దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
== వివాహం - పిల్లలు ==
లక్ష్మిదేవితో ప్రేమ వివాహం జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు ([[రాజీవ్ కనకాల]]), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ [[సుమ_కనకాల|సుమ]]తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. [[పెద్ది రామారావు]] తో జరిగింది.
 
== ఇతరములు ==
కొన్నిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేసి [[ఓ సీత కథ]] లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాకుండా [[చలిచీమలు]] వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో [[ఎ.ఆర్.కృష్ణ]] సారధ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు [[తెలుగు విశ్వవిద్యాలయం]] రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
 
దూరదర్శన్ కోసం వీరు దర్శకత్వం వహించిన ''రాజశేఖర చరిత్ర'', ''డామిట్ కథ అడ్డం తిరిగింది'' మొదలగు సీరియల్స్ విశేష ప్రజాధరణ పొంది, అనేక బహుమతులను అందుకున్నాయి.
ప్రస్తుతం ''ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్'' అనే నట శిక్షణాలయాన్ని స్థాపించి అనేక వర్థమాన నటులను తీర్చిదిద్దుతున్నారు.
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/దేవదాస్_కనకాల" నుండి వెలికితీశారు