వేదము వేంకటరాయ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
'' ....శాస్త్రులవారికి ఎక్కుడుపని తగులుచుండెడిది. ఆవిషయమును తెలుపుటకై వారు అప్పుడప్పుడు ఇట్లడుగువారు. Who is the only christian in our college? అని అందులకు విద్యార్థులు మిల్లరనియు,(ప్రిన్సిపాల్) కాక మఱియొకరనియు చెప్పువారు శాస్త్రులవారు 'No! It is myself. I live by the sweat of my brow.' అని బదులుచెప్పువారు. మథ్యాహ్నము కార్యాధిక్యముచే వారిమొగమంతయు చెమటచే నిండిపోయెడిది.''
 
'' ....శాస్త్రులవారికి ఈనౌకరిలో పెన్షనురాదు. కళాశాలవారు మొత్తముగా కొంతద్రవ్యమొసంగు నేర్పాట్లేవో చేసియుండిరి. శాస్త్రులవారికి సంస్కృతాంధ్ర గ్రంథములను పెక్కింటినిశోధించి ముద్రింపవలయునని కోర్కెయునుండినది. మరల నచ్చాఫీసును ప్రారంభించుటకై తమకు పరీక్షకాధికారములచేత నేర్పడిన ద్రవ్యమునుచేర్చి దాదాపు మూడువేల రూప్యములను ఆర్బత్ నేటుబ్యాంకిలో వేసియుండిరి. ఈడబ్బున్నదను ధైర్యముతో అచ్చాఫీసు ప్రారంభింపదలంచి ఒకప్పుడు తాముద్యోగమును వదలుకొనెదమని తమ ప్రిన్సిపాలుతో చెప్పగా నాతడు అంతగొప్ప సంస్కృతపండితుడు మరల తమకు దొరకడనియు, శాస్త్రులవారిని అంతత్వరగాపంపివేయుట తమకిష్టము లేదనియు ఇంకను కొంతకాల ముండవలసినదనియు కోరిరి. శాస్త్రులవారు రాజీనామానొసంగెదమని ఎంతచెప్పినను దొరలు ఒప్పుకొనలేదు ఆదినము సాయంకాలము శాస్త్రులవారు ఇంటికి వచ్చుచు మార్గమున ఆర్బతునేటు బ్యాంకిమునిగిపోయినదని తెలిసికొనిరి. రాజినామాను దొరలొప్పుకొనకపోయినది మంచిదే యైనదనితలంచి కొంతకాలము ఆపనియందేయుండిరి.''
 
==వారసత్వం==