వేదము వేంకటరాయ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
 
7.'' ....శాస్త్రులవారికి ఈనౌకరిలో పెన్షనురాదు. కళాశాలవారు మొత్తముగా కొంతద్రవ్యమొసంగు నేర్పాట్లేవో చేసియుండిరి. శాస్త్రులవారికి సంస్కృతాంధ్ర గ్రంథములను పెక్కింటినిశోధించి ముద్రింపవలయునని కోర్కెయునుండినది. మరల నచ్చాఫీసును ప్రారంభించుటకై తమకు పరీక్షకాధికారములచేత నేర్పడిన ద్రవ్యమునుచేర్చి దాదాపు మూడువేల రూప్యములను ఆర్బత్ నేటుబ్యాంకిలో వేసియుండిరి. ఈడబ్బున్నదను ధైర్యముతో అచ్చాఫీసు ప్రారంభింపదలంచి ఒకప్పుడు తాముద్యోగమును వదలుకొనెదమని తమ ప్రిన్సిపాలుతో చెప్పగా నాతడు అంతగొప్ప సంస్కృతపండితుడు మరల తమకు దొరకడనియు, శాస్త్రులవారిని అంతత్వరగాపంపివేయుట తమకిష్టము లేదనియు ఇంకను కొంతకాల ముండవలసినదనియు కోరిరి. శాస్త్రులవారు రాజీనామానొసంగెదమని ఎంతచెప్పినను దొరలు ఒప్పుకొనలేదు ఆదినము సాయంకాలము శాస్త్రులవారు ఇంటికి వచ్చుచు మార్గమున ఆర్బతునేటు బ్యాంకిమునిగిపోయినదని తెలిసికొనిరి. రాజినామాను దొరలొప్పుకొనకపోయినది మంచిదే యైనదనితలంచి కొంతకాలము ఆపనియందేయుండిరి.''
 
8."నేను నాయాంథ్రాభిజ్ఞాన శాకుంతలమును ప్రకటించి వారికి ఒకప్రతి పంపితిని. అంతటవారు నాతో సమావేశముంగోరి మదరాసు మౌంటురోడ్డు మోతీమహలులో నాకు దర్శనమొసంగి సల్లాపానంతరము నాకు కొంతధనము పారితోషిక మొసంగవచ్చిరి. నేను వారిని ఇట్లు ప్రశ్నించితిని. 'ఈగ్రంథము ముద్రితమైనది. దీనికై యిపుడునేను అధమణున్ండనుగాను. జీవనమునకై నాకు క్రిశ్చియన్కాలేజిలో కొలువున్నది. ఏలఏలినవారు నాకు ఈధనమీయవలయును. ఏలనేను కైకొనవలయును?' అంతట వారు సెలవిచ్చిరి, 'మీకు కాలేజిలో జీతము స్వల్పము. అదిమీకు కుటుంబభరణమునకే చాలదు.
*మూలము:https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Vedhamu_Venkataraya_Shastrula_Vari_Jeevitha_Charitra_Sangrahamu.pdf/132
* వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము...రచయిత వేదము వేంకటరాయ శాస్త్రి ,సంవత్సరం 1943