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2016 ==
 
<div style="margin: 0.5em; border: 1px black solid; padding: 1em;background-color:#E3F0F4" >
{| style="border:1px black solid; padding:2em; border-collapse:collapse; width:100%;"
|-
! style="background-color:#FAFAFA; color:black; padding-left:2em; padding-top:.5em;" align=left |
నమస్తే,
 
మేము మిమ్మల్ని [[:m:WikiConference India 2016|వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2016]]కు ఆతిథ్యమిచ్చే ప్రతిపాదన (bid) కొరకు ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రతిపాదన (బిడ్) రెండు రౌండ్లు కలిగివుంది. మొదటి రౌండ్ పాల్గొనడాన్ని ప్రోత్సహించే సాధారణ రౌండ్. స్థానిక సముదాయం సహకారం, సామర్థ్యాలను నిర్ధారించుకోవడం మొదటి రౌండ్ లక్ష్యం. మొదటి రౌండ్ నుంచి 5 అర్హత పొందిన నగరాలు ప్రతిపాదన (బిడ్డింగ్) యొక్క అంతిమమైన రెండో రౌండ్ లో మరింత విపులమైన ప్రణాళికతో పాల్గొంటాయి.
 
'''మొదటి రౌండ్ ప్రతిపాదన (బిడ్డింగ్) ప్రమాణాలు'''
* నగరం మరియు ప్రతిపాదిత వేదిక. ఈ నగరంలో కనీసం ఓ దేశీయ (domestic) విమానాశ్రయం అయినా వుండాలి.
 
* ఈ కార్యక్రమాన్ని మీ నగరంలో జరిగితే నిర్వహణలో పాలుపంచుకునేందుకు నిబద్ధులైన వికీమీడియా ప్రాజెక్టు క్రియాశీలక వాడుకరుల వికీమీడియా సంతకాలు.
 
* బిడ్ ని సముదాయ సభ్యులు ఆమోదించిన స్థానిక రచ్చబండ పేజీ లింకు.
 
* 500మంది నమోదైన సభ్యులు పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మొత్తం ప్రతిపాదిత బడ్జెట్ (స్కాలర్షిప్ పొందే వందమందికి 3 రోజులపాటు ఇచ్చే వసతి ఖర్చు కూడా కలుపుకుని).
 
* ఇటువంటి కార్యక్రమం(లేదా కార్యక్రమాలు) చేసిన పూర్వానుభవం.
 
దయచేసి 18 అక్టోబర్ 2015 11:59 PM ISTలోపుగా బిడ్స్ [[:m:WikiConference India 2016/City/First Bids|ఇక్కడ]] చేర్చగలరు.
 
అభినందనలతో,
 
వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016 వాలంటీర్లు
|}</div>
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు