"క్రియాశీల శక్తి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
రసాయనాలని కలిపినప్పుడు అవి ఎంత సమర్ధవంతంగా సంయోగం చెందుతాయో చెప్పడానికి '''క్రియాశీల శక్తి''' లేదా చర్యాశీల శక్తి లేదా "ఉత్తేజన శక్తి" (activation energy) అనే భావనను స్వీడన్‌ దేశపు శాస్త్రవేత్త [[సెవెంటే ఎర్రీనియస్]] 1889 లో ప్రవేశపెట్టడము జరిగింది. దీనిని ఒక రసాయన చర్య ప్రారంభించడానికి అవసరమైన కనీస శక్తి అని నిర్వచించవచ్చు. ఈ శక్తిని సాధారణంగా ''E<sub>a</sub>'' అని సూచిస్తారు. దీనిని ఒక [[మోలు]] ఒక్కంటికి ఇన్ని కిలోజూలులు kJ/mol అని కాని, మోలు ఒక్కంటికి ఇన్ని కిలోకేలరీలు kcal/mol అని కాని కొలుస్తారు.
 
ఈ ఊహనం అర్థం అవాలంటే ఒక్క అడుగు వెనక్కి వేసి బణువుల లక్షణాలని పరిశీలించి చూడాలి. ప్రతి బణువు (molecule) కి కొంత శక్తి ఉంటుంది. ఈ శక్తి ఆ బణువు యొక్క స్థాయిని బట్టి వచ్చినదైతే దానిని స్థితిజ శక్తి (potential energy) అంటారు. ఈ శక్తి ఆ బణువు యొక్క కదలికని బట్టి వచ్చినదైతే దానిని గతిజ శక్తి (kineteic energy) అంటారు. బణువులు జోరుగా ప్రయాణం చేస్తూ, ఒకదానితో మరొకటి ఢీకొన్నప్పుడు వాటిలో ఉన్న గతిజ శక్తి ప్రభావం వల్ల ఆ బణువులో బంధాలు సాగవచ్చు, ఒంగవచ్చు, విరిగిపోవచ్చు. ఇలా ఉన్న బంధాలు విరిగి, కొత్త బంధాలు ఏర్పడడమే రసాయన సంయోగ ప్రక్రియ అంటే.
 
బణువులు మరీ నెమ్మదిగా ప్రయాణించినా, ఢీకొన్నప్పుడు అనుకూలమైన కోణంలో ఢీకొనకపోయినా రసాయన సంయోగం జరగదు; బంతులులా ఢీకొని, పరావర్తనం చెంది, మరో దిశలోకి వెళ్లిపోతాయి. బణువులు (1) కావలసినంత జోరుగా ప్రయాణం చేసి, (2) అనుకూలమైన కోణంలో ఢీకొని, (3) వాటి గతిజ శక్తి ఒక కనిష్ఠ అవధిని దాటినప్పుడు రసాయన సంయోగం జరుగుతుంది. ఆ కనిష్ఠ అవధిని క్రియాశీలక శక్తి (activation energy) అంటారు.
 
దీనికి ఒక చిన్న ఉపమానం. ఒక బండరాయిని ఒక గుట్ట మీదకి లేవనెత్తి, ఆవలికి తొయ్యాలనుకుందాం. కొద్దిపాటి శక్తితో తోస్తే రాయి జరజరా వెనక్కి జారిపోతుంది. రాయిని ఆవలికి తొయ్యాలంటే శిఖరం దాటే వరకు బలంగా తొయ్యాలి. ఈ శిఖరం ఎత్తుని క్రియాశీలక శక్తితో పోల్చవచ్చు.
 
ఈ ఊహనం (concept) ఒక ఉదాహరణ ద్వారా పరిశీలించడానికి ఈ దిగువ చూపిన ఉత్క్రమణీయ (reversible) రసాయన ప్రక్రియని పరిశీలిద్దాం:
7,998

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1733550" నుండి వెలికితీశారు