"ఏడిద నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

(సమాచారం చేర్పు)
'''ఏడిద నాగేశ్వరరావు''' ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. [[పూర్ణోదయ మూవీ క్రియేషన్స్]] (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
==బాల్యం==
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934, ఏప్రిల్ 24 న జన్మించాడు.<ref>ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015 </ref>
==కుటుంబం==
ఆయనకు భార్య జయలక్ష్మి, కూతురు ప్రమీల, కుమారులు విశ్వమోహన్, శ్రీరామ్, రాజా వున్నారు. ముగ్గురు కుమారుల్లో విశ్వమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడగా, చిన్న కుమారులు ఏడిద శ్రీరామ్ నిర్మాత, నటుడిగా, ఏడిద రాజా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు.
 
==వృత్తి==
నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1740255" నుండి వెలికితీశారు