క్రియాశీల శక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
ClNO<sub>2</sub> + NO --> NO<sub>2</sub> + ClNO
 
ఇక్కడ ఎడమ పక్కన ఉన్న ClNO<sub>2</sub> మరియు NO రసాయన చర్యలో పాత్రధారులు. కుడి పక్క ఉన్న ClNO మరియు NO<sub>2</sub> చర్య జరిగిన తరువాత మిగిలిన ఉపలబ్దులు (products of reaction). ఈ రసాయన ప్రక్రియ జరుగుతూన్నప్పుడు ClNO లో నత్రజని (N) అణువుని పట్టుకుని ఉన్న హరితం (Cl) అణువు తమ మధ్య ఉన్న పరస్పర బంధం తెంచుకుని NO లో ఉన్న నత్రజని అణువుని పట్టుకుంటుంది. ఈ పని జరగాలంటే NO లో ఉన్న నత్రజని అణువు వెళ్లి ClNO<sub>2</sub> లో ఉన్న హరితం అణువుని బలంగా గుద్దుకోవాలి. ఇక్కడ విషయం సమగ్రంగా అర్థం కావాలంటే బణువులు (molecules) లో అణువుల అమరిక ఎలా ఉంటుందో అర్థం కావాలి. ఉదాహరణకి, NO బణువుకి ఉల్టా-సీదాలు ఉంటాయి; అనగా, ఒక నత్రజని శీర్షం (Nitrogen end) ఒక ఆమ్లజని శీర్షం (Oxygen end) ఉంటాయి. అలాగే ClNO<sub>2</sub> బణువుకి ఒక హరితం శీర్షం, రెండు ఆమ్లజని శీర్షాలు ఉంటాయి. అనగా, ఒక బణువుకి మూడు శీర్షాలు, మరొక బణువుకి రెండు శీర్షాలు ఉంటాయి కదా. ఈ రెండు బణువులని దగ్గరకి తీసుకువచ్చినప్పుడు Cl కి O ఎదురుపడి గుద్దుకున్నా, O కి N ఎదురుపడి గుద్ధుకున్నా రసాయన ప్రక్రియ జరగదు; Cl కి N ఎదురుపడి గుద్దుకుంటేనే రసాయన ప్రక్రియ జరుగుతుంది.
 
పైన చెప్పిన రసాయన ప్రక్రియ జరగడానికి మరొక సందర్భం కూడ కలిసిరావాలి. బణువులన్నీ ఒకే గతిజ శక్తితో (kinetic energy = 0.5 mv^2 ) తిరుగాడుతూ ఉండవు. కనుక రెండు బణువులు ఎదురుపడి గుద్దుకున్నప్పుడు అవి ఎక్కువ గతిజ శక్తితో గుద్దుకుంటే వాటి మధ్య రసాయన సంయోగం మొదలవడానికి సావకాశాలు పెరుగుతాయి. అంటే ఏమిటన్న మాట? రసాయన సంయోగానికి పాత్రధారులలో సహజసిద్ధంగా ఉండే నైసర్గిక శక్తి (free energy) ఒక కనీసపు శక్తిని - క్రియాశీల శక్తిని - మించి ఉండాలి. ఈ రకం ఊహని సమీకరణ బద్ధం చేసేరు ఎర్రీనియస్‌.
"https://te.wikipedia.org/wiki/క్రియాశీల_శక్తి" నుండి వెలికితీశారు