దుర్గి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 106:
==గ్రామ చరిత్ర==
===శిల్పకళా ప్రశస్తి===
"దుర్గి" లోని శిల్పకళాకేంద్రాలు చేతివృత్తులవారి నైపుణ్యానికి అద్దం పడతాయి. క్రీ.శ.12వ శతాబ్దంలోనే దుర్గి శిల్పకళకు బీజం పడినట్లు తెలుస్తోంది. గ్రామంలోని ఓంకారేశ్వర, నగరేశ్వర, నాగేశ్వర, వీరభద్ర, వేణుగోపాల స్వామి దేవాలయాలను స్థానికులే నిర్మించినట్లు శిలాశాసనాలు తెల్పుచున్నవి. మాచర్ల చెన్నకేశవస్వామి, వీరభద్రస్వామి దేవాలయాలయాలు, అమరావతి, నాగార్జునకొండలలో నిర్మించిన బౌద్ధస్థూపాల నిర్మాణం వెనుక దుర్గి శిల్పుల పాత్ర ఉన్నట్లు చరిత్రకారుల కథనం. తదనంతరం శిల్పకళాపోషకులు అంతరించే దశకు చేరటంతో, శిల్పకళకు జీవం పోసేందుకు ప్రభుత్వం, 1962 లో దుర్గిలొ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వందలమందికి శిక్షణ ఇచ్చి, శిల్పులను తయారు చేసింది. ఇప్పటికీ నాగార్జున శిల్పకళాకేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. 1984 లో హైదరాబాదులో విఘ్నేశ్వర ఉత్సవాల సందర్భంగా, ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాల ప్రదర్శనలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ [[ఎన్.టి.రామారావు]] తిలకించి సన్మానం చేశాడు. ఒకప్పటి ముఖ్యమంత్రి శ్రీ [[టంగుటూరి అంజయ్య]] కూడా శిల్పకళాకేంద్రాన్ని దర్శించాడు. 1996 లో స్టోనా-96 పేరిట బెంగళూరులో నిర్వహించిన ప్రపంచ శిల్పవిగ్రహ ప్రదర్శనలో పాల్గొనాలని కేంద్రప్రభుత్వం దుర్గి శిల్పకళాకేంద్రానికి ఆహ్వానం పంపింది<ref>ఈనాడు గుంటూరు రూరల్, 12 జులై 2013, 8వ పేజీ</ref>.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/దుర్గి" నుండి వెలికితీశారు