మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కోర్టు కేసులు: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Telengana.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా (తెలుపు రంగుతో సూచించబడినది)]]
ఆంధ్ర, [[తెలంగాణా]] ప్రాంతాలు కలిసి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు]] కావడంలో కీలకమైనది [[పెద్దమనుషుల ఒప్పందం]]. [[1956]], [[ఫిబ్రవరి 20]] న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి [[1956]], [[నవంబర్ 1]] న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యాడు.
 
అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు; అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే [[1959]]లో [[దామోదరం సంజీవయ్య]] ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన [[కె.వి.రంగారెడ్డి|కొండా వెంకట రంగారెడ్డి]] (కె.వి.రంగారెడ్డి)ని నియమించాడు. అయితే మళ్ళీ [[1962]] నుండి [[1969]] వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన [[జె.వి.నర్సింగరావు]]ను ఉపముఖ్యమంత్రిగా నియమించారు.