బి.వి. కారంత్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
బాల్యం నుంచే సంగీత సాహిత్యాలపట్ల మక్కువ చూపించేవారు. ఆ మక్కువతో ఎందరో ప్రసిద్ధుల్ని నాటక,సినీరంగాలకు అందించిన గుబ్బివీరణ్ణ నాటక కంపెనీలో చేరాడు. జి.వి.అయ్యర్, రాజకుమార్ బాలకృష్ణ వంటి సినీ,నాటకరంగ దిగ్గజాలతో కారంత్ గుబ్బి కంపెనీల మనుగడసాగింది. ఆ కంపెనీలోనే బాల్యంలో చిన్న చిన్నవేషాలు వేశారు. అక్కడినుండి ఉత్తరాదికి వెళ్ళి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో హిందీ ఎం.ఏ.లో చేరారు. సుప్రసిద్ధ విద్వాంసులు పండిట్ ఓంకారనాద టాగూర్ వద్ద సంగీతాన్ని అభ్యసించారు. బాల్యం కర్ణాటకలో గడిపి, యవ్వనదశ ఉత్తర భారతంలో గడపటంతో భిన్నప్రాంత ప్రజల జీవన సరళితో, ఆచార వ్యవహారాలలో అతనికి ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఈ అనుభవమేు ఉత్తరోత్తరా నాటక, సినీరంగాలలో దర్శకుడిగా విజయం సాధించటానికి తోడ్పడింది.
 
దేశంలోని వివిధ ప్రాంతాలు తిరగడం వల్ల దర్శకుడిగా కారంత్ విజయం సాధిస్తూ నాటకాన్ని ప్రజల హృదయాలకు చేరువ చేయగలిగారు. సంగీతం నేర్చుకోవడం సైడ్ ప్రైవర్, కైలాసం వంటి నాటకాలను సంగీతాత్మకాలుగానే కారంత్ తీర్చిదిద్దారు. అప్పటికే భారతీయ, పాశ్చాత్యనాటక రచనల్ని ఆధునిక నాటక దర్శకుల ధోరణుల్ని ప్రజ్ఞా పాటవాల్నీ పట్టించుకున్నా, మరేదో నేర్చుకోవాలన్న తపనతో [[నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా]] లో చేరి డిప్లోమా పొందారు.
 
వెంగుళూరుకు తిరిగి వచ్చిన కారంత్.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి.వి._కారంత్" నుండి వెలికితీశారు