వేదము వేంకటరాయ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
 
''శ్రీ శాస్త్రులవారు మదరాసు క్రైస్తవకళాశాలలో సంస్కృత ప్రథానపండితులుగాను శ్రీ సమర్థి రంగయసెట్టిగారి మరణానంతరము కాలేజిలో ప్రాచ్యభాషా ప్రవచనాధ్యక్షులుగాను (Superintendent of Vernacular studies) దాదాపు ఇరువదినాలుగు సంవత్సరములుండి 1910 సంవత్సరమున జనవరినెలలో విరమించిరి. ''
 
''..... ఒకదినము విస్తారము వర్షముకురియుచుండెను. శాస్త్రులవారు ఒక పెట్టెలో వస్త్రాదికములుంచుకొని, ఉడుపు ధరించి
జోరువర్షములో గొడుగున్నను, తడిసి, కళాశాలచేరి, ఆ తడసిన దుస్తునుతీసి పెట్టెనుండి వేఱుదుస్తుధరించి తరగతికి పోయిరి. ఆదినము అనేకులు అథ్యాపకులు రాలేదు. ప్రిన్సిపాలుగారు, దొర, శాస్త్రులవారితో నిట్లనెను. "శాస్త్రిగారూ, చూచారా, ఏవిధంగావర్షంకురుస్తున్నదో ఫలానివారు రాలేదు. వారిపనికూడా తాము చూడగలరా." శాస్త్రులవారికి నాడు విస్తారము పనియుండెను. పైగా శాస్త్రులవారికే ఎక్కువపని తగులుచుండెను. అధికారులకును ఇతరాథ్యాపకుల యందు పక్షపాతముండినది. వెంటనే శాస్త్రులవారు "వర్షమే ఒకకారణంగా తాము భావించేపక్షములో నేనుకూడారాక ఇంటనే ఉందునే" అని శాస్త్రులవారు బదులుపలికిరి.''
 
==వారసత్వం==