ఆకాశవాణి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 52:
=== వార్తలు ===
రేడియో వార్తలు నిబద్ధతకు, విశ్వసనీయతకు పేరుపొందాయి. సమాచార వ్యవస్థ పటిష్టంగా లేని రోజుల్లో రేడియో వార్తల్లో స్కూళ్లకు సెలవిచ్చారని విని - వూళ్లలో బళ్ళు మూసేసిన రోజులున్నాయని, వివిధ రకాల ఛానెల్స్, న్యూస్ ట్రాకింగ్ వంటి వ్యవస్థలు లేకపోవడం వల్ల రేడియోలో ఇప్పుడే అందిన వార్త కోసం జనం ఎదురుచూసేవారని ఆకాశవాణి మాజీ విలేకరి భండారు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆకాశవాణి సంచలనాలకు తావివ్వకున్నా ఎన్నో వార్తలను ముందుగా బ్రేక్ చేసిన ఘనత పొందింది. అంజయ్య భారీ మంత్రివర్గం రాజీనామా, విమానప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం, తెలుగుదేశం ప్రధానకార్యదర్శిగా చంద్రబాబునాయుడు ఎన్నిక, నెలరోజుల నాదెండ్ల ఎపిసోడ్ అనంతరం ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణస్వీకారం చేయడానికి ఎన్టీ రామారావుకు ఆహ్వానం వంటి వార్తలను ముందుగా బ్రేక్ చేసింది ఆకాశవాణి వార్తాలే. ఎన్టీ ఆర్ మరణవార్తను ఆయన మరణించిన కొద్ది గంటల్లోపే ఆకాశవాణి డిల్లీ నుంచి వెలువడే ఇంగ్లీష్ న్యూస్ బులెటిన్ ద్వారా ప్రజలకు ముందుగా తెలిపింది<ref>వార్తల వెనుక కథ పుస్తకంలో అడవిబాటలో రాజీవ్ గాంధీ శీర్షికన భండారు శ్రీనివాసరావు రాసిన వ్యాసం</ref><br />
1939 అక్టోబర్ 1 నాడే ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు మొదలయ్యాయి. అనంతరం ప్రారంభమయిన హైదారాబాద్, విజయవాడ కేంద్రాల వార్తా విభాగాలే నేడు తెలుగు వార్తా ప్రసారాలు చేస్తున్నాయి. ప్రాంతీయవార్తలే కాక తెలుగు వార్తాబులెటిన్లు కూడా ప్రస్తుతం హైదారాబాద్ కేంద్రం నుంచే ప్రసారమవుతున్నాయి. ఢిల్లీ నుంచి వార్తలు చదివిన తొలితరం వారిలో శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. కపిల కాశీపతి, శ్రీవాస్తవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, వనమాలి ప్రసాద్, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు, మల్లాది రామారావు, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, [[పి.ఎస్.ఆర్.ఆంజనేయశాస్త్రి]], సురమౌళి, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, జోళిపాలెం మంగమ్మ, డి.వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి, కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ తదితరులు వార్తలు వినిపించడంలో సుప్రసిద్ధులు. పన్యాల రంగనాథరావు, నర్రావుల సుబ్బారావు, ఆకిరి రామకృష్ణారావు, నర్రావుల సుబ్బారావు, ఆకిరి రామకృష్ణారావు, మల్లాది రామారావు, ఆర్.వి.వి.కృష్ణారావు, జె.బి.రాజు, కె.ఆసయ్య వంటి వార్తా సంపాదకులు వార్తల వెనుక పనిచేశారు.
 
=== లలిత సంగీతం ===
"https://te.wikipedia.org/wiki/ఆకాశవాణి" నుండి వెలికితీశారు