ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు

→‎ఫిలిం యొక్క చరిత్ర: వర్ణపట గుర్తింపు
విస్తరణ
పంక్తి 1:
[[Image:undeveloped film.png|thumb|350px|right|సంవిధానం చెందని ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిలిం]]
ఫోటోగ్రఫిక్ ఫిలిం అనునది ప్లాస్టిక్ తో చేయబడిన ఒక ప్రక్క [[జెలటిన్]] మిశ్రమం పూయబడిన, అతి సూక్ష్మమైన కాంతిని గుర్తించగల [[సిల్వర్ హ్యాలైడ్]] అనే రసాయనం యొక్క అతి సూక్ష్మ స్ఫటికాలు గల పారదర్శక పట్టీ లేదా తావు. ఈ స్ఫటికాల పరిమాణము మరియు ఇతర లక్షణాలు కాంతిని గుర్తించగల సామర్థ్యం, రంగుల వైరుధ్యం మరియు స్పష్టతని నిర్దేశిస్తాయి.
 
ఈ మిశ్రమం కాంతికి బహిర్గతం చేసినచో కొంత సమయానికి అది నల్లగా మారిపోతుంది. ఈ ప్రక్రియ నిదానంగా కొనసాగిననూ అలఅలా బహిర్గతమైన ఫిలిం వాడుకలో ఎందుకూ పనికిరాదు. దీనికి బదులుగా ఫిలిం ని కెమెరాలో అమర్చి కెమెరా ద్వారా ఒక ప్రతిబింబానికి ఫిలిం ని అతి తక్కువ [[బహిర్గతం|బహిర్గతానికి]] గురి చేసినచో ఫిలింపై ఉన్న ఒక్కో స్ఫటికం గ్రహించే కాంతికి అనుగుణంగా రసాయనిక చర్య జరిగి మిశ్రమం పై గుప్త ప్రతిబింబం ఏర్పడుతుంది. అటు తర్వాత దీనిని రసాయనిక చర్యలకి గురి చేసి ఒక ఛాయాచిత్రంగా ముద్రించవచ్చును.
 
కంటికి కనబడే కాంతితో బాటుగా అన్ని రకాల ఫిలింలు [[ఎక్స్-రే]] కిరణాలని మరియు పలు రకాల కాంతులని గుర్తించగలవు. వీటిలో చాలా ఫిలింలు అతినీలలోహిత కాంతిని సైతం కొంత వరకు గుర్తించగలవు. కొన్ని ప్రత్యేకమైన ఫిలింలు పరారుణకాంతిని కూడా గుర్తించగలవు. పూర్వం ఫిలిం లలో రసాయనిక మార్పులకు లోను కాని సిల్వర్ హాలైడ్ స్ఫటికాలు దృశ్యమాన వర్ణపటంలో కేవలం నీలి కాంతిని మాత్రం గుర్తించగలిగేవి. దీనితో ఇతర వర్ణాలు ఉన్న విషయాలను చిత్రీకరించినపుడు వాటి ఛాయాచిత్రాలలో అసహజత్వం నెలకొనేది. సిల్వర్ హాలైడ్ స్ఫటికాలతో అధిశోషణ చెంది, వాటిని ఇతర వర్ణాలను కూడా గుర్తించేలా చెయ్యగలిగే కొన్ని ప్రత్యేకమైన అద్దకాలను కనుగొనటంతో ఈ సమస్య అధిగమించబడ్డది.
 
[[బ్లాక్ అండ్ వైట్]] ఫిలింలో సిల్వర్ లవణాలు గల ఒకే ఒక పొర ఉంటుంది. బహిర్గతమైన కణాలను సంవిధానం చేస్తే సిల్వర్ లవణాలు మెటాలిక్ సిల్వర్ గా మారి కాంతిని అడ్డగిస్తుంది, అనగా నలుపు రంగులో కనబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఫిల్మ్" నుండి వెలికితీశారు